Glamor
-
చీర అందాలతో గ్లామర్ డోస్ పెంచిన మౌనీరాయ్ (ఫోటోలు)
-
ముత్యాల హారాలతో గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి (ఫోటోలు)
-
ఆలోచనల అలల్లో.. శోభిత గ్లామర్ చూడాల్సిందే! (ఫోటోలు)
-
గ్లామరస్ ఫోటోలు.. ట్రోలింగ్‌కు గురైన నటి
ముంబై : తండ్రి మరణించిన వారం రోజుల్లోనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టీవీ నటి దివ్య అగర్వాల్ ట్రోల్స్‌కు గురయ్యారు. ఇటీవల దివ్య తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే నటి దివ్య ఓ మ్యాగజైన్ కవర్‌ఫోటో షూట్ చేసింది. హాట్ హాట్ అందాలతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక అప్పటినుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో మూవ్ ఆన్ అయ్యి మళ్లీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారమో అంటూ ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చింది. (డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా: లాయర్ ) View this post on Instagram Not an ordinary heart ! Posted @withregram • @glmagazine_india Nothing more! Just slowing down with Divya Agarwal in our new issue 🌟💫 Magazine: Grandeur Lifestyle @glmagazine_india On the cover: @divyaagarwal_official Edition: October, 2020 Manging editor: @inndresh_official Editor: @editor_glmagazine Magazine’s Creative Director: @vjvasundhara Chief content manager: @ccm_glmagazine Content writer: @tanishka.juneja Photographer: @ikshitpatel Styling: @esha_bhuchar & @mehnaazazad Outfit: @tenassi.in & @jeetkhatri PR: @sinhavantika & @soapboxprelations Produced by: @brandcorpsmedianetwork #divyaagarwal #magazine #october #cover #editorial #magazinecover #bollywood #actress #bollywoodstyle #video #fashion #style #fashionstyle #stylist #grandeurlifestyle #glmagazineindia #instafashion #instagram #videooftheday #instadaily #instamood #instapic #instavideo #photography #video #photoshoot #grandeurlifestylemagazine #divyaagarwal_official A post shared by Divya Sanjay Agarwal (@divyaagarwal_official) on Nov 4, 2020 at 4:41am PST -
మా మంత్రి చాలా గ్లామర్
బనశంకరి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కన్నడనటి, మంత్రి జయమాల గ్లామర్ గురించి మాజీ మంత్రి బహిరంగంగా కొనియాడారు. బుధవారం ఉడుపిలో కాంగ్రెస్ నేత ప్రమోద్ మధ్వరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సమయంలో ఉడుపి జిల్లా ఇన్చార్జ్మంత్రి జయమాల గ్లామర్‌గా ఉందని, ఆమె జిల్లా పర్యటనతో జయమాల గాలి వీస్తోందని అన్నారు. ఒక్కరోజు ప్రచారంతో జిల్లాలో తీవ్ర ప్రభావం చూపారని, జయమాల తనకంటే గ్లామరస్ గా ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో కార్యకర్తలు, విలేకరులు తెల్లబోయారు. -
ప్రియాంక ఆత్మహత్యపై స్పందించిన సంచలన నటి
సినిమా రంగంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని అంటోంది నటి అమలాపాల్. ఆ మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ హడావుడి చేసిన ఈ సంచలన నటి స్పీడ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. ఈ మధ్య ఎవరో ఏదో అన్నాడంటూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగి వార్తల్లోకెక్కే ప్రయత్నం చేసినా అది అప్పుడే సద్దుమణిగిపోయింది. ఇకపోతే ఈ అమ్మడికిప్పుడు సినిమాలు కూడా తగ్గాయి. అరవిందస్వామితో రొమాన్స్ చేసిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం అమలాపాల్‌కు నిరాశ కలిగించిందనే చెప్పాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రక్షకన్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. మలయాళంలో ఒక చిత్రంలో నటిస్తోంది. దీంతో అవకాశాల వేటలో పడ్డ అమలాపాల్ అందుకు గ్లామర్‌ను నమ్ముకుంటోంది. అవును సెక్సీ ఫొటోలను ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్రీ ప్రచారం పొందాలనుకుంటోంది. ఆ మధ్య పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఖరీదైన కారును కొనుగోలు చేసి కేరళ రాష్ట్ర రవాణా శాఖ ఆదాయానికి గండి కొట్టి కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా సినిమారంగంలో జరిగే సంఘటనలపై తనదైన బాణీలో స్పందిస్తూ వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య సంఘటనపై అమలాపాల్ స్పందిస్తూ, కుటుంబ సెంటిమెంట్‌తో కొందరు హీరోయిన్లు నటనకు దూరం అవుతుండడం, ప్రాణాలను తీసుకోవడం వంటి అగత్యాలకు పాల్పడుతున్నారని అంది. మరో విషయం ఏమిటంటే బలహీనమైన వారికి సినిమా సెట్ అవదు అని అంది. ఈ రంగంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చునని అంది. మనోధైర్యం కలిగిన వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని పేర్కొంది. సినిమా రంగమే కాదు ఏ రంగంలోని మహిళలకైనా ఇది వర్తిస్తుంది అని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ మహిళలు చాలా సవాళ్లనే ఎదుర్కొనాల్సి ఉంటుంది అని అమలాపాల్ చెప్పుకొచ్చింది. -
యోగ వైభవం
నేడు వరల్డ్ మ్యూజిక్ యోగా ⇒కిర్రాక్ పుట్టిస్తున్న సిటీ డీజేలు, ఆర్జేలు ⇒ప్రతి వేడుకలోనూ వీరిదే సందడి ⇒కొత్తగా వచ్చిన క్రేజీ కరౌకే.. ⇒ర్యాక్ బ్యాండ్లతో కేక పుట్టిస్తున్న సిటీ యూత్ ⇒ఆదాయ మార్గంగా మలచుకుంటున్న కుర్రకారు ⇒మ్యూజిక్ టూర్లతో స్పెషల్ అట్రాక్షన్ జంట నగరాల్లో జంట వేడుకలు. మన దేశంలో ఊపిరిపోసుకుని విశ్వవ్యాప్తం అయిన ఆరోగ్య సాధనం ఒకటైతే... మన అభిరుచుల్లో ఒదిగిపోతూ మనల్ని నీడై తోడై అనుసరించే విశ్వజనీన ఆనంద మార్గం మరొకటి. అభివృద్ధి పథంలో పయనిస్తూనే ఆరోగ్య సమస్యల్నీ పోగు చేసుకుంట్ను నగరజీవికి ‘యోగా’ను మించిన ఆరోగ్య సాధనం కనపడడం లేదు. ఉరుకులు పరుగుల జీవితంలో కాసింత ఉల్లాసం కావాలంటే సంగీతాన్ని మించిన సాంత్వన ‘వినపడడం’ లేదు. అందుకే యోగా బాట పట్టి, రాగాలను ఒడిసిపట్టిన నగరజీవి ఆరోగ్య.. ఆనంద అన్వేషణకు నేటి మా ప్రత్యేక కథనాలే ‘సాక్షి’... హైటెక్ సిటీ ‘మ్యూజిక్’ సిటీగా మారుతోంది. రాక్..కిర్రాక్ అంటూ మన కుర్రకారు హుషారెత్తిస్తున్నారు. ఇక్కడి డీజేలు, ఆర్జేలు అన్ని వేడుకల్లోనూ అదరగొడుతున్నారు. మ్యూజిక్ టూర్లతో మత్తెక్కిస్తున్నారు. కొత్తగా ‘కరౌకే’ క్రేజ్ మరోవైపు. మొత్తంగా సిటీ యూత్ సంగీతాన్ని ఆదాయంగా,వినోదాత్మకంగా మలచుకుంటున్నారు. తెరమీద తళుక్కుమనాలి. నిత్యనూతనంగా మెరిసిపోవాలి. నాజూకు లావణ్యంతో ‘నవ’ నవలాడాలి. ఎంతటి ఒత్తిడికైనా తట్టుకోవాలి. ఎక్కడైనా, ఎలాంటి వేదికపై అయినా చెరగని చిరునవ్వుతో కనిపించాలి. సినీ తారల భుజాల మీద ఇన్ని బాధ్యతలు ఉంటాయి. అందుకేనేమో... సినీతారల్లో యోగ సాధన ఒక క్రమం తప్పని అలవాటుగా మారుతోంది. దీంతో నగరంలోని యోగ స్టూడియోలు తారల తళుకులకు నిలయంగా మారుతున్నాయి. శిల్పాశెట్టి నుంచి షెర్టిన్ చోప్రా దాకా.. అమల అక్కినేని నుంచి రాశిఖన్నా దాకా ఏ హీరోయిన్ను చూసినా యోగా రాగమే. అయితే హీరోలతో పోలిస్తే ఈ యోగ సాధన విషయంలో హీరోయిన్లు మరింత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందమే ఆరోగ్యం... గ్లామర్ సంతరించుకోవడానికి, ఉన్న గ్లామర్ కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నించే సినీ స్టార్లు యోగాసనాలను ఆశ్రయిస్తున్నారు. ‘‘జిమ్, వర్కవుట్ కూడా చేస్తా. అయితే వీటన్నింటికన్నా యోగా ఆసనాలు చాలా ప్రధానం. హెల్త్, బ్యూటీకి సంబంధించి అన్ని రకాల సమస్యలకీ ఆసనాల ద్వారా సమాధానం లభిస్తుంది’’అంటారు ప్రముఖ సినీ నటి రాశిఖన్నా. ముఖవర్ఛస్సు మెరుగుపరచేందుకు, చర్మంలో