వినోదభరితంగా బోగన్ | Bogan trailer released recentely | Sakshi
Sakshi News home page

వినోదభరితంగా బోగన్

Published Tue, Nov 8 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

వినోదభరితంగా బోగన్

వినోదభరితంగా బోగన్

బోగన్ చిత్రంలో జయంరవిని విభిన్న పోలీస్‌గా చూస్తారంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. రోమియోజూలియట్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం బోగన్. దేవి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది.జయంరవికి జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రంలో అరవిందస్వామి మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీటీవీ.గణేశ్, నరేన్, అశ్విన్, నాగేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోగన్ చిత్ర షూటింగ్ శనివారంతో పూర్తి అయిందని తెలిపారు. ఇందులో జయంరవి కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ నటిస్తున్నారన్నారు.

నటుడు అరవిందస్వామి పాత్ర కూడా అలాంటిదేనని చెప్పారు. అది ఏమిటీ? ఎలా అన్నదే బోగన్ చిత్ర కథ అని పేర్కొన్నారు. ఇది పోలీస్ కథా చిత్రం అయినా వేరే లెవల్ ఉంటుందన్నారు.అయితే పోలీస్ శాఖకు గౌరవాన్ని ఆపాదించే చిత్రంగా ఉంటుందని చెప్పారు. వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా బోగన్ ఉంటుదని తెలిపారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, దాన్ని 23 గంటల్లోనే 10 లక్షలకు పైగా అభిమానులు చూశారని చెప్పారు. ఇది చిత్ర అంచనాలను మరింత పెంచిందని దర్శకుడు లక్ష్మణన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement