Jeevan Reddy. B
-
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు
సందీప్ మాధవ్ టైటిల్ రోల్లో జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భ ంగా దర్శకుడు జీవన్ రెడ్డి, కెమెరామేన్ సుధాకర్ రెడ్డి యక్కంటి మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘జార్జ్ రెడ్డి’ కథను సినిమాగా తీయాలనుకున్నప్పుడు చాలా పరిశోధన చేశాం. జార్జ్ రెడ్డి గురించి తెలిసిన వాళ్లను కలిశాం. వాళ్ల దగ్గర నుంచి వివరాలు సేకరించాం. ఆ సేకరించిన వివరాలు చదవడానికే నాకూ, కెమెరామేన్ సుధాకర్ అన్నకు కొన్ని నెలలు పట్టింది. జార్జ్ రెడ్డి లైఫ్ జర్నీనే స్క్రీన్‌ప్లేగా చూపించాలనుకున్నాను. ఆయన గురించి చెప్పాలంటే 10–12 గంటల సినిమా తీయాలి. రెండున్నర గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినదాంతో సుమారు 120 బయోపిక్స్ తీయొచ్చు అనిపించింది. జార్జ్ రెడ్డి సిద్ధాంతాలు ఏంటి? ఆయన ఎమోషన్స్ ఏంటి? జార్జ్ రెడ్డి నిజాయితీ, తన ఫైటింగ్ స్పిరిట్ ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. ఇప్పటి తరం వాళ్లు కూడా అవసరమైనప్పుడు తమ గొంతుని వినిపించాలి. ఈ సినిమా ఎవర్నీ కించపరచకూడదనుకున్నాం. కథకు తగ్గట్టుగానే కొన్ని కమర్షియల్ హంగులు జోడించాం. ఉస్మానియా యూనివర్శిటీలో చాలా కథలున్నాయి. వాటిని సినిమాలుగా తీస్తాను’’ అన్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తెలుగు సినిమా హీరోల కన్నా పెద్ద హీరో జార్జ్ రెడ్డి. ఈ సినిమాను యువత అందరూ చూడాలి. ‘రైజ్ యువర్ వాయిస్’ అనేది జార్జ్ రెడ్డిగారి నినాదం. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పే ధైర్యం కావాలి. అలాంటి లక్షణం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఆ స్ఫూర్తిని యూత్‌కి చెప్పాలనుకున్నాం’’ అన్నారు. -
వివరం: అంచనాలకు అందని వేగం
‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక, చివరి చేపను కూడా పట్టేశాక.. అప్పుడు గుర్తిస్తావు నువ్వు డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్‌ఇండియన్ల సామెత ఇది. వాళ్లను ఆదిమవాసులు అనుకోవడమే కానీ.. వారికున్న విజ్ఞత నాగరికులుగా పేరుపొందిన వాళ్లమైన మనకులేదు! అందుకు అనేక రుజువులున్నాయి. అలాంటి రుజువుల్లో ఒకటి పెరుగుతున్న జనాభా! భూమికి భారమవుతున్న జనాభా! ప్రకృతికి శాపంగా మారుతున్న జనాభా. పెరుగుతున్న జనాభా వల్ల వచ్చే అనర్థాల గురించి చర్చించేందుకు, అవగాహన నింపడానికి, ఆందోళ న వ్యక్తం చేయడానికి, అంతిమంగా హెచ్చరించడానికి నిర్ణయించినదే ‘పాపులేషన్ డే’. ఒక ఆందోళన కరమైన ‘అచీవ్మెంట్’కు జ్ఞాపిక ఈ పాపులేషన్ డే. ఐక్యరాజ్యసమితి ప్రతియేటా జనాభాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాపులేషన్ డేను నిర్వహిస్తోంది! జూలై 11 నే ఎందుకంటే..! 11-07-1987 న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరింది. అందుకనే జూలై 11 ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. 17 యేళ్ల కిందట ప్రపంచజనాభా ఐదువందల కోట్లను చేరడాన్నే అత్యంత ఆందోళన కరమైన పరిణామంగా భావించింది ఐక్యరాజ్యసమితి. ఈ విషయంలో ప్రతిదేశంలోనూ అవగాహనను నింపడానికి 1989 నుంచి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టింది. తద్వారా జనాభానియంత్రణకు ప్రణాళికలను అమలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఏడొందల కోట్లు చేరింది! ప్రతి సెకనుకూ ఐదుగురు జన్మిస్తున్నారు, ఇద్దరు మరణిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ప్రతి సెకనుకూ ప్రపంచ జనాభా ముగ్గురు చొప్పున పెరుగుతోంది. జనాభా నియంత్రణ విషయంలో పాపులేషన్ డేని జరుపుకోవడం 15 సంవత్సరాలు పూర్తి అయ్యే సరికి జనాభా 700 కోట్లు దాటింది. మరో 20 సంవత్సరాల్లో 900 కోట్ల ఫిగర్‌ను క్రాస్ చేస్తుందని అంచనాలున్నాయి. సర్వసమస్యలకూ మూలం! గత కొన్ని సంవత్సరాలుగా జనాభా పెరుగుదల గురించి విస్తృతమైన చర్చ, జనాభాను నియంత్రించడానికి తీవ్రమైన ప్రయత్నాలూ జరగడం లేదనేది వాస్తవం. చర్చించకుండా ఎవరికి వారు మరిచిపోయినంత మాత్రాన ఒక సమస్య మాయం కాదు కదా! అది కూడా భూ ప్రపంచంపై మనిషి ఎదుర్కొంటున్న సర్వసమస్యలకూ మూలం అధిక జనాభా అనే సమస్యేనని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. సహజవనరులైతేనేమీ, సృష్టించుకొన్న వనరులు అయితేనేమీ... అధికంగా వినియోగించేయడానికి కారణం అవుతోంది జనాభా సమస్య. దీంతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తప్పేలా లేదు. వర్తమానం ఆందోళనకరం, భవిష్యత్ ప్రమాదకరం! దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆయా సమయాల్లో వర్తమానంలో ఉన్న వారిని ఆందోళనకు గురి చేస్తూ, భవిష్యత్ తరాల మనుగడకు ప్రమాదకరంగా మారింది జనాభా సమస్య. అవకాశాల వేటలో ఉన్న ప్రస్తుత తరాలకు పోటీ ఎక్కువవుతోంది. మంది ఎక్కువై మజ్జిగ పలుచన అవుతోంది. అధిక జనాభా ఫలితంగా రెడ్ఇండియన్లు తరాల వెనుక చెప్పిందే ప్రస్తుతం జరుగుతోంది. ఈ తరంలోనే ఆఖరి చెట్టును కొట్టేయడం, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేయడం, చివరి చేపను కూడా పట్టేయడం జరిగిపోయేలా ఉంది. దీన్ని బట్టి భవిష్యత్తు, భవిష్యత్ తరాల ఉనికి ప్రశ్నార్థకమే! అందరూ ఒప్పుకొంటున్న చేదు వాస్తవం ఏమిటంటే... జనాభా ను ఒక సమస్యగా చూడటం బాగా తగ్గింది. 1970లలోనూ, 80లలోనూ మనదేశంలో కూడా జనాభా నియంత్రణ ప్రభుత్వానికి ఉన్న ముఖ్య బాధ్యతల్లో ఒకటి అయ్యింది. ప్రజల్లో ఈ అంశం గురించి అవగాహన నింపడం కూడా ప్రాముఖ్యతతో కూడిన అంశం అయ్యింది. అయితే సంస్కరణలు మొదలయ్యాకా.. దేశంలో మానవులు కూడా ఒక వనరులు అయ్యారు. అధిక స్థాయిలో జనసంఖ్యను కలిగి ఉండటం కూడా ఒక విధంగా మంచిదే .. ఈ వనరులను సరిగా ఉపయోగించుకొంటే ఆర్థికంగా వృద్ధి సాధింవచ్చనే అనే వాళ్లు ఎక్కువయ్యారు. ఈ గణాంకాలు సమస్య కాదంటున్నాయి! ప్రస్తుతం భూ ప్రపంచం మీద ఉన్న మానవుల జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో దాదాపు 40 కోట్ల మంది కూడూగుడ్డ లేకుండా ఉన్నారు. అర్ధాకలితో నిద్రపోతున్న వాళ్ల సంఖ్య మరో 60 కోట్ల మంది. అయితే యేటా ఇలలో పండుతున్న ఆహార వనరులతో అలవోకగా తొమ్మిది వందల కోట్ల మంది మనుగడ సాగించవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని సాగుభూమికి 900 కోట్ల మందికి ఆహారాన్ని పెట్టే సత్తా ఉంది. ఏ అతివృష్టిలూ, అనావృష్టిలూ ఎదురుకాకపోతే.. ప్రపంచానికి దాదాపు 900 కోట్ల మందికి తిండి పెట్టగలదు. కానీ సమతుల్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఉన్న ఏడువందల కోట్లమందిలోనే వంద కోట్ల మందికి ఆహారం అందకుండా పోతోంది. ఇదికాక యేటా మూడు వందల కోట్ల మందికి సరిపడా ఆహారం వృధాగా పారబోయడమో లేక ప్రకృతి విపత్తుల వల్ల అసలు పండకుండాపోవడమో జరుగుతోంది! తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటికైనా ఆహారవనరులు, జనాభాలు సమతుల్యంగా అవుతాయి. అందుకే ఇప్పుడు జనాభాను నియంత్రించడం కన్నా వనరులను సద్వినియోగం చేసుకోవాలి.. ఆహారాన్ని వృధా కానివ్వకూడదు, వృధాగాపోతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయాలి.. అనే నినాదాలు వినిపిస్తున్నాయి. వీటి మధ్య అధిక జనాభాను అరికట్టాలన్న నినాదం కొంచెం వెనుకబడింది. అవసరం లేకపోయినా, అవగాహన లేక..! మన దేశం వరకూ జనాభాను నియంత్రించాలంటే అందుకు ఉన్న ఏకైకమార్గం ప్రజల్లో అవగాహన కల్పించడమే! ఎందుకంటే... ఇప్పటికీ మన దేశంలో గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రతియేటా 20 కోట్లమంది మహిళలు అసంకల్పితంగా గర్భం దాలుస్తున్నారంటే సమస్య మూలం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు! అప్పటికే ఇద్దరు పిల్లల పరిమితిని దాటి, ఇంకా సంతానాన్ని వృద్ధి చేసుకోవాలన్న ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేకపోయినా... వాళ్లు పిల్లల్ని కంటున్నారు. జనాభాను పెంచి పోషిస్తున్నారు. దేశానికి సమస్యను తెచ్చి పెడుతున్నారు! మన దేశంలో సంతాన సఫలత రేటు కూడా ఎక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. చలి దేశాల కన్నా మనదేశంలో సఫలత రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో మన దగ్గర నూతన అతిధుల రాక ఎక్కువవుతోంది! గతంతో పోలిస్తే వృద్ధిరేటు తగ్గింది! 1991-2001 లమధ్య జనాభా వృద్ధి రేటుతో పోలిస్తే 2001-2011ల మధ్య జనాభా పెరుగుదల కొంత మేర తగ్గిందని అంటున్నాయి గణాంకాలు. వంద కోట్ల జనాభా వృద్ధి చేసిన జనాభాతో పోలిస్తే, 120 కోట్ల మంది వృద్ధి చేసిన జనాభా దాదాపు రెండున్నర శాతం తక్కువ. దీన్ని బట్టి మన వాళ్లలో అవగాహన పెరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఒక దశలో జనాభా విపరీతంగా పెరగడం, ఇప్పుడు భారతీయుల ఆయుఃప్రమాణ రేటు పెరగడం వల్ల జనాభా పెరుగుదల మనకు పరిష్కారం కాని సమస్యే గానే మిగిలింది. ఇంతే నియంత్రణతో ముందుకెళ్లినా కేవలం రెండు దశాబ్దాల్లోనే మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా అవతరించనుంది. ఇప్పుడు జనసంఖ్యలో మనకన్నా ముందున్న జనచైనాలో కఠినమైన నియంతృత్వం జనాభా వృద్ధిరేటును తగ్గిస్తోంది. మనదగ్గర అలాంటి ధోరణి లేకపోవవడంతో.. జనాభా విషయంలో టాప్ పొజిషన్‌కు చేరడం దాదాపుగా ఖాయమైంది. ఇది ‘కుటుంబ ప్రణాళిక హక్కు’ ఏడాది! పాపులేషన్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని ‘హ్యూమన్ రైట్ టు ప్లాన్ ఫర్ ఏ ఫ్యామిలీ’గా నిర్ణయించింది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ప్రజల్లో అవగాహనను నింపడానికి కార్యచరణను రూపొందించి, ఏడాదిపాటు ప్రభుత్వాల సాయంతో అమలు పెట్టనున్నట్టు ప్రకటించింది. - అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం సింగపూర్. అక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకు 7,300 మంది ఉంటారు. - ప్రపంచ జనాభాలో స్త్రీ పురుషు జనాభాను చూసుకొంటే అది 1000:1010గా ఉంది. - పురుషుల సగటు ఆయుఃప్రమాణం 65 యేళ్లు కాగా, మహిళలు సగటున 69 యేళ్లపాటు జీవిస్తున్నారు - భూమిపై ఇప్పటి వరకూ 10,800 కోట్ల మంది ప్రజలు భూమిపైకి అతిధులుగా వచ్చారని అంచనా. వారిలో ప్రస్తుతం ఇలపై ఉన్న వారు దాదాపుగా ఏడు వందల కోట్ల మంది. ఇది కేవలం 6.4 శాతం మాత్రమే. - ఏడు బిలియన్ల జనాభాలో మీరు ఎన్నవవారు?! అనే విషయాన్ని చెబుతుంది పాపులేషన్ యాక్షన్ వెబ్ సైట్.. ఆ సైట్లోకి ఎంటర్ అయ్యి మీరు జన్మదిన వివరాలను ఇస్తే.. ఈ నంబర్ ఎంతో తెలుసుకోవచ్చు! నియంత్రణ మొదలు పెట్టింది మనమే నియంత్రణ విషయానికి వస్తే తొలిసారి అధికారికంగా దీన్ని అమలు చేసిన గొప్పదనం మన దేశానిదే! ప్రపంచ దేశాల కన్నా ముందే అధికజనాభా వల్ల సమస్యలను గుర్తించి వాటి నివారణ కోసం జనాభాను నియంత్రించాలని భావించింది. అయితే మనదేశ ంలో దశాబ్దాలుగా జనాభా విషయంలోని వృద్ధిరేటును గమనిస్తే కుటుంబ నియంత్రణ పథకం అనేది దారుణంగా విఫలమైందని అర్థం అవుతోంది. జనాభా సమస్యను అరికట్టడానికి ఇంకా చాలా కసరత్తే చేయాల్సి ఉంది. మన రాష్ట్రాలు దేశాలతో పోటీపడుతున్నాయి! ప్రపంచంలోని వివిధ దేశాల కన్నా మన దేశంలోని చాలా రాష్ట్రాల జనాభా అధికం అనే విషయం అందరికీ అవగాహన ఉన్నదే. గణాంకాల ప్రకారం తీసుకొంటే... ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ దేశ జనాభా కన్నా ఎక్కువ. మహారాష్ట్ర జనాభా మెక్సికోతో పోటీ పడుతోంది. బీహార్ జనాభా జర్మనీతో సమానం. - ఇక మన దేశంలోని బుల్లి రాష్ట్రాలు కూడా జనాభా విషయంలో చాలా దేశాల కన్నా ముందున్నాయి. అసమతుల్యత కూడా ప్రమాదమే! అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ముసలి వాళ్ల శాతం బాగా పెరిగిపోయింది. ఒకత రం వారు సంతానానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. యాంత్రికంగా తాము బతికితే చాలనుకొన్నారు. దీంతో జనాభాలో అసమతుల్యత. ముప్పై యేళ్లలో ఉన్న జనాలంతా ముసలివాళ్లు అయ్యారు. యువత చూద్దామన్న లేకుండా పోయింది. కేవలం ఈ నగరంలోనే కాదు..ఐక్యరాజ్యసమితి చేత జనాభాను తగ్గించుకొంటున్న దేశంగా కీర్తిని పొందిన జపాన్‌లో కూడా అసమతుల్యత ఎక్కువగా ఉంది. నియంతృత్వంతో జనాభాను నియంత్రిస్తున్న చైనాకు కూడా ఈ ప్రమాదం ఉంది. అయితే సమతుల్యత విషయంలో మనదేశం పరిస్థితి పర్వాలేదని అనుకోవాలి. యూరప్‌లో జనాభా తగ్గుతోంది... ఒకవైపు ప్రపంచ జనాభా పెరిగి పోతున్నా.. యూరప్ జనాభా మాత్రం క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేకించి తూర్పు యూరప్, రష్యాల్లో జనాభా క్రమంగా క్షీణిస్తోంది. సంతాన సాఫల్యత రేటు తక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణం. ప్రస్తుతం యూరప్ జనాభా 740 మిలియన్లు కాగా 2050కి ఈ జనాభా 732 మిలియన్లకు తగ్గుతుందని అంచనా! ఆ దేశం పరిస్థితి తలకిందులైంది! జింబాబ్వే... ఒకప్పటి దక్షిణ రుడేషియా. చదరపు కిలోమీటరుకు 37 మంది జనాభాతో ఉండిన ఈ ఆఫ్రికన్ దేశం ఒకప్పుడు ‘బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా’గా పేరు పొందింది. అయితే క్రమంగా పెరిగిన జనాభా, తీవ్రమైన కరువు కాటకాలు ఆ దేశాన్ని ప్రమాదంలోకి పడేశాయి. ప్రస్తుతం మనుషుల జీవనం అత్యంత దుర్భరంగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జింబాబ్వే. ఇలాంటి పరిణామాలన్నింటికీ కారణం అధిక జనాభానే! ఈ దేశాలు పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి.. అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, డెన్మార్క్, రష్యా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, యూకేల్లో ఎక్కువమంది పిల్లను కనే జంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలున్నాయి. నెగిటివ్ గ్రోత్ రేట్‌తో అసమతుల్యత వస్తుందనే భయంతో ఈ దేశ ప్రభుత్వాలు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనే జంటలకు పోత్సాహాన్ని ఇస్తున్నాయి. పిల్లలను కంటామనే దంపతులకు ఉద్యోగవిధుల నుంచి సెలవులిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నాయి! పిల్లల పోషణకు గానూ డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఒకరి సమస్యమాత్రమే కాదు! రోడ్డు మీద మనం బైక్ బాగా నడిపితే సరిపోదు... పక్కవాళ్లు కూడా జాగ్రత్తగా నడుపుతున్నప్పుడే మనం కూడా సేఫ్ జర్నీ చేయగలం. జనాభా విషయంలోనైనా అంతే... ఇది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు.. అందరి చేతా అందరికీ సమస్యగా మారే సమస్య. ఏదో ఒక దేశం నియంత్రిస్తే సరిపోదు.. సమూహ జీవనంలో అందరూ బాధితులే అవుతారు. చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. ఈ దేశాలు ఇప్పుడు జనసంఖ్య విషయంలో టాప్ కంట్రీస్‌గా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా తీసుకొంటే వీటిలో చైనా, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు జనాభా పెద్ద సమస్య. ఇక విస్తీర్ణం తక్కువగా ఉన్నా.. జనాభా ఎక్కువగా ఉండటంతో కూడా కొన్ని దేశాలు ఈతిబాధలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి విషయంలో ఆఫ్రికాదేశాలను ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోని 77 దేశాలు అధిక జనాభా ఫలితంగా వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. తమ ఉత్పత్తులు చాలక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటూ మనుగడ కొనసాగిస్తున్నాయి. జనాభా నియంత్రణ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలది ప్రముఖమైనపాత్ర. అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక జనాభాకు కారణమవుతూ వనరుల విధ్వంసం చేస్తుంటే.. అభివృద్ధి చెందిన దేశాలతో మరో సమస్య. వీళ్లు అవసరార్థానికన్నా ఎక్కువ వనరులను వాడుతూ, వృధా చేస్తూ మరో రకమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. భూమిపై తన ఇష్టానికి అనుగుణ ంగా సంతానాన్ని వృద్ధి చేసుకొని... కుటుంబంగా మనుగడ సాగించగలిగే అవకాశం ఉన్న జీవి మనిషి మాత్రమే. మరి జనాభా భువికే ప్రమాదకరంగా మారకూడదంటే నియంత్రించుకోవడం ఒకటే మనిషికి ఉన్న మార్గం. లేకపోతే ప్రకృతే ఆ పని చేస్తుంది! తనకు ఎక్కువైన భారాన్ని తగ్గించుకొంటుంది! - జీవన్‌రెడ్డి. బి -
అర్థవంతం: పేర్ల వెనక ఫ్లాష్!
ఈ నవలలు ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖమైన స్థానం సంపాదించినవి. అంతకు మించి అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచినవి! ఈ నవలల కథాంశమే కాదు ఆ కథాంశాలకూ అత్యంత అర్థవంతంగా పేర్లను పెట్టిన విషయంలో కూడా రచయితల ప్రతిభ అద్భుతమనిపిస్తుంది! ఫైవ్‌పాయింట్ సమ్ వన్: ఐఐటీల్లో ప్రతి సబ్జెక్టుకీ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) గ్రేడింగ్ ఇస్తారు. ఇందుకు స్కేల్లో 10ని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే పదికి ఎంత సీజీపీఏ సాధిస్తారనేది ఇక్కడ లెక్క. సబ్జెక్ట్ టాపర్‌కు 10 కి పది ఇచ్చి మిగతా వాళ్లకు వారి పెర్మార్మెన్స్ను బట్టి స్కేలింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ చదివే విద్యార్థులు ఎంతలేదన్నా కనీసం ఆరుకు పైగా పాయింట్లను తెచ్చుకుంటారు. అంతకు తక్కువ వచ్చిన వాళ్లు అపరమేధావులని (వ్యంగ్యంగా) లెక్క! ఆరుకు తక్కువగా గ్రేడ్ తెచ్చుకున్న వారిని... ఉదాహరణకు 5.76 వంటి స్థాయిలో సీజీపీఏ సాధించిన వారిని ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ కింద వ్యవహరిస్తారు! 5 కు 6 కు మధ్యలో సీజీపీఏ సాధించిన వారంతా ‘ఫైవ్‌పాయింట్ సమ్ వన్’లే! ఐఐటీ స్టూడెంట్ అయిన చేతన్ భగత్ తన నవలలో హీరోల సీజీపీఏ స్థాయిని బట్టి పేరును ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్ ’ అని పెట్టారు! మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్: పురుషులు అంగారక గ్రహ వారసులైతే, స్త్రీలు శుక్రగహ వారసులు! ఇద్దరూ కలిసి భూగ్రహం మీద సాగించే జీవితాల్లో వారి మధ్య వచ్చే వైరుధ్యాల గురించి జాన్ గ్రే రాసినదే ఈ నవల! మన సౌర కుటుంబంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో ఏడు గ్రహాలు ఒక తీరున ఉంటే శుక్రగ్రహం(వీనస్)మాత్రం ప్రత్యేకం! అన్ని గ్రహాలూ ఒక దిశలో పరిభ్రమిస్తుంటే వాటన్నింటికీ వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంటుంది ఈ గ్రహం! శుక్రగ్రహం మీద రిస్ట్ వాచ్ లేదా వాల్ క్లాక్ ఉంచితే అది అపసవ్య దిశలో తిరుగుతుందని శాస్త్రవేత్తలంటారు! ఏవిధంగా చూసినా ఇతర గ్రహాలతో పోల్చినప్పుడు వీనస్ ఈజ్ రివర్స్ ప్లానెట్! అచ్చం ఆడవాళ్లలాగే అనేది ఈ అమెరికన్ రచయిత ఉవాచ! ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరు’ అన్న భావాన్ని స్ఫూరించేలా వారు శుక్రగ్రహం నుంచి వచ్చారేమో అన్న అనుమానం ఈ పుస్తకం ద్వారా వ్యక్తపరిచారు. అదే ఫన్ ను తన నవల పేరుతోనే పండించారు! ఇక్కడ మరో థియరీ కూడా ఉంది. గ్రీకుల ప్రేమ దేవత పేరు ‘వీనస్’. మహిళలను ప్రేమ మూర్తులుగా భావిస్తూ వారిని వీనస్‌కు వారసులుగా భావిస్తూ ఈ పేరు పెట్టారట. జాగ్రఫీ పరంగా తీసుకుంటే.. మార్స్ చాలా హీట్. మీథేన్గ్యాస్లతో కూడు కొన్న వీనస్ చల్లదనంతో కూడిన గ్రహం. పురుషులు అగ్రెసివ్, మహిళలు కూల్ అనే భావనతో కూడా రచయిత తన నవలకు ఈ పేరు పెట్టాడ నేది మరో థియరీ. మిడ్నైట్ చిల్డ్రన్: 20వ శతాబ్దంలో భారతదేశం నుంచి వచ్చిన ఆంగ్లసాహిత్యంలో ప్రముఖమైనదిగా నిలిచిన ఈ నవలకు బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ష్ద్రీ సృజించిన వచన కావ్యమిది! దేశవిభజనతో ముడిపడిన పేరు ఇది! అవిభాజ్యభారతం ఒక అర్ధరాత్రి విభజించ బడింది. మతం అనే ఒకే ప్రాతిపదికతో ప్రజలు అటు ఇటు కదిలిపోతున్నారు. తమ మతానికి ఒక దేశాన్ని ఎంచుకుని...తమ మతం తమను అక్కడే బతకమని అదేశించినట్టుగా కదులుతున్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతావని నిట్టనిలువుగా చీలిన ఆ అర్ధరాత్రి జన్మించిన చిన్నారుల కథ ‘మిడ్నైట్ చిల్డ్రన్’! దేశ విభజనలోని అత్యంత సున్నిత కోణాన్ని తాకిన థీమ్ ఈ నవలది. పేరులోనే ఆ భావం వ్యక్తమయ్యిందేమోననిపిస్తుంది. - జీవన్‌రెడ్డి. బి -
లక్ష్యం: తన జీవితానికి తనే స్కిప్టు రాసుకున్నాడు
కొంతమందికి జీవితంలో ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకూ వారు విశ్రమించరు. ఎన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నా వారు తమ లక్ష్యసాధన విషయంలో వెనక్కుతగ్గరు. అలా వెనక్కు తగ్గని వ్యక్తే... ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్. అవి 1970ల నాటి రోజులు... వర్షంలో లాస్ఏంజెలెస్ నగరం మెరిసిపోతోంది. హాలీవుడ్‌కు వేదిక అయిన ఆ నగరానికి చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆ యువకుడు. అతడి పేరు స్టాలోన్. చిన్న చిన్న తుంపర్లు పడుతున్న ఉదయం పూట రోడ్డుపై తన పెంపుడు కుక్కతో కలిసి నడుచుకొంటూ వెళుతున్న తనను పట్టించుకోని జనాలను చూస్తుంటే అతడికి నవ్వు ముంచుకొస్తోంది. తను ఎప్పటికైనా పెద్దస్టార్ను అవుతానని, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంటానని అతడికి తెలుసు. ఆ ఆత్మవిశ్వాసంలోంచి వచ్చినది ఆ నవ్వు. ఉన్న ఫలంగా అతడు హాలీవుడ్‌కి రావడానికి కారణం మహ్మద్ అలీ! అంతకు కొన్ని రోజుల క్రితమే అమెరికన్ బాక్సింగ్ చరిత్రలో కొత్త సూర్యుడిలా ఉదయించాడు మహ్మద్ అలీ. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెపనర్ను ఓడించాడు అలీ. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన లక్షలాది మందిలో స్టాలోన్ ఒకడు. అందరూ అలీని చూసి అబ్బురపడుతుంటే, అతడి విజయం స్ఫూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు స్టాలోన్. అది ప్రపంచ సినీ చరిత్రపై గొప్ప ప్రభావం చూపగల స్క్రిప్ట్ అని స్టాలోన్‌కు అవగాహన ఉంది. అందుకే ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలి, తనే హీరోగా ఉండాలనేది అతడి ఉద్దేశం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. హాలీవుడ్లో తన పేరు వ కాబోయే హీరోగారి ఆలోచనలు ఇలా ఉంటే... అతడి స్టోరీ లైన్‌ను విన్న నిర్మాతలు మాత్రం పెదవి విరచసాగారు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక ప్రొడక్షన్ హౌస్‌ల దగ్గరకు వెళ్లి కథను వినిపించిన ఎవ్వరూ మెచ్చలేదు. సినిమాగా రూపొందించడానికి పెట్టుబడి పెడతామని అనలేదు. అనాథలా పెరిగి, సొంత కష్టంతో సంపాదించుకొన్న సొమ్మంతా ఖర్చయిపోయింది. లాస్ఏంజెలెస్ వచ్చిన కొన్ని వారాల తర్వాత ఒక లిక్కర్ హౌస్ ముందు వచ్చి నిలబడ్డాడు. లోపలకు వె ళదామంటే డబ్బుల్లేవు. అటుగా వెళుతున్న ఒక సీనియర్ సిటిజన్ చూపు స్టాలోన్ దగ్గరున్న పెంపుడి కుక్కపై పడింది. ‘అమ్ముతావా?’ అని అడిగాడు! 50 డాలర్లు ఇస్తాననాన్నడు. అమెరికన్లకు పెట్ అంటే ఎంతో ప్రేమ. స్టాలోన్ కూడా మనస్తత్వం విషయంలో సగటు అమెరికన్. ఆ శునకాన్ని అమ్ముకోవడం అంటే అంతకన్నా పతనస్థితి లేదని భావించాడు. అయితే తను అదే స్థితిలో ఉన్నానని గ్రహించాడు. శునకాన్ని అమ్మేశాడు! మళ్లీ ప్రొడ క్షన్ హౌస్ చుట్టూ చక్కర్లు. ఈ సారి పరిస్థితి కొంచెం సానుకూలంగా కనిపించింది. మీరు రాసిన స్క్రిప్ట్ఇస్తే లక్ష డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశాడు ఒక నిర్మాత! పెట్‌ను 50 డాలర్లకు అమ్ముకొన్న మనిషికి ఒక్కసారిగా లక్ష డాలర్ల ఆఫర్వస్తే... హాలీవుడ్‌కి రచయితగా పరిచయం చేస్తాను అని హామీ ఇస్తే... ఒక్కసారిగా ఎగిరి గంతేయాలి. అయితే స్టాలోన్ అలా చేయలేదు. తన స్క్రిప్ట్‌కు తనే హీరో, అది సినిమాగా రూపొందితే స్క్రీన్‌పై తనే కనపడాలి. ఇదే విషయాన్ని ఆ నిర్మాతకు చెప్పాడు! అతడు నవ్వుకొన్నాడు..! స్టాలోన్ కోరికను చూసి అలా వికటాట్ట హాసం చేసిన నిర్మాతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాలుగు లక్షల డాలర్లు ఇస్తాం.. స్క్రిప్ట్మాకు అప్పజెప్పు అని కోరిన వాళ్లూ ఉన్నారు. అయినా స్టాలోన్ లొంగలేదు! తన స్క్రిప్ట్‌కు తనే హీరో. తినడానికి తిండిలేని దశలో కూడా లక్ష్యం విషయంలో అతడి మొండితనానికి మొదట ఆశ్చర్యపోయిన ఒక నిర్మాతకు తర్వాత ముచ్చటేసింది. నిన్నే హీరోగా పెడతాను. మరి ఇచ్చే డబ్బు నాలుగు లక్షల డాలర్లు కాదు పాతికవేల డాలర్లే అన్నాడు. ఆనందంగా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పి, అడ్వాన్స్ తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. తన శునకాన్ని కొన్న సీనియర్ సిటిజన్ అడ్రస్ అతడి మనసులో ఉంది. స్టాలోన్‌కు ఆ పెట్‌పై ఉన్న ప్రేమను తన అవకాశంగా తీసుకొన్నాడు ఆ సీనియర్ సిటిజన్. ఫలితంగా 50 డాలర్లకు అమ్మిన కుక్కపిల్లను 15,000 డాలర్లు చెల్లించి దాన్ని వెనక్కు తెచ్చుకొన్నాడు స్టాలోన్. స్టాలోన్, ఆ కుక్కపిల్ల ఇద్దరూ అనందంగా బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమానే ‘రాఖీ’. బాక్సర్ అలీ స్ఫూర్తితో సిల్వస్టర్ స్టాలోన్ తయారు చేసుకొని, హీరోగా తెరకెక్కించిన స్క్రిప్ట్. అంత వరకూ హాలీవుడ్ చరిత్రలోని ఎన్నో రికార్డులను తుడిచిపెట్టింది ఆ సినిమా. స్టాలోన్‌ను స్టార్‌ను చేసింది. ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును అందుకొంది. ఎంతకష్టంలోనైనా రాజీ పడక పోరాడితే ఫలితం ఉంటుందనడానికి స్టాలోన్ జీవితానికి మించిన ఉదాహరణ ఉండదేమో! - జీవన్ రెడ్డి.బి -
కొంచెం స్మార్ట్‌గా ఉన్నాయ్..!
కేవలం టైమ్, డేట్ చూసుకోవడానికి మాత్రమే పనికొచ్చే ‘వాచ్’ లు ‘స్మార్ట్‌వాచ్’లుగా మారి వావ్ అనిపిస్తున్నాయి. మొబైల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఫోబ్లెట్ల తుఫానుల తర్వాత టెక్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో కొత్త తుఫానును సృష్టించే బాధ్యతను తీసుకొన్నాయి. అందుబాటులో ఉన్నవి, అందుబాటులోకి రాబోతున్నవిగా స్మార్ట్‌వాచ్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. పాత ఓఎస్లపైనే కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకొంటున్నాయి. ‘వాచ్’లకు ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి. మొబైల్గా అందుబాటులోకి వచ్చిన ఫోన్ ‘స్మార్ట్‌ఫోన్’అయ్యింది. స్మార్ట్‌ఫోన్ కోసం అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్వేర్లు వాచ్‌లను స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌లపై పనిచేసే వాచ్‌లు సరికొత్త ఫీచర్లతో, సరికొత్త మోడళ్లలో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌కు తీసిపోని రీతిలో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తున్నాయి. ‘వాచ్’లను కట్టుకోవడం అందరికీ ఉండే అలవాటు కాదు అనే భావన ఉన్న మన దగ్గర స్మార్ట్‌వాచ్ మార్కెట్ కాస్తంత తక్కువే. అయినా ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌లపై ఆకర్షణలో ఉన్న నేపథ్యంలో... స్మార్ట్‌వాచ్‌లు కూడా ఆకట్టుకొనేవిగా మారాయి. స్మార్ట్‌గా వచ్చిన శామ్సంగ్: దాదాపు రెండు నెలల కిందట అధికారికంగా విడుదల అయ్యింది శామ్సంగ్ స్మార్ట్ వాచ్. శామ్సంగ్ గెలాక్సీ గేర్ పేరుతో ఈ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది, ధర దాదాపు 23 వేల రూపాయలు. దాదాపు 70 ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి ఈ స్మార్ట్‌వాచ్‌లో. 4.14 సెంటీమీటర్ల ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఉండే ఈ వాచ్‌లో వీడియోల వీక్షణకు, ఫోన్ కాలింగ్, 1.9 ఎమ్పీ కెమెరాతో వీడియో రికార్డింగ్, ఫొటోలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వరకే మార్కెట్లోకి వచ్చిన గెలాక్సీ నోట్ 3, త్వరలో మార్కెట్లోకి రాబోయే గెలాక్సీ నోట్ 10.01లలో ఉండే ‘ఎస్ వాయిస్’ అనే అప్లికేషన్ ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంటుంది. దాదాపు 27 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌పై పనిచేసే యాప్స్ ఉన్నప్పటికీ... అంత స్టైలిష్‌గా ఉండదనేది ఈ స్మార్ట్‌వాచ్ విషయంలో ఉన్న కంప్లైంట్. అలాగే స్మార్ట్‌వాచ్ డిస్ప్లే మరీ చిన్నదిగా ఉండటం నెగిటివ్ పాయింట్ అవుతోంది. మెసేజ్‌లు చదువుకోవడానికి కంఫర్ట్‌గా ఉండదనే భావనతో చాలా మంది ఈ స్మార్ట్ వాచ్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. కేవలం శామ్సంగ్ స్మార్ట్ వాచ్ విషయంలోనే కాకుండా.. మొత్తంగా ‘స్మార్ట్ వాచ్’ మార్కెట్‌నే ప్రభావితం చేస్తోంది డిస్ప్లే. సోనీ కూడా స్మార్ట్‌గా వచ్చింది: సోనీ స్మార్ట్‌వాచ్, సోనీ స్మార్ట్‌వాచ్2లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ‘సెకెండ్ స్క్రీన్ ఆఫ్ యువర్ ఆండ్రాయిడ్’ ఫోన్స్‌గా పేరు పొందాయి. అంటే ఇవి ఫోన్‌కు రిమోట్ కంట్రోల్ లాంటివి. ఫోన్ దూరంగా ఉన్నపుడు, అందుబాటులో లేనప్పుడు దానికి వచ్చే కాల్స్, మెసేజెస్, మెయిల్స్ అన్నింటినీ ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ కనెక్ట్ ద్వారా మొబైల్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌కు బంధాన్ని ఏర్పరచవచ్చు. వీటి ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోయినా.. దానికి ఎంత దూరంలో ఉన్నా.. దాన్ని మానిటర్ చేయడానికి ఉపయోపడుతుంది సోనీస్మార్ట్ వాచ్. సోనీ స్మార్ట్‌వాచ్-2 కూడా అంతే. ఇది వాటర్ రెసిస్టెంట్. మోటో యాక్టివ్: మోటోరోలా స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్లను రిసీవ్ చేసుకోవడం, మెయిల్స్, మెసేజెస్ చదువుకోవడం చేయవచ్చు. మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేస్తుంది. పెబ్బెల్ వాచ్: ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. డే లైట్లో కూడా దీని డిస్ప్లేను వీక్షించడానికి అవకాశం ఉంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యే ఈ స్మార్ట్‌వాచ్ సైక్లిస్ట్‌లకు బాగా ఉపయోగకరమైనది. స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోపగపడుతుంది. ఐ ట్యూన్‌తో యాక్సెస్ ఉంటుంది. ఐ’మ్ వాచ్: 1.2 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లేతో, 400 ఎమ్‌హెచ్‌జెడ్ సింగిల్ కోర్ ప్రాసెసర్‌తో, 4 గిగా బైట్స్ ఫ్లాష్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లకు కనెక్టర్గా పనిచేస్తుంది. మెటావాచ్: ప్రస్తుతం కిక్‌స్టార్టర్ దశలో ఉంది. రెండు రకాల స్మార్ట్‌వాచ్‌లను రూపొందిస్తోంది మెటావాచ్ కంపెనీ. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం వీటిని రూపొందిస్తున్నారు. మణికట్టు మాయాజాలం గురించి అంతా మిస్టరీనే! ఇప్పటికే కొన్ని స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌వాచ్‌ను రూపొందించే పనిలో ఉన్నామని ప్రకటించాయి. అయితే ఎవరెన్ని చెప్పినా ‘ఆపిల్’ నుంచి వచ్చే గాడ్జెట్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఆపిల్ కంపెనీ ‘ఐ వాచ్’ను రూపొందిస్తోందన్న వార్తలు అందరి దృష్టినీ అటువైపు మళ్లించాయి. ‘ఐ వాచ్’లో ఉంటే సదుపాయాలు, ఫీచర్ల గురించి రూమర్లే, రూమర్లు. ‘ఐ వాచ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?’ ‘ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?’ ‘ఐ వాచ్ గురించి ఆపిల్ ఎప్పుడు ప్రకటిస్తుంది?’ మొదలైన విషయాల గురించి నెట్లో బోలెడు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ‘ఆపిల్’ భవిష్యత్తును ‘ఐ వాచ్’ నిర్దేశిస్తుందని ఆ కంపెనీ వారే ప్రకటించడం ఈ వేరబుల్ గాడ్జెట్ గురించి అంచనాలను రెట్టింపు చేస్తోంది. 2013లోనే ‘ఐ వాచ్’ అందుబాటులోకి వస్తుందన్నారంతా. అయితే ఈ ఏడాదిలో కూడా అది వచ్చే అవకాశం లేదు అంటున్నారు. 2014 లేదా 2015లోగానీ ఐ వాచ్ అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఐ వాచ్ అనేది సౌకర్యం, సదుపాయం కోసమో కాదని.. అది ధరించిన వారి జీవనశైలినే మార్చేసేంత ప్రభావాన్ని చూపగలదని టెక్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్, ఐ ప్యాడ్లు ఒక ఎత్తు అయితే ఐ వాచ్ మాత్రం మరో ఎత్తు అని ఊరిస్తున్నారు. ధర విషయానికి వస్తే ఐఫోన్ 150 డాలర్లకే అందుబాటులోకి వస్తుందని కొందరు.. కాదు కాదు వెయ్యిడాలర్ల వరకూ ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ విధంగా ఐ వాచ్ రూపంలోని మణికట్టు మాయాజాలం గురించిన సమాచారం అంతా మిస్టరీగానే ఉంది! ఆడవాళ్లకు స్పెషల్ స్టైల్?! వాచ్‌లను ధరించే విషయంలో ఆడవాళ్లకు, మగవాళ్లకు చాలా తేడాలున్నాయి. ఆడవాళ్లు ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి వాచ్ కట్టాలి.. అనే అభిప్రాయం ఉంది. అయితే నేటి ‘యూనీ సెక్స్ థియరీ’ ప్రకారం ‘ఆడమగ తేడాలు ఎందుకు?’ అని అంటున్నాయి టెక్ జెయింట్ కంపెనీలు. లింగ వివక్ష లేని సమాజం కావాలి కాబట్టి.. ఈ వాచ్‌ల విషయంలో తేడాలు చూపడం అనవసరమని, స్టైల్, కంఫర్ట్‌లను బట్టి స్త్రీ పురుష తేడాలు లేకుండా ఎవరికి ఇష్టమైనవి వారు సెలెక్ట్ చేసుకోవచ్చని అంటున్నాయి. సోనీ కంపెనీ మాత్రం లేడీస్, జెంట్స్ అంటూ భిన్నమైన స్టైల్స్‌ను అందిస్తోంది. -జీవన్ రెడ్డి.బి -
కూల్‌గా...స్టయిల్‌గా!
సౌకర్యాన్ని అందిస్తాయి... స్టైలిష్ అనిపిస్తాయి... సరదాగా... సరికొత్తగా ఉంటాయి... కొన్ని వైర్ లెస్, మరికొన్ని వెయిట్‌లెస్... కొంచెం కాస్ట్లెస్ కూడా! టెక్ కంపెనీలు కొత్త ప్రపంచానికి కొత్త అనుభవం ఇవ్వడానికి అన్నట్లుగా రూపొందించిన గాడ్జెట్స్ ఇవి. మార్కెట్‌ను ముంచెత్తుతూ ఆకట్టుకుంటున్న గమ్మత్తై గాడ్జెట్స్ ఇవి... సోనీ త్రీ ఇన్ వన్... రేడియో, టేప్ రికార్డర్ మిక్స్‌డ్‌గా వస్తే దాన్ని టూ ఇన్ వన్ అనుకొని ముచ్చటపడే వాళ్లం. అయితే ఇప్పుడు టూ ఇన్ వన్ కాలాలు పోయాయి. త్రీ ఇన్ వన్ అంటూ సోనీ ఒక కొత్త ప్రోడక్ట్‌ను తీసుకు వచ్చింది. హెడ్ఫోన్స్లోనే ఎమ్పీ త్రీ ప్లేయర్‌ను మిక్స్ చేసి ‘3 ఇన్ వన్ ఎన్‌డబ్ల్యూజెడ్-డబ్ల్యూహెచ్303’ అనే ప్రోడక్ట్‌ను తీసుకు వచ్చింది. ఇది అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వాక్‌మన్, ఎమ్‌పీత్రీ ప్లేయర్, స్పీకర్లు మిళితమై ఉన్న దీనికి త్రీ ఇన్‌వన్‌గా పేరు పెట్టుకొంది సోనీ కంపెనీ. స్టైలిష్ లుక్ ప్లస్ సౌకర్యం కలగల్సినదే ఈ త్రీ ఇన్ వన్. బ్లాక్, గ్రే, రెడ్ యాక్సెంట్స్‌లో లభిస్తుంది. సోనీ బ్రాండ్ నేమ్ దీనికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. 4జీబీ ఇన్‌బిల్ట్‌గా ఉండే ఈ మ్యూజిక్ ప్లేయర్లో వెయ్యి ట్రాక్స్‌ను స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం హెడ్ఫోన్స్గానే కాకుండా లౌడ్ స్పీకర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా స్టీరియో ఎఫెక్ట్ పొందవచ్చు. హెడ్‌ఫోన్స్‌గా ఉపయోగించుకొంటున్న సమయంలో ఒక చేత్తోనే వాల్యూమ్, ట్రాక్ లిస్ట్‌ను చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, లాప్‌టాప్‌లకు యూఎస్బీ ద్వారా హుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫుల్బ్యాటరీతో 20 గంటలపాటు పనిచేస్తుంది. దీని ధర రూపాయల్లో 8,990. ర్యాపో.. వైర్లెస్ స్పీకర్ మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్.. దేనితోనైనా వైర్లెస్ ట్రాన్స్ మిషన్ ద్వారా కనెక్ట్ అయ్యి చక్కటి ధ్వనిని అందిస్తుంది ర్యాపో. తొలి బ్లూ టూత్ మినీ స్పీకర్ ఇది. కొత్తగా స్పీకర్లను కొనుగోలు చేయాలనుకొంటున్న వారికి హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌గా పేరు పొందిన ర్యాపో ఉత్తమమైన ఛాయిస్. ఇంట్లో ఉన్న అన్ని గాడ్జెట్స్కూ కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండటం, ఎక్కడికైనా క్యారీ చేయడానికి అవకాశం ఉండటం రాపూ ప్రత్యేకతలు. ఈ ‘బ్లూటూత్ మినీ స్పీకర్ 3060’ ధర రూ.4,299. దీనికి మైక్రోఫోన్ కూడా ఉంటుంది. దీని ద్వారా స్పీకర్ కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకే స్విచ్ ద్వారా ఫోన్, మ్యూజిక్ ప్లేయర్‌తో పెయిరప్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి పై భాగంలో కంట్రోల్ బటన్స్ ఉంటాయి. మినీ యూఎస్బీ చార్జర్ ద్వారా చార్జింగ్ అవుతుంది. పది మీటర్ల దూరం వరకూ పనిచేస్తుంది. చార్జింగ్‌తో దాదాపు రెండున్నరగంట సేపు పనిచేస్తుంది. కలర్‌ఫుల్, సింపుల్, ఎలిజంట్, క్లాసీ, కాంపాక్ట్ స్పీకర్ అంటూ ఈ గాడ్జెట్‌ను ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు. సంగీత వర్షంలో తడవండి...! షవర్ నుంచి జారే ప్రతి నీటి చుక్కకూ ఒక రిథమ్‌ను కలగలిపే మ్యూజిక్ సాధనమిది. స్నానం చేయడంలో ఉత్తేజానికి ఉత్సాహానికి జత చేసే సాధనమిది. షవర్‌కు ఎటువైపు తగిలించినా నీళ్లలో తడుస్తూ కూడా ఇది సంగీత స్వరాలను కురిపిస్తుంది. బాత్రూమ్ సింగర్స్ కొందరైతే.. బాత్రూమ్లో మ్యూజిక్‌ను వినడానికి ఉత్సాహం చూపించే వారు మరికొందరు. అయితే అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద నీళ్లు పడితే అవి చెడిపోతాయి. దీంతో బాతింగ్‌లో మ్యూజిక్ వినడానికి అవకాశం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చింది షవర్ రేడియో వీ3. రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉండే, ఉత్సాహాన్ని ఇచ్చే ఈ గాడ్జెట్‌ను చార్జింగ్‌తో కాక ఎక్స్టర్నల్ పవర్‌తో పనిచేస్తుంది. ఎఫ్ఎమ్ రేడియోను కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్‌తో లౌడ్, క్లియర్ సౌండ్‌ను అందిస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్ ఎఫ్ఎమ్ రేడియో కావడం వల్ల నీళ్లలో తడిసినా ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఫొటోల ప్రింటింగ్.. మొబైల్లో చక్కటి క్వాలిటీ ఫోటోలను తీసుకొనే అవకాశం వచ్చాక ఫోటో ప్రింటింగ్‌కు అవసరం బాగా తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో తీసుకొన్న ఫొటోలు అనుకోకుండా డిలీట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ప్రింట్ తీసిన ఫొటోను జాగ్రత్త చేస్తే వంద సంవత్సరాల తర్వాత కూడా దాని విలువ భద్రంగా ఉంటుంది. ఫొటోప్రింటింగ్ కోసం ఫొటో స్టూడియోల చుట్టూ తిరిగే ఓపిక లేకుంటే సింపుల్‌గా పాకెట్ ఫొటో ప్రింటర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఎల్జీ ఉత్పాదన అయిన పీడీ 233 పాకెట్ ఫొటో ప్రింటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కూ ప్రింటర్‌కు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. బ్లూ టూత్ ద్వారా కూడా అనుసంధానించుకోవచ్చు. 45 సెకన్ల సమయంలోనే ఫొటో ప్రింట్ అవుతుంది. జీరో ఇంక్ ఫొటో పేపర్ 2.0 ద్వారా ఫొటోలు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇంక్ అవసరం ఉండకపోవడం ఈ ప్రింటర్ ప్రత్యేకత. ఇక ఎల్జీ ఫోన్ కూడా ఉపయోగిస్తుంటే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఫొటోను డెకరేట్ చేసి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దీని ధర 14,990. 5.1 x 7.6 సెం.మీ. (2’’x3’’) సైజ్‌లో ఫోటోలను ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యాషనబుల్ పెన్‌డ్రైవ్... పెన్‌డ్రైవ్ నేటి నిత్యావసర వస్తువు. విద్యార్థులకైనా, ఉద్యోగులైనా అవసరం కొద్దీ డిజిటల్ డాటా క్యారీ చేయడం తప్పనిసరి అయ్యింది. దాని కోసం పెన్‌డ్రైవ్ తప్పనిసరి అయ్యింది. పెన్‌డ్రైవ్‌లో డాటాను క్యారీ చేయడం సులభమే కానీ.. ఆ పెన్‌డ్రైవ్‌ను క్యారీ చేయడమే ఇబ్బంది. కాస్తంత మతి మరుపు ఉన్న వారికి అయితే పెన్‌డ్రైవ్‌తో చాలా చిక్కులే ఉంటాయి. మరి ఈ ఇబ్బందులు తీర్చడానికి పెన్‌డ్రైవ్ రిస్ట్బ్యాండ్గా అందుబాటులోకి వచ్చింది. రంగు రంగుల్లో స్టైల్ స్టైల్‌గా ఇవి అందుబాటులో ఉన్నాయి. 8జీబీ మెమొరీతో ఉండే రిస్ట్‌బ్యాండ్ పెన్డ్రైవ్ధర దాదాపు వెయ్యి రూపాయలు. ఈ మౌస్‌ప్యాడ్ ఒక నోట్ ప్యాడ్! కంప్యూటర్లు ఇంట్లోకి వచ్చేశాక కాగితం, పెన్నులు రిటైర యిపోయాయి. వీటిని కొనాలనే స్పృహ బాగా తగ్గిపోయింది. కమ్యూనికేషన్ అంతా మెసేజ్ రూపంలో మారిపోయాక, మొబైల్లో వందల కొద్దీ నంబర్లను సేవ్ చేసుకొనే అవకాశమున్న నేపథ్యంలో పెన్నూ పేపర్ల పని తగ్గిపోయింది. కాగితం, కలాల అవసరాన్ని మరింత నిరోధిస్తూ మౌస్‌ప్యాడ్ మీద రాసుకొనే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మౌస్‌ప్యాడ్ ను రొటీన్ప్యాడ్ గానే కాకుండా రాత కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా రాసుకోవడానికి సిస్టమ్ పక్కనే ఇది అమరి ఉంటుంది. ఇది ఎరేజబుల్ స్లేట్ లాంటిది. ధర రూ.1,149. రెట్రో స్టైల్హ్యాండ్ సెట్... టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని పాత వాసనలను వదిలించుకోలేదు. అలాంటి వాటిలో ఒకటి రెట్రో స్టైల్ రిసీవర్. ల్యాండ్‌ఫోన్లకు రిసీవర్‌కు ఉండే ఈ హ్యాండ్‌సెట్‌ను స్మార్ట్ఫోన్లకు తగిలించుకోవడం స్టైల్ అవుతోంది. మొబైల్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే దానివల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయని.. బ్రెయిన్‌పై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాతస్టైల్కు మళ్లీ క్రేజ్వస్తోంది. దీని వాడకందార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. క్లియర్ వాయిస్‌తో, డిస్ట్రబెన్స్ లేకుండా మాట్లాడాలి అంటే.. అది రెట్రో స్టైల్ హ్యాండ్సెట్తోనే సాధ్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - జీవన్‌రెడ్డి.బి -
చిట్టి అడుగులు పడుతున్నాయ్...
వాటికి ఆకలి గురించి తెలియదు కానీ వండగలవు.. శుచి గురించి తెలియదు కానీ ఇంటిని శుభ్రంగా ఉంచగలవు, మమతానురాగాల గురించి తెలియదు కానీ మనిషికి తోడును అందించగలవు, బాధ, ప్రేమ, పగ, ప్రతీకారాలు తెలియవు కానీ యుద్ధాలు చేయగలవు. సృష్టికి ప్రతిసృష్టిగా తయారయ్యాయి. ఇప్పుడు సృష్టిలోని రహస్యాలను వెలుగులోకి తీసుకు వస్తున్నాయి. అవే.. రోబోలు అలియాస్ హ్యూమనాయిడ్స్. దినదిన ప్రవర్ధమానం అవుతున్న రోబోటిక్ సైన్స్‌లో రోజుకొక అభివృద్ధి కనిపిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణ రూపంలో రోబోల శక్తియుక్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యూమనాయిడ్ల ప్రస్థానం గురించి.. రోబో అంటే చెక్ భాషలో ‘బానిస’ అని అర్థం. ఈ బానిసలే మానవ నిర్మిత అద్భుతాలుగా... మానవుడికి సహాయకారులుగా నిలుస్తున్నాయి. చిట్టి చిట్టి అడుగులేసుకొంటూ అభివృద్ధి పథాన నడుస్తున్నాయి. ప్రత్యేకించి హ్యూమనాయిడ్ రోబోల విషయంలో.. శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలు చే స్తున్నారు. తాజాగా ముమ్మూర్తులా మనిషిని పోలినట్టుగా నడిచే రోబోను ఆవిష్కరించారు. శాక్సోఫోన్‌ను శ్రుతిబద్ధంగా వాయించే రోబోలు ఆవిష్కృతం అయ్యాయి. గత పదిహేను రోజుల్లో జరిగిన ఆవిష్కరణలివి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న హ్యూమ నాయిడ్ రోబోల విశేషాలివి.. యంత్రాలు మాత్రమే కాదు..! రోబో అంటే స్టీల్ బాడీతో, అమర్చినట్టుగా ఉంటే అవయవాలతో ఉండేవే కాదు... శంకర్ సినిమా ‘రోబో’లో కనిపించే ‘చిట్టి’లాంటివి కూడా ఉన్నాయి. వీటినే హ్యూమనాయిడ్స్ అనవచ్చు. మనిషి మనగలిగే వాతావరణానికి, ప్రకృతికి అనుగుణంగా స్పందించేవే హ్యూమనాయిడ్ రోబోలు. సెన్స్, కామన్ సెన్స్ లాంటి లక్షణాలను అలవరుచుకొంటున్న హ్యూమనాయిడ్లు ఆవిష్కృతం అవుతున్నాయిప్పుడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రూపంలో ఫిక్స్ చేసిన కదలికలే అయినా.. వేగం అనే ప్రత్యేకతతో, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వీటి హావభావాలను చూస్తే మాత్రం వాటంతట అవే ఆలోచించి పనిచేస్తున్నాయనే భ్రమ కలుగుతుంది. మనిషి లాగా నడక.. మనిషిలాగా నడవగల రోబోను తయారు చేయడానికి 20 సంవత్సరాలుగా పనిచేస్తోంది హోండా కంపెనీ. ఈ విషయంలో ఎట్టకేలకు ఇటీవలే విజయం సాధించింది. పదమూడు సంవత్సరాల క్రితం ‘ఎసిమో’ రూపంలో హోండా ఒక హ్యూమనాయిడ్‌ను సృష్టించింది. ప్రత్యేకించి నడక విషయంలో దీనికి మావన లక్షణాలను సంక్రమింపజేసే ప్రయత్నాలు చేసింది. నడకకు అనుగుణంగా, అనుకూలంగా ఉండే మోకాళ్లు, పాదంలో ఒంపు, సులువుగా కదిలే సొంపుతో అచ్చం మనిషిలా ఎసిమోను తీర్చిదిద్దింది హోండా కంపెనీ. ఐదడుగుల ఎత్తు, 64 కిలోల బరువుతో ప్రస్తుతం ప్రపంచంలోని హ్యూమనాయిడ్స్లో కెల్లా నడక విషయంలో మానవుడితో అత్యంత సామీప్యం ఉన్న రోబో ఇది. ఇది 0.6 సెకన్లకు ఒక అడుగు చొప్పున వేయగలదు. 12 డిగ్రీల యాంగిల్లో పాదం కదలిక ఉంటుంది. ఎసిమో తను నడుస్తున్న దారిలో ఎత్తు పల్లాలను, అడ్డంగా ఉన్న వాటిని గుర్తించగలదు. దీనిలోని కంప్యూటింగ్ పవర్ కారణంగా దారిలోని అడ్డంకులను తప్పించుకొంటూ గంటకు దాదాపు పదికిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు ఎసిమో! శామ్సంగ్ రూపొందించిన ‘రోబో రే’ అనే హ్యూమనాయిడ్ కూడా నడక విషయంలో మనిషిని పోలినదిగా పేరు తెచ్చుకొంది. మనుషుల్లాగే యుక్తులు... ఎసిమో కేవలం పరిగెత్తడం మాత్రమే కాదు, తన తెలివితేటలను ఉపయోగించి మానవుడికి సేవలను అందిస్తుంది. ప్లాస్క్‌లోని జ్యూస్ గ్లాస్లో పోసి మనిషికి అందిస్తుంది. డైనింగ్ టేబుల్ వద్ద సహాయకారిగా ఉంటుంది. ఫుట్‌బాల్‌లో నైపుణ్యాన్ని చూపుతుంది. అంతెందుకు... అచ్చం దర్శకుడు శంకర్ సృష్టించిన ‘చిట్టి’ లక్షణాలెన్నింటినో కలిగి ఉంది ఎసిమో! భావోద్వేగాలను పండించడంలోనూ..! జపాన్ వసీదా యూనివర్సిటీ వారు సృష్టించిన కొబియన్ రోబోను చూసిన వారెవరైనా కళ్లెగరేయాల్సిందే! ఎందుకంటే కళ్లతో భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది కొబియన్. బాధ, ఆనందం, దుఃఖం, భయం, ఆశ్చర్యం, గర్వం, విధేయత వంటి ఏడురకాల ఎమోషన్లను పండించగలదు ఈ రోబో. చేతులు, కళ్ల కదలికలతో ఇది తన భావోద్వేగాలను ప్రదర్శించగలదు. అయితే, ఇది పూర్తిగా యాంత్రికమే. ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఇవ్వగలదు. అయితే పరిస్థితులకు అనుగుణంగా సొంతంగా ఎక్స్‌ప్రెస్ చెయ్యలేదు. ఆ సెన్స్ మాత్రం లేదు ఈ హ్యూమనాయిడ్కు. శాస్త్రవేత్త రూపంలోనిది.. శంకర్ సినిమాలో రజనీకాంత్ రూపంలోని రోబోను చూశాం. ఇప్పుడు ఈ విషయాన్ని నిజం చేస్తున్నారు ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు. మనుషుల కోసం తయారు చేసిన కృత్రిమ అవయవాలతో ‘బయోనిక్ మ్యాన్’ ను వీరు ఆవిష్కరించారు. ఇంగ్లండ్‌లోని ‘షాడో రోబో కో’ అనే కంపెనీ సైంటిస్టులు దీన్ని రూపొందించారు. అతి త్వరలో ఇది పూర్తి మనిషి రూపాన్ని సంతరించుకుంటుంది. ఒక శాస్త్రవేత్తను పోలిన రూపాన్ని ఆ రోబోకు ఇస్తున్నారు. దీన్ని త్వరలో ప్రదర్శనకు ఉంచనున్నారు. భయానక రూపం.. కురాటాస్..యుద్ధవిద్య నిపుణురాలు ఇది. అంతేకాదు... వినాశనాన్ని సృష్టించగల శక్తియుక్తులను కూడా కలిగి ఉంది. కొన్ని మైళ్ల దూరంనుంచి శాటిలైట్ ద్వారా కూడా కురాటాస్ను ఆపరేట్ చేయవచ్చు. మెషీన్ గన్స్‌ను ఆపరేట్ చేయడంలో ఈ రోబో ఆరితేరింది. నవ్యతతో కూడిన నవ్.. సెన్స్, కామన్సెన్స్ ఉన్న రోబో ఇది. దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఆల్డిబరాన్ కంపెనీ వాళ్లు రూపొందించారు. పవర్ సీపీయూతో, హెచ్డీ కెమెరాలతో ఉండే నవ్లో కొత్త వెర్షన్లను ఎప్పటికప్పుడు డెవలప్చేస్తోంది ఫ్రెంచ్ కంపెనీ. నవ్ తెలివితేటల విషయానికి వస్తే.. ఇది సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగానే స్పందిస్తుంది. ఇతర రోబోలతో కో ఆర్డినేషన్ చేయగలదు. నవ్ రోబోలతో ఫుట్‌బాల్ ఆడించి వాటి వ్యూహరచనా శక్తి గురించి ప్రపంచానికి వివరించారు శాస్త్రవేత్తలు. ఆరడుగుల బుల్లెట్టు..! అట్లాస్: ఈయేడాదిలోనే ఆవిష్కృతం అయిన మరో యంత్రుడితను. బోస్టన్డైనమిక్స్ కంపెనీ వారు దీన్ని రూపొందించారు. ఈ హ్యూమనాయిడ్‌ను మిలటరీ అవసరాల కోసం వాడతారు. ‘కంప్యూటర్‌కు కాళ్లూ చేతులు వచ్చి భౌతిక ప్రపంచంలోకి అడుగుపెడితే దానికి ప్రతిరూపమే అట్లాస్’ అని వర్ణించారు శాస్త్రవేత్తలు. రెస్క్యూ ఆపరేషన్లలో ఇది ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. రోబోలు రంగులేస్తున్నాయి! భారతదేశంలో ఇప్పుడు రోబోలు చేస్తున్న పనుల్లో అత్యంత ముఖ్యమైనది పెయింటర్ డ్యూటీ. వీటిని ఎత్తై భవనాలకు రంగులేయడానికి, వెల్డింగ్ పనులకు వినియోగిస్తున్నారు. మోటార్ బైకులకు రంగులేసేది రోబోలే. కొన్నిరకాల రోబోలు పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉన్నాయి. పరిశ్రమల అవసరాలను తీర్చడమే కాదు వ్యక్తిగతంగా మానవుడికి సేవలందించే రోబోలు కూడా ఉన్నాయి. వైద్యుల స్థానాన్ని కూడా ఆక్రమించాయి. చెఫ్‌లుగా వంటపనిలో సాయం చేస్తున్నాయి. ఇంటిపనులు చేసిపెట్టడానికి సహాయపడే రోబోలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మానవుడి జీవితంతో హ్యూమనాయిడ్ల ప్రస్థానం అంతకంతకు బలపడుతోంది. మరికొంతకాలం గడిస్తే... రోబోలు కూడా నిత్యజీవితంలో భాగంగా మారినా ఆశ్చర్యం లేదేమో! ********************** హ్యూమనాయిడ్లు రెండు రకాలు. ఒకటి ఆండ్రాయిడ్.. అంటే పురుషుడి రూపంలోని రోబో. రెండు గైనాయిడ్ అంటే స్త్రీ రూపాన్ని పోలిన రోబో. రోబోలకూ ఒలింపిక్స్ ఉన్నాయి.. అంతర్జాతీయ స్థాయిలో రోబోలకు ప్రతియేటా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన రోబోలు 500 బృందాలు పోటీ పడుతుంటాయి. మన దేశానికి చెందిన రోబోలు కూడా గతంలో ఈ పోటీల్లో పతకాలు సాధించాయి. 2009, 2010లలో ఐఐటీ విద్యార్థులు సృష్టించిన రోబోలు కుంగ్‌ఫూ, మెట్లు ఎక్కడం, నృత్యం, రేసింగ్లలో సత్తా చాటాయి. శాస్త్రీయ పరిభాషలో ఇప్పుడు ‘రోబో’ అనే పదం అంతర్థానం అయ్యే సమయం వచ్చేసింది. పెరిగిన ప్రాధాన్యత రీత్యా వీటికి ప్రత్యేకమైన పేర్లను పెట్టుకొని, ‘హ్యూమనాయిడ్స్’గా వ్యవహరిస్తున్నారు. - జీవన్‌రెడ్డి. బి -
అక్షరాలను వినొచ్చు..!
కంప్యూటర్ తెరపై డిస్ప్లే అయ్యే పెద్ద పెద్ద టెక్ట్స్ డాక్యుమెంట్స్ చదవడం కష్టమైన పని అనిపించవచ్చు. ఒక్కోసారి చదవడానికి ఓపిక లేకపోవచ్చు. ఇలాంటి సమయంలో కంటికి కష్టం లేకుండా విరామాన్ని తీసుకోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బావుంటుందనిపిస్తే, ఇంగ్లిష్‌లో పేజ్‌లను సొంతంగా చదువుకోవడంగాక ఎవరైనా చదివి వినిపిస్తే హ్యాపీగా ఉంటుందనిపిస్తే... అలాంటి సమయాల్లో ‘హాయ్..’ అని పలకరించే సదుపాయాలున్నాయి! టెక్ట్స్ డాక్యుమెంట్లను చదివి వినిపిస్తూ సౌలభ్యంగా మారే అప్లికేషన్లు, వెబ్ సేవలు ఉన్నాయి. పేరాలకొద్దీ చదివే ఓపిక లేనప్పుడు, పదాల ఉచ్చారణ అర్థం కాని సమయాల్లో వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది. విండోస్ ఓఎస్ పీసీకైనా, ఆండ్రాయిడ్ఫోన్కైనా, ఐఓఎస్ విషయంలోనైనా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుతూ.. మేము ‘టెక్ట్స్ డాక్యుమెంట్లను చదవం, వింటాం’ అని గర్వంగా చెప్పుకోవచ్చు! కంప్యూటర్లో టెక్ట్స్ డాక్యుమెంట్లను చదివి వాటిని అర్థం చేసుకొని అధ్యయనం చేయాల్సిన వారెవరికైనా సరే.. చదవడం నుంచి రిలీఫ్ దొరుకుతుందంటే.. ఒక వరం దొరికినట్టే. అర్థమయ్యేలా మీకు చదివి వినిపిస్తాం... తీరిగ్గా కూర్చొని లేదా మరోపని చేసుకొంటూ వినండి చాలు... అంటే అంతకన్నా ఆనందం ఉండదేమో! ఇటువంటి వారికి ఉపయోగకరమైనవి ఈ సాఫ్ట్వేర్లు, ఈ వెబ్సైట్లు. వీటిని అద్భుతాలు అనలేం కానీ, సొంతంగా చదువుకోవడం బోర్ కొట్టినప్పుడు, భారమైనప్పుడు ఇవి రిలీఫ్ ఇస్తాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో దాగున్నాయి... ప్రొఫెషనల్ డిగ్రీల్లో ఎమ్ఎస్ ఆఫీస్ నేర్చుకొన్నవాళ్లైనా, బయట ఇన్స్టిట్యూట్లో ఎమ్ఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్లకైనా ఎమ్ఎస్ వర్డ్‌లోని ‘స్పీక్’ ఆప్షన్ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ల సంగతిని పక్కనబెడితే తెలియనివాళ్లు, తెలిసీ ఉపయోగించని వాళ్లు కూడా అనేకమంది ఉంటారు. ఎమ్ఎస్ ఆఫీస్‌లో డీఫాల్ట్‌గా ఉంటుంది ఈ ఆప్షన్. ప్రతి వర్డ్ విండో మీద ఈ స్పీక్ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. వర్డ్‌లోని ‘క్విక్ యాక్సెస్ టూల్బార్’లో ‘స్పీక్’ బటన్ లేకపోతే ‘మోర్ కమాండ్స్’ బటన్ మీద ప్రెస్ చేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అవుతుంది. దీంట్లో ‘కమాండ్స్ నాట్ ఇన్ రిబ్బన్’ సెక్షన్లో ‘స్పీక్’ ఆప్షన్ ను పట్టుకోవచ్చు. అందులో స్పీక్‌ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ క్లిక్ చేస్తే స్పీక్ ఆప్షన్ ‘క్విక్ యాక్సెస్ టూల్బార్ రిబ్బన్’ మీద ప్రత్యక్షం అవుతుంది. అలా ఇన్స్టాల్ చేసుకొన్న స్పీక్ ఆప్షన్ వర్డ్‌లోని టెక్ట్స్‌ను గట్టిగా చదివి వినిపిస్తుంది. నెరేటర్..: విండోస్‌లోని స్క్రీన్రీడింగ్ టెక్నాలజీనే నెరేటర్ అని అంటారు. ఇది విండోస్ 7 ఓఎస్ ఆ తర్వాతి వెర్షన్లపై అందుబాటులో ఉంటుంది. నెరేటర్‌ను ఉపయోగించడంలో షార్ట్‌కట్ కీస్ కూడా ఉంటాయి. కీవర్డ్స్ ద్వారానే పేరాగ్రాఫ్‌లను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాలబొల్క..: టెక్ట్స్ డాక్యుమెంట్లను వినడానికి అనువుగా ఉపయోగపడే సాఫ్ట్వేర్లలో మరో అడుగు ముందుకు వేస్తుంది బాలబొల్క. దీని ద్వారా టెక్ట్స్ డాక్యుమెంట్లను కేవలం వినడం మాత్రమే కాకుండా రికార్డు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సేవ్ చేసిన ఫైల్స్‌ను పంపుకోవడానికి (సెండ్ చేయడానికి) కూడా అవకాశం ఉంటుంది. ఇది థ ర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. వేవ్, ఎమ్పీ త్రీ ఫార్మాట్లలో ఆడియో ఫైల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్‌ఎక్స్‌పీ, విండోస్ విస్తా, విండోస్7, విండోస్ 8 ఓఎస్‌లపై పనిచేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, రష్యన్, ఉక్రెయిన్ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. టైపెల్ట్ రీడిల్ట్..: చూపుకు ఆనని అక్ష రాలను చదవడానికి అవకాశం లేనప్పుడు వినడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. వారికోసం టైపెల్ట్ రీడిల్ట్ సాఫ్ట్వేర్ ఉపయోగకరంగా ఉంటుంది. స్పోకెన్ సౌండ్‌ను ఐ ట్యూన్స్, సీడీ, పవర్ పాయింట్, ఫైల్స్‌గా మార్చుకోవచ్చు. నేచురల్ రీడర్ ఫ్రీ: విండోస్, మ్యాక్ ఓఎస్‌లపై ఇది పనిచేస్తుంది. ఫ్రీ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకొని టెక్ట్స్ ఫైల్స్ ను వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎమ్పీ త్రీ లో సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కావలసిన టెక్ట్స్‌ను విండోస్‌లో పేస్ట్ చేసుకోవడం ద్వారా వినడానికి అవకాశం ఉంటుంది. ఉచిత వెర్షన్ నచ్చితే పర్సనల్ వెర్షన్ కొనుక్కోవచ్చు. పర్సనల్ వెర్షన్ 69 డాలర్ల ధర నుంచి లభిస్తుంది. ఇ- స్పీక్: ఇది విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్‌లపై పనిచేస్తుంది. విండోస్‌లో సహజసిద్ధంగా ఇన్స్టాల్ అయిన స్పీకింగ్ సాఫ్ట్వేర్లు మీకు నచ్చకపోతే, ఇ- స్పీక్‌ను ఎంచుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వాయిస్ నచ్చనివారిని ఇది భిన్నమైన వాయిస్‌తో అలరిస్తుంది. దీనిద్వారా టీఎక్స్‌టీ ఫార్మాట్లోని డాక్యుమెంట్లను డబ్ల్యూఏవీ ఫార్మాట్లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్ట్స్ టు స్పీచ్ అప్లికేషన్లలో ఉత్తమమైనది ఏది? అంటే బిల్ట్ ఇన్ అప్లికేషన్లు ఉత్తమమైనవని నిపుణులు అంటారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌తో వచ్చే అప్లికేషన్లను వాడుకోవడం మంచిదంటారు. అయితే థర్డ్ పార్టీ అప్లికేషన్లపై ఆసక్తి ఉన్నవారు బాలబొల్కాను ఎంచుకోవడం మంచిదంటారు. వెబ్సైట్లూ ఉన్నార: కేవలం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఆధారపడి పనిచేసే అప్లికేషన్లే కాక టెక్ట్స్‌ను చదివించే కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఎటువంటి ఇన్స్టలేషన్ల అవసరం లేకుండా వీటిద్వారా టెక్ట్స్ డాక్యుమెంట్లను ఆడియో ఫైల్స్‌గా వినడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సైట్లలో కొన్ని... ఫెస్ట్‌వోక్స్: ఉచితం, వేగవంతం... ఫెస్ట్‌వోక్స్ ప్రత్యేకతలివి. అమెరికన్, స్పానిష్, ఇండియన్, స్కాటిష్, బ్రిటిష్ యాక్సెంట్లలో ఇంగ్లిష్ వాయిస్‌ను వినిపిస్తుంది. టెక్ట్స్ రూపంలో ఇచ్చిన ఇన్పుట్ను వాయిస్ రూపంలో వినిపిస్తుంది. అలాగే ఇందులో మేల్, ఫిమేల్ వాయిస్‌ను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వోజ్మీ: ఇది ఫెస్ట్‌వోక్స్ కన్నా వేగవంతమైనదట. అలాగే ఇది టెక్ట్స్ ఫైల్స్‌ను ఎమ్‌పీత్రీ ఫైల్స్‌గా కూడా కన్వర్ట్ చేస్తుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. చదవడానికి ఓపికలేని సమయాల్లో టెక్ట్స్‌ను కాపీ చేసి ఈ బాక్స్‌లో పడేస్తే... దాన్ని చదివి వినిపించడమే కాక ఆడియోఫైల్స్గా సేవ్ చేస్తుంది. వాటిని ఎమ్‌పీత్రీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జామ్ జర్: టెక్ట్స్‌ఫైల్ మొత్తాన్నీ కాపీ చే సి పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా వెబ్పైజ్ యూఆర్ఎల్ను పేస్ట్ చేస్తే చాలు అందులోని కంటెంట్‌ను అవసరమైన ఆడియో ఫార్మాట్లోకి మార్చి ఇస్తుంది ఈ వెబ్సైట్. ఆండ్రాయిడ్ అప్లికేషన్లు: కంప్యూటర్ల విషయంలోనే కాక స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా టెక్ట్స్ టు స్పీక్ అప్లికేషన్లున్నాయి. స్మార్ట్‌ఫోన్ తెరమీద డిస్ప్లే అయ్యే టెక్ట్స్‌ను చదవడం కాకుండా వినడానికే అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్లతో. స్పీక్ మీ: ఆండ్రాయిడ్ డివైజ్‌ను డ్రైవింగ్ మోడ్‌లో పెడితే ఆ సమయంలో ఫోన్‌ను చేతిలోకి తీసుకొనే అవసరం లేకుండా రిసీవ్ అయ్యే మెయిల్స్, మెసేజ్‌లను చదివి వినిపిస్తుంది ఈ అప్లికేషన్. అన్నిరకాల నోటిఫికేషన్స్ ను స్పోకెన్ మెసేజెస్గా మారుస్తుంది ఇది. క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది: కళ్లకు విశ్రాంతిని ఇస్తూ.. సమాచారాన్ని వాయిస్ రూపంలో అందించే టెక్ట్స్ టు వాయిస్ సర్వీసుల విషయంలో గూగుల్ క్రోమ్ కూడా ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులో ఉంచింది. ౌ్చఠఛిజీజడ అనే ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకొని వెబ్పేజెస్లోని సమాచారాన్ని ఆడియో ఫైల్స్‌గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉచితంగానే అందుబాటులో ఉంది. క్రోమ్ వెబ్‌స్టోర్‌లో లభ్యమవుతుంది. ఐఓఎస్ అప్లికేషన్లు ఇవి: లేటెస్ట్ ఐ ప్యాడ్, ఐ ఫోన్లలో టెక్ట్స్ టు స్పీచ్ డివైజ్‌లు ఇన్‌బిల్ట్‌గా ఉంటున్నాయి. ఇవిగాక ఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయంలో స్పీక్ ఇట్, వెబ్ రీడర్ హెచ్డీ, స్పీక్ ప్యాడ్, వాయిస్ జనరేటర్, టెక్ట్స్ టు స్పీచ్, టెక్ట్స్ టు టాక్ హెచ్డీ, రీడ్ ఇట్ వంటి అప్లికేషన్లు ఉచిత, పెయిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. - జీవన్‌రెడ్డి.బి -
కోట్స్ = కొండంత ఆత్మ విశ్వాసం
‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతేమంది ఉన్నారు. హితబోధకు భిన్నంగా విజయపు విశ్వాసాన్ని ఇచ్చే నయా వేదాంతం పట్ల యువత ఎంతో ఆసక్తి కనపరుస్తోంది. ‘‘ఈ వాక్యం నా కోసమే చెప్పింది.. నా లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ అవుతోంది’’ అనుకుంటే చాలు టక్కున షేర్ చేసుకోవడమే! ‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ఫేస్బుక్లో నడుస్తున్న ఈ కోట్స్ ట్రెండ్ గురించి! ‘‘నేను అనేకసార్లు ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. నా స్నేహితుడు అన్నింటిలోనూ పాసయ్యాడు. అతడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో ఒక ఉద్యోగి. నేను మైక్రోసాఫ్ట్ ఓనర్‌ను...’’ అతి విశ్వాసం ధ్వనిస్తోందా? లేక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందా? స్ఫూర్తిని పంచుతోందా? అంటే చెప్పలేం కానీ నేటి యువతకు బాగా నచ్చిన వాక్యమిది. ఫేస్బుక్లో బాగా షేర్ అవుతుండటమే ఇందుకు రుజువు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఆపాదించబడిన ఈ కామెంట్ ఎందరో యువకులకు స్ఫూర్తిని ఇస్తోంది. తమ జీవితంలో ఎదుర్కొన్న పెద్ద ఫెయిల్యూర్ల తర్వాతే గొప్పవాళ్లంతా అద్భుతమైన సక్సెస్‌లను సాధించారు అనే విషయాన్ని పై కామెంట్ చెప్పకనే చెబుతోంది. ‘‘అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాళ్లే గొప్ప విజయాన్ని సాధించగలరు. గుర్తుంచుకోండి... ఫెయిల్యూర్ ఒక సంఘటన మాత్రమే. ఒక వ్యక్తి కాదు’’ రాబర్ట్ కెన్నడీ కోట్ ఇది. ఈ మాటలు... అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, గొప్పవిజయాన్ని సాధించవచ్చుననే విశ్వాసాన్నీ ఇస్తోంది. ‘‘నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది... పరాజయాన్ని ఆస్వాదించలేకపోతే, విజయానందాన్ని పొందలేరని. విమర్శలు ఎదుర్కొనకపోతే పొగడ్తలకు అర్హురాలివి కాదు’’ అని ఒక అవార్డ్ ఫంక్షన్లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి హాలీబెర్రీ చెప్పిన వాక్యమిది. హాలీబెర్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఆమె చెప్పిన ఈ మాటను కూడా అంతే ఇష్టపడుతున్నారు. అందులోని స్ఫూర్తిని గ్రహిస్తున్నారు. ‘‘ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వారిని నేను నమ్ముతాను. అభినందిస్తాను. అయితే తిరిగి ప్రయత్నించకపోవడాన్ని మాత్రం సమర్థించను’’ అంటున్నాడు ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్. ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నో కోట్స్... కొండంత ధైర్యాన్ని ఇచ్చేవి! - జీవన్‌రెడ్డి.బి