పటుత్వం కాపాడేందుకు, దేహమంతా రక్తప్రసరణకు, తద్వారా శరీరం కాంతి వంతంగా మారేందుకు.... ఇలా విభిన్న అవసరాలకు అనుగుణమైన ఆసనాలు కూడా యోగాలో ఉన్నాయని చెబుతున్నారు. దేహం దూదిపింజెలా... సినిమా తారలకు డ్యాన్సుల అవసరం బాగా ఎక్కువనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో నృత్యం చేసే సమయంలో శరీరానికి అవసరమైన ఫ్లెక్సిబులిటిని యోగా అందిస్తుందని తారలు అంటున్నారు. ‘‘నిర్ణీత వేడి వాతావరణంలో చేసే హఠయోగా ద్వారా కలిగే లాభాలు అద్భుతం. గంటన్నర పాటు యోగా సాధన చేసిన తర్వాత శరీరం దూదిపింజలా అయిపోతుంది. ఇది డ్యాన్సులు, ఫైట్ల వంటివి మరింత బాగా చేయడానికి అవసరమైన ఫ్లెక్సిబులిటీ కూడా అందిస్తుంది’’అని చెప్పారు సినీ హీరో తరుణ్. ఆసనాలు చేయడానికి ఇంట్లో కూడా అవకాశం ఉన్నప్పటికీ యోగసాధన ప్రియులతో చేయడంలో మరింత ఉల్లాసంగా ఉంటుందన్నారాయన. -
చిన్నప్పటి నుంచి నేనింతే!
అసాధ్యం అన్నది నా డిక్షనరీలోనే లేదు అంటున్నారు నటి శ్రుతీహాసన్. తనకు నచ్చింది చేసే, మనసుకు అనిపించింది చెప్పే నటి శ్రుతీహాసన్. నటిగా ఆదిలో అపజయాలను చవిచూసినా, ఆ తరువాత విజయాల బాట పట్టిన శ్రుతీ నేడు భారతీయ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్న నాయకి.తొలి చిత్రంలోనే గ్లామర్ విషయంలో(హిందీ చిత్రం లక్) చాలా బోల్డ్‌గా నటించి పలు విమర్శలను మూటకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత కూడా అందాలారబోత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్ అంటే అర్థం ఏమిటని ఎదరు ప్రశ్న వేసే గట్స్ ఉన్న నటి శ్రుతీహాసన్. చిన్నతనం నుంచీ నేనింతే అంటున్న ఆ బ్యూటీ చెప్పే సంగతులు చూద్దాం. చిన్న తనం నుంచి ఇది నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే ఆ పనిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరిగేది. దాన్ని సాధించే వరకూ నిద్ర పోయేదాన్ని కాదు.ఇప్పటి వరకూ ఆ మొండి పట్టుదల నన్ను విడిచి పోలేదు. నేను దేనికీ భయపడను. సాధించాలన్న నాలో కసి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా కష్టమైన పాత్రలో నటించాల్సి వస్తే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా? అన్న సంకోచం కలగదు. కచ్చితంగా చేయగలనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళతాను. నేను నటిగా సక్సెస్ అయ్యాను, ఏమైనా చెబుతాను అనుకోవద్దు.పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎక్కువగా సంగీతం, ఇతర కాలక్షేప అంశాలపైనే ఆసక్తి చూపడంతో చదువును నిర్లక్ష్యం చేసేదాన్ని.అయితే పరీక్షలు దగ్గర పడగానే రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు తెసుకునేదాన్ని. మరొకరైతే మొదటి నుంచి చదవలేదు ఇప్పుడు చదివి ఏం మార్కులు తెచ్చుకుంటాంలే అని నిరాశకు గురవుతారు. నేనలాకాదు, అలాంటి పట్టుదలతోనే సినిమారంగంలోకి ప్రవేశించాను. శ్రమిస్తే కచ్చితంగా ఫలితం ఉం టుంది.అలాంటి ధైర్యంతోనే నటినయ్యా. ఇప్పుడు సినిమా నాకు చాలా మంచి చేస్తోంది. -
ర్యాంప్అందాల పూలదారి
సరిగ్గా రెండ్రోజుల క్రితం గ్లామర్ పపంచంలో భారతీయ అందం మరోసారి త‘లుక్’మంది. ఏకంగా అమెరికా దేశపు అందాల కిరీటాన్ని స్వంతం చేసుకున్న విజయవాడ అమ్మాయి నీనా దావులూరి మరోసారి మన గ్లామర్ సత్తాను ప్రపంచానికి చాటింది. రకరకాల భయాలను, బిడియాలను త్వరత్వరగా వదుల్చుకుంటున్న తెలుగమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. మరెందరో అమ్మాయిలు ‘మోడల్స్’గా మెరిసేందుకు రాచబాట పరుస్తున్నారు. మోడలింగ్ అంటే అదేదో కేవలం అందాల ప్రదర్శన మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అయితే మిగిలిన అన్ని రంగాల తరహాలోనే అటు అందం ఇటు ఆత్మ విశ్వాసం, తెలివితేటలు అన్నీ ఉంటేనే మోడల్‌గా వెలుగొందడం సాధ్యమని గ్రహిస్తున్నారు. మోడల్‌గా మంచి అవకాశాలు దక్కించుకోవడం