సాక్షిప్రతినిధి, వరంగల్: ‘బీజేపీ ఏ పార్టీతో కలవ లేదు, కలువబోదు’ అని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘మా మీద గుడ్డి ద్వేషంతో.. వారి కాళ్ల కింద భూమి కదిలిపోతోందని కొందరు కుట్రలు చేస్తున్నారు.
కొన్ని మీడియా సంస్థలు, పేపర్లు, యూట్యూబ్ చానళ్లు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’ అని విమర్శించారు. బీజేపీలో సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి రావడానికి నాంది పలుకుతున్నాయన్నారు.
శనివారం ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్న సందర్భంగా ఈటల హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో నిర్వహించే విజయ సంకల్పసభతో ఎన్నికల శంఖారావం పూరిస్తామ న్నారు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావులేదని, అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పారు.
ప్రజాస్వామ్యం ఖూనీపై మోదీ ఆందోళన
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మోదీ ఆందోళన చెందారని ఈటల చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదు, చట్టం నుంచి వారు తప్పించుకోలేరన్నారు. కేసీఆర్ కుటుంబపాలనకు అంతం పలికేది బీజేపీయేన న్నారు.
ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతు న్నానని, కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాద న్నారు. ఓరుగల్లు గడ్డమీద ముప్పై ఏళ్ల తర్వాత దేశ ప్రధానిగా మోదీ అడుగు పెట్టబోతున్నారని చెప్పా రు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి విజయరామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment