అక్షరాలను వినొచ్చు..! | text documents now can be listened! | Sakshi
Sakshi News home page

అక్షరాలను వినొచ్చు..!

Published Sat, Oct 12 2013 1:06 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

అక్షరాలను వినొచ్చు..! - Sakshi

అక్షరాలను వినొచ్చు..!

కంప్యూటర్ తెరపై డిస్‌ప్లే అయ్యే పెద్ద పెద్ద టెక్ట్స్ డాక్యుమెంట్స్ చదవడం కష్టమైన పని అనిపించవచ్చు. ఒక్కోసారి చదవడానికి ఓపిక లేకపోవచ్చు.  ఇలాంటి సమయంలో కంటికి కష్టం లేకుండా విరామాన్ని తీసుకోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బావుంటుందనిపిస్తే, ఇంగ్లిష్‌లో పేజ్‌లను సొంతంగా చదువుకోవడంగాక ఎవరైనా చదివి వినిపిస్తే హ్యాపీగా ఉంటుందనిపిస్తే... అలాంటి సమయాల్లో ‘హాయ్..’ అని పలకరించే సదుపాయాలున్నాయి! టెక్ట్స్ డాక్యుమెంట్లను చదివి వినిపిస్తూ సౌలభ్యంగా మారే అప్లికేషన్‌లు, వెబ్ సేవలు ఉన్నాయి.

పేరాలకొద్దీ చదివే ఓపిక లేనప్పుడు, పదాల ఉచ్చారణ అర్థం కాని సమయాల్లో వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది. విండోస్ ఓఎస్ పీసీకైనా, ఆండ్రాయిడ్‌ఫోన్‌కైనా, ఐఓఎస్ విషయంలోనైనా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుతూ.. మేము ‘టెక్ట్స్ డాక్యుమెంట్లను చదవం, వింటాం’ అని గర్వంగా చెప్పుకోవచ్చు!
 
 కంప్యూటర్‌లో టెక్ట్స్ డాక్యుమెంట్లను చదివి వాటిని అర్థం చేసుకొని అధ్యయనం చేయాల్సిన వారెవరికైనా సరే.. చదవడం నుంచి రిలీఫ్ దొరుకుతుందంటే.. ఒక వరం దొరికినట్టే. అర్థమయ్యేలా మీకు చదివి వినిపిస్తాం... తీరిగ్గా కూర్చొని లేదా మరోపని చేసుకొంటూ వినండి చాలు... అంటే అంతకన్నా ఆనందం ఉండదేమో! ఇటువంటి వారికి ఉపయోగకరమైనవి ఈ సాఫ్ట్‌వేర్‌లు, ఈ వెబ్‌సైట్లు. వీటిని అద్భుతాలు అనలేం కానీ, సొంతంగా చదువుకోవడం బోర్ కొట్టినప్పుడు, భారమైనప్పుడు  ఇవి  రిలీఫ్ ఇస్తాయి.
 
 మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో దాగున్నాయి...
 ప్రొఫెషనల్ డిగ్రీల్లో ఎమ్‌ఎస్ ఆఫీస్ నేర్చుకొన్నవాళ్లైనా, బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్‌ఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్లకైనా ఎమ్‌ఎస్ వర్డ్‌లోని ‘స్పీక్’ ఆప్షన్ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ల సంగతిని పక్కనబెడితే తెలియనివాళ్లు, తెలిసీ ఉపయోగించని వాళ్లు కూడా అనేకమంది ఉంటారు. ఎమ్‌ఎస్ ఆఫీస్‌లో డీఫాల్ట్‌గా ఉంటుంది ఈ ఆప్షన్. ప్రతి వర్డ్ విండో మీద ఈ స్పీక్ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. వర్డ్‌లోని ‘క్విక్ యాక్సెస్ టూల్‌బార్’లో ‘స్పీక్’ బటన్ లేకపోతే ‘మోర్ కమాండ్స్’ బటన్ మీద ప్రెస్ చేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అవుతుంది. దీంట్లో ‘కమాండ్స్ నాట్ ఇన్ రిబ్బన్’ సెక్షన్‌లో ‘స్పీక్’ ఆప్షన్ ను పట్టుకోవచ్చు. అందులో స్పీక్‌ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ క్లిక్ చేస్తే స్పీక్ ఆప్షన్ ‘క్విక్ యాక్సెస్ టూల్‌బార్ రిబ్బన్’ మీద ప్రత్యక్షం అవుతుంది. అలా ఇన్‌స్టాల్ చేసుకొన్న స్పీక్ ఆప్షన్ వర్డ్‌లోని టెక్ట్స్‌ను గట్టిగా చదివి వినిపిస్తుంది.
 