అనేది సినిమాలకు రెడ్‌కార్పెట్ అని కూడా అర్థం అవడంతో ఇటువైపు రావడానికి మరింతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న కొందరు హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక మోడల్స్‌ను పలకరించినప్పుడు ఇలా స్పందించారు. - ఎస్. సత్యబాబు ఎన్నో రిహార్సల్స్... కంప్యూటర్సైన్స్లో ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఒక మంచి జాబ్ ఎంత అవసరమో మనల్ని మనం ఇతరత్రా నిరూపించుకునే యాక్టివిటీ కూడా అంతే అవసరం కదా! అలాంటిదే మోడలింగ్. చదువుతో పాటు, జాబ్ చేస్తూనే మానసిక సంతృప్తి కోసం మోడల్‌గానూ కొనసాగాలనేది నా ఆశయం. పెద్ద సంఖ్యలో జనం మనల్ని చూస్తూ హర్షధ్వానాలు చేస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా! ఆ ఆనందాన్ని పొందేందుకే మోడల్‌గా మారాను. అయితే జనం ముందు కనపడే ఆ మెరుపుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ర్యాంప్ మీద మెరిసేందుకు ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిచేసినా ఒక్కసారి టాప్ మోడల్ అనిపించుకుంటే ఇక అన్నీ మర్చిపోతాం. తప్పనిసరిగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున వ్యాయామం చేయడం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం దాకా మా గెలుపు వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఈ రంగంలో నన్ను ఎంతమంది నిరుత్సాహపరచాలని చూసినా మా అమ్మ మాత్రం ప్రోత్సహించింది. టీవీలో, మేగ్జైన్లో, షోస్‌లో నన్ను చూసినప్పుడల్లా చుట్టుపక్కలవారికి చూపించి మురిసిపోతుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తరహాలో ఈ రంగంలో నా ప్రస్థానాన్ని సాగించాలనుకుంటున్నాను. - మోనిక.టి ఏ రంగంలో పనిచేసినా... మోడలింగ్‌ను దేనితోనూ పోల్చలేం. ఎందుకంటే అందులో ఉండే గ్లామర్, ఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటివి. ప్రస్తుతం ప్రముఖ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్నాను. టీనేజ్ నుంచి ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ ప్రొఫెషన్లో రాణించడానికి చక్కని ఫిజిక్ తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, డైట్ ఫాలో అవడం చేస్తున్నాను. ఫిజికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఈ రంగం మీద ఉన్న రకరకాల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా మా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడం నా అదృష్టం. వారే నాకు ప్రథమ విమర్శకులు కూడా. ఏ రంగంలో ఉన్నా మన విద్యార్హతలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే! ఆ క్రమంలోనే నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్) చేస్తున్నాను. - వింధ్య అందచందాలు మాత్రమే సరిపోవు... ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను. గ్లామర్ రంగంలో అందం అనేది ఒక ప్రాథమిక అర్హత మాత్రమే. చూడచక్కని రూపంతో బాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం వంటివి సైతం ఉంటేనే గ్లామర్ రంగంలో ఎదగగలం. నేను ఈ రంగానికి వచ్చి రెండేళ్లవుతోంది. చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌లోకి రావాలనుకుని దానికి అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని లఖోటియా మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో జేరాను. శిక్షణానంతరం ప్రసాద్ బిడప్ప మోడలింగ్ హంట్‌లో పాల్గొన్నాను. గత జూలైలో జరిగిన లఖోటియా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. ప్రస్తుతం పలు సంస్థల ఫొటో షూట్స్‌లో పాల్గొంటున్నాను. పలు బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. ర్యాంప్ షోలలో పాల్గొంటున్నాను. టాప్ మోడల్‌గా ఎదగాలని, బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. - ప్రియాంక