చిన్నప్పటి నుంచి నేనింతే! | Learning sword fighting was exhilarating: Shruti Haasan | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచి నేనింతే!

Published Sat, Apr 22 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

చిన్నప్పటి నుంచి నేనింతే!

చిన్నప్పటి నుంచి నేనింతే!

అసాధ్యం అన్నది నా డిక్షనరీలోనే లేదు అంటున్నారు నటి శ్రుతీహాసన్‌. తనకు నచ్చింది చేసే, మనసుకు అనిపించింది చెప్పే నటి శ్రుతీహాసన్‌. నటిగా ఆదిలో అపజయాలను చవిచూసినా, ఆ తరువాత విజయాల బాట పట్టిన శ్రుతీ నేడు భారతీయ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్న నాయకి.తొలి చిత్రంలోనే గ్లామర్‌ విషయంలో(హిందీ చిత్రం లక్‌) చాలా బోల్డ్‌గా నటించి పలు విమర్శలను మూటకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత కూడా అందాలారబోత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్‌ అంటే అర్థం ఏమిటని ఎదరు ప్రశ్న వేసే గట్స్‌ ఉన్న నటి శ్రుతీహాసన్‌.

చిన్నతనం నుంచీ నేనింతే అంటున్న ఆ బ్యూటీ చెప్పే సంగతులు చూద్దాం. చిన్న తనం నుంచి ఇది నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే ఆ పనిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరిగేది. దాన్ని సాధించే వరకూ నిద్ర పోయేదాన్ని కాదు.ఇప్పటి వరకూ ఆ మొండి పట్టుదల నన్ను విడిచి పోలేదు. నేను దేనికీ భయపడను. సాధించాలన్న నాలో కసి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా కష్టమైన పాత్రలో నటించాల్సి వస్తే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా? అన్న సంకోచం కలగదు. కచ్చితంగా చేయగలనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళతాను.

నేను నటిగా సక్సెస్‌ అయ్యాను, ఏమైనా చెబుతాను అనుకోవద్దు.పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎక్కువగా సంగీతం, ఇతర కాలక్షేప అంశాలపైనే ఆసక్తి చూపడంతో చదువును నిర్లక్ష్యం చేసేదాన్ని.అయితే పరీక్షలు దగ్గర పడగానే రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు తెసుకునేదాన్ని. మరొకరైతే మొదటి నుంచి చదవలేదు ఇప్పుడు చదివి ఏం మార్కులు తెచ్చుకుంటాంలే అని నిరాశకు గురవుతారు. నేనలాకాదు, అలాంటి పట్టుదలతోనే సినిమారంగంలోకి ప్రవేశించాను. శ్రమిస్తే కచ్చితంగా ఫలితం ఉం టుంది.అలాంటి ధైర్యంతోనే నటినయ్యా. ఇప్పుడు సినిమా నాకు చాలా మంచి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement