కోట్స్ = కొండంత ఆత్మ విశ్వాసం
‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతేమంది ఉన్నారు.
హితబోధకు భిన్నంగా విజయపు విశ్వాసాన్ని ఇచ్చే నయా వేదాంతం పట్ల యువత ఎంతో ఆసక్తి కనపరుస్తోంది. ‘‘ఈ వాక్యం నా కోసమే చెప్పింది.. నా లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ అవుతోంది’’ అనుకుంటే చాలు టక్కున షేర్ చేసుకోవడమే!
‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ఫేస్‌బుక్‌లో నడుస్తున్న ఈ కోట్స్ ట్రెండ్ గురించి!
‘‘నేను అనేకసార్లు ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. నా స్నేహితుడు అన్నింటిలోనూ పాసయ్యాడు. అతడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో ఒక ఉద్యోగి. నేను మైక్రోసాఫ్ట్ ఓనర్‌ను...’’
అతి విశ్వాసం ధ్వనిస్తోందా? లేక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందా? స్ఫూర్తిని పంచుతోందా? అంటే చెప్పలేం కానీ నేటి యువతకు బాగా నచ్చిన వాక్యమిది. ఫేస్‌బుక్‌లో బాగా షేర్ అవుతుండటమే ఇందుకు రుజువు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఆపాదించబడిన ఈ కామెంట్ ఎందరో యువకులకు స్ఫూర్తిని ఇస్తోంది. తమ జీవితంలో ఎదుర్కొన్న పెద్ద ఫెయిల్యూర్‌ల తర్వాతే గొప్పవాళ్లంతా అద్భుతమైన సక్సెస్‌లను సాధించారు అనే విషయాన్ని పై కామెంట్ చెప్పకనే చెబుతోంది.
‘‘అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాళ్లే గొప్ప విజయాన్ని సాధించగలరు. గుర్తుంచుకోండి... ఫెయిల్యూర్ ఒక సంఘటన మాత్రమే. ఒక వ్యక్తి కాదు’’ రాబర్ట్ కెన్నడీ కోట్ ఇది. ఈ మాటలు... అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, గొప్పవిజయాన్ని సాధించవచ్చుననే విశ్వాసాన్నీ ఇస్తోంది.
‘‘నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది... పరాజయాన్ని ఆస్వాదించలేకపోతే, విజయానందాన్ని పొందలేరని. విమర్శలు ఎదుర్కొనకపోతే పొగడ్తలకు అర్హురాలివి కాదు’’ అని ఒక అవార్డ్ ఫంక్షన్‌లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి హాలీబెర్రీ చెప్పిన వాక్యమిది. హాలీబెర్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఆమె చెప్పిన ఈ మాటను కూడా అంతే ఇష్టపడుతున్నారు. అందులోని స్ఫూర్తిని గ్రహిస్తున్నారు.
‘‘ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వారిని నేను నమ్ముతాను. అభినందిస్తాను. అయితే తిరిగి ప్రయత్నించకపోవడాన్ని మాత్రం సమర్థించను’’ అంటున్నాడు ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్. ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నో కోట్స్... కొండంత ధైర్యాన్ని ఇచ్చేవి!
- జీవన్‌రెడ్డి.బి