మా మంత్రి చాలా గ్లామర్‌ | Minister Jayamala Glamor : Pramod Madhuraj | Sakshi
Sakshi News home page

మా మంత్రి చాలా గ్లామర్‌

Published Thu, Aug 30 2018 12:17 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Minister Jayamala Glamor : Pramod Madhuraj  - Sakshi

బనశంకరి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కన్నడనటి, మంత్రి జయమాల గ్లామర్‌ గురించి మాజీ మంత్రి బహిరంగంగా కొనియాడారు. బుధవారం ఉడుపిలో కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ మధ్వరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సమయంలో ఉడుపి జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి జయమాల గ్లామర్‌గా ఉందని, ఆమె జిల్లా పర్యటనతో జయమాల గాలి వీస్తోందని అన్నారు. ఒక్కరోజు ప్రచారంతో జిల్లాలో తీవ్ర ప్రభావం చూపారని, జయమాల తనకంటే గ్లామరస్‌ గా ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో కార్యకర్తలు, విలేకరులు తెల్లబోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement