సినిమా రంగంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని అంటోంది నటి అమలాపాల్. ఆ మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ హడావుడి చేసిన ఈ సంచలన నటి స్పీడ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. ఈ మధ్య ఎవరో ఏదో అన్నాడంటూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగి వార్తల్లోకెక్కే ప్రయత్నం చేసినా అది అప్పుడే సద్దుమణిగిపోయింది. ఇకపోతే ఈ అమ్మడికిప్పుడు సినిమాలు కూడా తగ్గాయి. అరవిందస్వామితో రొమాన్స్ చేసిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం అమలాపాల్‌కు నిరాశ కలిగించిందనే చెప్పాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రక్షకన్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది.
మలయాళంలో ఒక చిత్రంలో నటిస్తోంది. దీంతో అవకాశాల వేటలో పడ్డ అమలాపాల్ అందుకు గ్లామర్‌ను నమ్ముకుంటోంది. అవును సెక్సీ ఫొటోలను ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్రీ ప్రచారం పొందాలనుకుంటోంది. ఆ మధ్య పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఖరీదైన కారును కొనుగోలు చేసి కేరళ రాష్ట్ర రవాణా శాఖ ఆదాయానికి గండి కొట్టి కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా సినిమారంగంలో జరిగే సంఘటనలపై తనదైన బాణీలో స్పందిస్తూ వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య సంఘటనపై అమలాపాల్ స్పందిస్తూ, కుటుంబ సెంటిమెంట్‌తో కొందరు హీరోయిన్లు నటనకు దూరం అవుతుండడం, ప్రాణాలను తీసుకోవడం వంటి అగత్యాలకు పాల్పడుతున్నారని అంది. మరో విషయం ఏమిటంటే బలహీనమైన వారికి సినిమా సెట్ అవదు అని అంది. ఈ రంగంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చునని అంది. మనోధైర్యం కలిగిన వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని పేర్కొంది. సినిమా రంగమే కాదు ఏ రంగంలోని మహిళలకైనా ఇది వర్తిస్తుంది అని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ మహిళలు చాలా సవాళ్లనే ఎదుర్కొనాల్సి ఉంటుంది అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment