7th సెన్స్‌ను మేల్కొలపండి... | 7th sense to be increased them | Sakshi
Sakshi News home page

7th సెన్స్‌ను మేల్కొలపండి...

Published Thu, Dec 25 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

7th సెన్స్‌ను మేల్కొలపండి...

7th సెన్స్‌ను మేల్కొలపండి...

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలుదీరింది...ఇక కొలువుల ప్రక్రియ మొదలు కానుంది. ఉద్యోగ ప్రకటనలు త్వరలో రాగలవనే సమాచారం నిరుద్యోగుల్లో కొండంత ఆశలను రేకెత్తిస్తున్నాయి. దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనుండటం అరుదైన విషయమే. ఈ సమాచారంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులే దర్శనమిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ పోటీలో మేం సాధించగలమా? అన్న ప్రశ్న వేలాది మందిని వేధిస్తోంది. కానీ మనిషి అనుకుంటే సాధించలేనిదేమి లేదు. మన పంచేంద్రియాలు(జ్ఞానేంద్రియాలు) రోజు వారీ పనులను చక్కబెడతాయి...ఆపద నుంచి బయటపడేసేది సిక్త్‌సెన్స్...కానీ మనకు గతంలో పరిచయం, ఊహించని శక్తి దాగివుందని తెలిపేది ‘సెవెంత్ సెన్స్ ’ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు సరిగ్గా దాన్ని నిద్ర లేపాల్సిన తరుణమిదే.

 
* సంశయం వీడి ముందుకు సాగండి
* ఆత్మ విశ్వాసం ఉంటే ఉజ్వల భవిత మీదే


నల్లగొండ అర్బన్: మూడేళ్ల క్రితం విడుదలైన సెవెంత్‌సెన్స్ సినిమా గుర్తుందా...అందులో 1600 ఏళ్ల క్రితం జీవించిన బోధిధర్ముడిని తిరిగి రప్పించటం ఆ సినిమా కథాంశం. కాకపోతే అది జన్యు నిర్మాణం(జెనెటిక్ ఇంజినీరింగ్). మనం ఎంచుకున్న లక్ష్యాని కనుగుణంగా మానసికంగా తమనితాము తీర్చిదిద్దుకోవడం భవిష్యత్ నిర్మాణం... ఇది మరో సెవెంత్ సెన్స్. వ్యక్తి మేధస్సుపై 15 నుంచి 20 శాతం లక్షణాల్లోనే అతని వంశపారం పర్య ప్రభావం ఉంటుందట. మరో 15 నుంచి 20శాతం వరకు పరిసరాలు అతన్ని ప్రభావితం చేస్తే మిగతా 60 నుంచి 70 శాతం మాత్రం వ్యక్తి సొంత నిర్ణయంపైనే ఆధారపడి జీవితం సాగుతుందట. అందుకోసం మానసికంగా ముందు సిద్ధమవ్వాలని హార్వార్డ్ పరిశోధకులు చానాళ్ల క్రితమే తేల్చారు.
 
ముందుకు సాగాలి ఇలా...
ఏ ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నారో ముందు స్పష్టత ఉండాలి. ఆ రంగంలో రాణించిన ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలి. జెనెటిక్ ఇంజి నీరింగ్ ద్వారా వారి జీన్స్‌ను మీకు ఎక్కించడం సాధ్యమయ్యే(ఇప్పటికైతే) పనికాదు కాబట్టి వారు సాధిం చిన విజయాలు, వృత్తిలో ముందుకెళ్లిన తీరును  మీకు మీరు ఆపాదించుకోవాలి. ఉదాహారణకు పోలీసు కావాలనుకుంటున్న వారు, ఆ శాఖలో పేరు ప్రఖ్యాతలు సాధించిన కిరణ్‌బేడి లాంటి వారిని ఆదర్శంగా భావించాలి. అలా ఆయా రం గాల్లోని వారిని ఆదర్శంగా తీసుకుని వారి తీరును గుర్తు చేసుకోవాలి. అదే బాట లో పయనించాలనే మీ లక్ష్యానికి పట్టుదలతో పదును జోడించాలి. అదే భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుంది.
 
 
 1
 ఆత్మ పరిశీలన

 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు.వారి బలం, బలహీనతలపై ఆత్మ పరి శీలన చేసుకోవాలి. వాటిని ఎప్పటికపుడు ఓ పుస్తకంలో రాసుకుని అధిగమించేందుకు కృషి చేయాలి.

2
అనుకూల పరిసరాలు

తమ చుట్టూ ఉన్న పరిసరాలను అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే వాయిస్‌మెయిల్ ఆన్ చేయాలి. మరీ ఇబ్బందిని అనిపిస్తే నంబర్లు మార్చండి. ఉదయం అరగంట పాటు యోగా, వ్యాయామం చేయాలి.
 
3
పాజిటివ్ థింకింగ్

చాలా మంది తమ బలాలను గుర్తించరు. పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు గొప్ప విషయాలను చెప్పేవారు, పరీక్షా కేంద్రంలో తడబడతారు. పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. బలాన్ని ద్విగుణీకృతం చేసే యత్నం చేయాలి.
 
4
ఒక్క అడుగుతోనే మొదలు
..
కొండంత సిలబస్‌ను చూసి బెంబేలు చెందొద్దు. ఒకేరోజు అంతా పూర్తిచేయడం ఎవ్వరికి సాధ్యం కాదు. వేయి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. అలాగే ఎంత పెద్ద సిలబస్ అయినా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని, చదివినదాన్ని పునఃశ్చరణ చేయాలి. తర్వాత వీలుంటే వాటిని కాగితంపై పెట్టాలి. సమాధానాలతో సరిపోల్చుకోవాలి. అప్పుడే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
 
5
నెగెటివ్ ఆలోచనలొద్దు

కొందరు ప్రిపరేషన్‌ను బాగానే కొనసాగిస్తుంటారు. ఒకటి, రెండు లక్ష్యాలను చేరుకోలేకపోయేసరికి ఢీలా పడతారు. ఇతరుల కంటే వెనుకబడ్డామనే ఆలోచన వచ్చిందంటే ఇక అంతే వెనుకబడిపోతారు. అది తప్పుడు ఆలోచన. ఎవరు ఎక్కువ చదివారన్నది పోటీ పరీక్షలకు సంబంధం లేదు. ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలిగామా అన్నదే ప్రధానం.
 
6
ఆత్మవిశ్వాసం

ఇలాంటి లక్షణాలన్నీ మీరు ఆపాదించుకోవాలంటే ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సాధించాలనే కాంకక్ష ముఖ్యం. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో సలడనీయవద్దు. వేళకు తీనేలా, పడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక సక్కెస్ మీదే...విష్‌యూ ఆల్‌ది బెస్ట్.
 
7
విజేతలతో జట్టు కట్టాలి

సంకుచిత ఆలోచనలు మనిషి వెనక్కులాగుతాయి. సానుకూల ఆలోచనలు అంతే ముందుకు తీసుకెళ్తాయి. ఇది వరకు పోటీ పరీక్షల్లో విజయవం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటే ధైర్యం కలుగుతుంది. వీలయితే వారి సూచనలు, సలహాలు స్వీకరించాలి. వారి అనుభవం మీ లక్ష్యాన్ని విజయ పథాలకు తీసుకెళ్లగలదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement