Aravinda Swami
-
బాలపిట్టలూ బయటికెగరండి
Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది. చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు. -
తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!
తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్ సినిమా
కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సింగపూర్ సెలూన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి- ఆర్జే బాలాజీ జోడీగా నటించారు. సత్యరాజ్, లాల్ కీలక పాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తమిళ్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదల అయింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్ రావడంతో మొదట తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ హాఠాత్తుగా తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చేసింది. త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. సింగపూర్ సెలూన్ సినిమాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పాటు అరవింద్ స్వామి,జీవా అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలనే డ్రీమ్స్ ఉన్న యువకుడి పాత్రలో ఆర్జే బాలాజీ కనిపిస్తే.. ఇంజినీరింగ్ చదివిన అతడు ఎందుకు సెలూన్ వృత్తిని కొనసాగిస్తాడు..? పేద కుటుంబానికి చెందిన అతన్ని గొప్పింటి వర్గానికి చెందిన అమ్మాయి (మీనాక్షి చౌదరి) ఎలా ప్రేమలో పడింది..? ఈ క్రమంలో హీరోకు ఎదురయ్యే కష్టాలు, ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలతో డైరెక్టర్ గోకుల్ మెప్పించాడని చెప్పవచ్చు. -
ఆశలన్ని ఆ చిత్రంపైనే..!
ఇటీవల నటి రెజీనా జోరు తగ్గిందనే చెప్పాలి. ఇటు కోలీవుడ్‌లోనూ, అటు టాలీవుడ్‌లోనూ కథానాయకిగా మంచి పేరు ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా తమిళంలో నటిస్తున్న ‘కళ్లపార్ట్’ చిత్రం మీద చాలా ఆశ పెట్టుకుంది రెజీనా. ఈ చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తోంది రెజీనా. మూవింగ్ ఫ్రేమ్స్ పతాకంపై ఎస్.పార్తీ,ఎస్.శీనా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథనం, దర్శకత్వ బాధ్యతలను పీ.రాజపాండి నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ‘ఎన్నమో నడక్కుదు’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రెజీనా డ్యాన్స టీచర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెజీనా. ఇకపోతే బాలీవుడ్లో అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ప్రియాంక ఆత్మహత్యపై స్పందించిన సంచలన నటి
సినిమా రంగంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చునని అంటోంది నటి అమలాపాల్. ఆ మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ హడావుడి చేసిన ఈ సంచలన నటి స్పీడ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. ఈ మధ్య ఎవరో ఏదో అన్నాడంటూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగి వార్తల్లోకెక్కే ప్రయత్నం చేసినా అది అప్పుడే సద్దుమణిగిపోయింది. ఇకపోతే ఈ అమ్మడికిప్పుడు సినిమాలు కూడా తగ్గాయి. అరవిందస్వామితో రొమాన్స్ చేసిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం అమలాపాల్‌కు నిరాశ కలిగించిందనే చెప్పాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రక్షకన్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. మలయాళంలో ఒక చిత్రంలో నటిస్తోంది. దీంతో అవకాశాల వేటలో పడ్డ అమలాపాల్ అందుకు గ్లామర్‌ను నమ్ముకుంటోంది. అవును సెక్సీ ఫొటోలను ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్రీ ప్రచారం పొందాలనుకుంటోంది. ఆ మధ్య పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఖరీదైన కారును కొనుగోలు చేసి కేరళ రాష్ట్ర రవాణా శాఖ ఆదాయానికి గండి కొట్టి కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా సినిమారంగంలో జరిగే సంఘటనలపై తనదైన బాణీలో స్పందిస్తూ వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య సంఘటనపై అమలాపాల్ స్పందిస్తూ, కుటుంబ సెంటిమెంట్‌తో కొందరు హీరోయిన్లు నటనకు దూరం అవుతుండడం, ప్రాణాలను తీసుకోవడం వంటి అగత్యాలకు పాల్పడుతున్నారని అంది. మరో విషయం ఏమిటంటే బలహీనమైన వారికి సినిమా సెట్ అవదు అని అంది. ఈ రంగంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చునని అంది. మనోధైర్యం కలిగిన వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని పేర్కొంది. సినిమా రంగమే కాదు ఏ రంగంలోని మహిళలకైనా ఇది వర్తిస్తుంది అని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ మహిళలు చాలా సవాళ్లనే ఎదుర్కొనాల్సి ఉంటుంది అని అమలాపాల్ చెప్పుకొచ్చింది. -
నవాబ్... ప్యాకప్
లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ సినిమాకు సెర్బియాలో ప్యాకప్ చెప్పారు దర్శకుడు మణిరత్నం. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ‘నవాబ్’గా రిలీజ్ చేయనున్నారు. సెర్బియా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. శింబు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటానికి సెర్బియా వెళ్లింది చిత్రబృందం. శింబు పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో సినిమా మొత్తం పూర్తయింది. దాంతో ప్యాకప్ చెప్పారు మణిరత్నం. ఈ సినిమాలో అరవింద స్వామి, శింబు, విజయ్‌సేతుపతి అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ అవనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్. -
వినోదభరితంగా బోగన్
బోగన్ చిత్రంలో జయంరవిని విభిన్న పోలీస్‌గా చూస్తారంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. రోమియోజూలియట్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం బోగన్. దేవి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది.జయంరవికి జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రంలో అరవిందస్వామి మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీటీవీ.గణేశ్, నరేన్, అశ్విన్, నాగేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోగన్ చిత్ర షూటింగ్ శనివారంతో పూర్తి అయిందని తెలిపారు. ఇందులో జయంరవి కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ నటిస్తున్నారన్నారు. నటుడు అరవిందస్వామి పాత్ర కూడా అలాంటిదేనని చెప్పారు. అది ఏమిటీ? ఎలా అన్నదే బోగన్ చిత్ర కథ అని పేర్కొన్నారు. ఇది పోలీస్ కథా చిత్రం అయినా వేరే లెవల్ ఉంటుందన్నారు.అయితే పోలీస్ శాఖకు గౌరవాన్ని ఆపాదించే చిత్రంగా ఉంటుందని చెప్పారు. వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా బోగన్ ఉంటుదని తెలిపారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, దాన్ని 23 గంటల్లోనే 10 లక్షలకు పైగా అభిమానులు చూశారని చెప్పారు. ఇది చిత్ర అంచనాలను మరింత పెంచిందని దర్శకుడు లక్ష్మణన్ అన్నారు.