 నెరేటర్..: విండోస్‌లోని స్క్రీన్‌రీడింగ్ టెక్నాలజీనే నెరేటర్ అని అంటారు. ఇది విండోస్ 7 ఓఎస్ ఆ తర్వాతి వెర్షన్‌లపై అందుబాటులో ఉంటుంది. నెరేటర్‌ను ఉపయోగించడంలో షార్ట్‌కట్ కీస్ కూడా ఉంటాయి. కీవర్డ్స్ ద్వారానే పేరాగ్రాఫ్‌లను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 బాలబొల్క..: టెక్ట్స్ డాక్యుమెంట్లను వినడానికి అనువుగా ఉపయోగపడే సాఫ్ట్‌వేర్లలో మరో అడుగు ముందుకు వేస్తుంది బాలబొల్క. దీని ద్వారా టెక్ట్స్ డాక్యుమెంట్లను కేవలం వినడం మాత్రమే కాకుండా రికార్డు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సేవ్ చేసిన ఫైల్స్‌ను పంపుకోవడానికి (సెండ్ చేయడానికి) కూడా అవకాశం ఉంటుంది. ఇది థ ర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్. వేవ్, ఎమ్‌పీ త్రీ ఫార్మాట్లలో ఆడియో ఫైల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్‌ఎక్స్‌పీ, విండోస్ విస్తా, విండోస్7, విండోస్ 8 ఓఎస్‌లపై పనిచేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, రష్యన్, ఉక్రెయిన్ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది.
 
 టైపెల్ట్ రీడిల్ట్..:
చూపుకు ఆనని అక్ష రాలను చదవడానికి అవకాశం లేనప్పుడు వినడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. వారికోసం టైపెల్ట్ రీడిల్ట్ సాఫ్ట్‌వేర్ ఉపయోగకరంగా ఉంటుంది. స్పోకెన్ సౌండ్‌ను ఐ ట్యూన్స్, సీడీ, పవర్ పాయింట్, ఫైల్స్‌గా మార్చుకోవచ్చు.
 
 నేచురల్ రీడర్ ఫ్రీ:
విండోస్, మ్యాక్ ఓఎస్‌లపై ఇది పనిచేస్తుంది. ఫ్రీ వెర్షన్‌లను ఇన్‌స్టాల్ చేసుకొని టెక్ట్స్ ఫైల్స్ ను వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎమ్‌పీ త్రీ లో సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కావలసిన టెక్ట్స్‌ను విండోస్‌లో పేస్ట్ చేసుకోవడం ద్వారా వినడానికి అవకాశం ఉంటుంది. ఉచిత వెర్షన్ నచ్చితే పర్సనల్ వెర్షన్ కొనుక్కోవచ్చు. పర్సనల్ వెర్షన్ 69 డాలర్ల ధర నుంచి లభిస్తుంది.
 
 ఇ- స్పీక్: ఇది విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్‌లపై పనిచేస్తుంది. విండోస్‌లో సహజసిద్ధంగా ఇన్‌స్టాల్ అయిన స్పీకింగ్ సాఫ్ట్‌వేర్లు మీకు నచ్చకపోతే, ఇ- స్పీక్‌ను ఎంచుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వాయిస్ నచ్చనివారిని ఇది భిన్నమైన వాయిస్‌తో అలరిస్తుంది. దీనిద్వారా టీఎక్స్‌టీ ఫార్మాట్‌లోని డాక్యుమెంట్లను డబ్ల్యూఏవీ ఫార్మాట్‌లోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్ట్స్ టు స్పీచ్ అప్లికేషన్‌లలో ఉత్తమమైనది ఏది? అంటే బిల్ట్ ఇన్ అప్లికేషన్‌లు ఉత్తమమైనవని నిపుణులు అంటారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌తో వచ్చే అప్లికేషన్లను వాడుకోవడం మంచిదంటారు. అయితే థర్డ్ పార్టీ అప్లికేషన్లపై ఆసక్తి ఉన్నవారు బాలబొల్కాను ఎంచుకోవడం మంచిదంటారు.
 
 వెబ్‌సైట్లూ ఉన్నార:
కేవలం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఆధారపడి పనిచేసే అప్లికేషన్లే కాక టెక్ట్స్‌ను చదివించే కొన్ని వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ఎటువంటి ఇన్‌స్టలేషన్ల అవసరం లేకుండా వీటిద్వారా టెక్ట్స్ డాక్యుమెంట్లను ఆడియో ఫైల్స్‌గా వినడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సైట్లలో కొన్ని...
 
 ఫెస్ట్‌వోక్స్:
ఉచితం, వేగవంతం... ఫెస్ట్‌వోక్స్ ప్రత్యేకతలివి. అమెరికన్, స్పానిష్, ఇండియన్, స్కాటిష్, బ్రిటిష్ యాక్సెంట్లలో ఇంగ్లిష్ వాయిస్‌ను వినిపిస్తుంది. టెక్ట్స్ రూపంలో ఇచ్చిన ఇన్‌పుట్‌ను వాయిస్ రూపంలో వినిపిస్తుంది. అలాగే  ఇందులో మేల్, ఫిమేల్ వాయిస్‌ను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 వోజ్‌మీ: ఇది ఫెస్ట్‌వోక్స్ కన్నా వేగవంతమైనదట. అలాగే ఇది టెక్ట్స్ ఫైల్స్‌ను ఎమ్‌పీత్రీ ఫైల్స్‌గా కూడా కన్‌వర్ట్ చేస్తుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. చదవడానికి ఓపికలేని సమయాల్లో టెక్ట్స్‌ను కాపీ చేసి ఈ బాక్స్‌లో పడేస్తే... దాన్ని చదివి వినిపించడమే కాక ఆడియోఫైల్స్‌గా సేవ్ చేస్తుంది. వాటిని ఎమ్‌పీత్రీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 జామ్ జర్: టెక్ట్స్‌ఫైల్ మొత్తాన్నీ కాపీ చే సి పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా వెబ్‌పైజ్ యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేస్తే చాలు అందులోని కంటెంట్‌ను అవసరమైన ఆడియో ఫార్మాట్‌లోకి మార్చి ఇస్తుంది ఈ వెబ్‌సైట్.
 
 ఆండ్రాయిడ్ అప్లికేషన్లు:
కంప్యూటర్ల విషయంలోనే కాక స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా టెక్ట్స్ టు స్పీక్ అప్లికేషన్లున్నాయి. స్మార్ట్‌ఫోన్ తెరమీద డిస్‌ప్లే అయ్యే టెక్ట్స్‌ను చదవడం కాకుండా వినడానికే అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్లతో.
 
 స్పీక్ మీ: ఆండ్రాయిడ్ డివైజ్‌ను డ్రైవింగ్ మోడ్‌లో పెడితే ఆ సమయంలో ఫోన్‌ను చేతిలోకి తీసుకొనే అవసరం లేకుండా రిసీవ్ అయ్యే మెయిల్స్, మెసేజ్‌లను చదివి వినిపిస్తుంది ఈ అప్లికేషన్. అన్నిరకాల నోటిఫికేషన్స్ ను స్పోకెన్ మెసేజెస్‌గా మారుస్తుంది ఇది.
 
 క్రోమ్ ఎక్స్‌టెన్షన్ కూడా ఉంది: కళ్లకు విశ్రాంతిని ఇస్తూ.. సమాచారాన్ని వాయిస్ రూపంలో అందించే టెక్ట్స్ టు వాయిస్ సర్వీసుల విషయంలో గూగుల్ క్రోమ్ కూడా ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులో ఉంచింది. ౌ్చఠఛిజీజడ అనే ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వెబ్‌పేజెస్‌లోని సమాచారాన్ని ఆడియో ఫైల్స్‌గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉచితంగానే అందుబాటులో ఉంది. క్రోమ్ వెబ్‌స్టోర్‌లో లభ్యమవుతుంది.
 
 ఐఓఎస్ అప్లికేషన్లు ఇవి: లేటెస్ట్ ఐ ప్యాడ్, ఐ ఫోన్‌లలో టెక్ట్స్ టు స్పీచ్ డివైజ్‌లు ఇన్‌బిల్ట్‌గా ఉంటున్నాయి. ఇవిగాక ఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయంలో స్పీక్ ఇట్, వెబ్ రీడర్ హెచ్‌డీ, స్పీక్ ప్యాడ్, వాయిస్ జనరేటర్, టెక్ట్స్ టు స్పీచ్, టెక్ట్స్ టు టాక్ హెచ్‌డీ, రీడ్ ఇట్ వంటి అప్లికేషన్లు ఉచిత, పెయిడ్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
 
 - జీవన్‌రెడ్డి.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement