Lakshmanan
-
కేంద్రంపై టీఆర్ఎస్ కుట్ర పన్నుతోంది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకం అర్హులైన రైతులకు కూడా వర్తించదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను రాష్ట్రంలో పక్కదారి పట్టిస్తోన్న ప్రయత్నాలను రాష్ట్ర బీజేపీ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తోం దన్నారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్ ఇక్కడి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తమ ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపించేం దుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటివరకూ ఈ పథకంపై విధివిధానాలను కేంద్రం రూపొందించనేలేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి అధికారులతో చర్చించారని తెలిపారు. అయితే ఈ పథకాన్ని తక్కువ చేసేలా కేంద్రం నిబంధనలను రూపొందిస్తుందన్నట్టు మీడియాలో కథనాలు రావడం ఆక్షేపణీయమన్నారు. 9న అసెంబ్లీ ఇన్చార్జీలు ఈ నెల 9న అసెంబ్లీ ఇన్‌ఛార్జీ్జలు, కన్వీనర్లతో (దాదాపు వెయ్యి మందితో) రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తున్నట్టు లక్ష్మణ్ వెల్లడించారు. జాతీయ పార్టీ ఇచ్చిన ఐదు కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక కమిటీ వేయమని అమిత్‌షా చెప్పారన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా అమిత్ షా మార్గదర్శనంలో అన్ని పార్టీల కన్నా ముందే సిద్ధమవుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. నిజామాబాద్ క్లస్టర్ మీటింగ్ కి అమిత్ షా పాల్గొంటారని, ఈ సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న, సన్నకారు రైతుకు హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.60లక్షకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం పట్ల బీజేపీ తెలంగాణ శాఖ హర్షం వ్యక్తం చేసింది. పార్టీ చేపట్టే కార్యక్రమాలు ►ఈ నెల 10న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఐటీ అధిపతులు, నిపుణులతో హోటల్ ట్రైడెంట్‌లో సమావేశమవుతారు. ►13న మహబూబ్‌నగర్‌లో జరిగే మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారు. ►14న కరీంనగర్లో జరిగే భారత్ కీ మాన్ కీ బాత్ మోదీకీ సాత్ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొంటారు. ► మేరా పరివార్ భాజపా పరివార్ పేరుతో ఈ నెల 12 నుంచి మార్చి 2 వరకు బూత్ స్థాయి లో 25 పార్టీ కార్యకర్తల ఇళ్లపై భాజపా జెండా ఎగురవేత. ►కమలజ్యోతి కార్యక్రమంలో లబ్ధి పొందిన 1.66 వేల మంది ఇళ్లలో జ్యోతి ప్రజ్వలన. ► మార్చి 2న మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ విజయ్ సంకల్ప పేరుతో 119 అసెంబ్లీ నియోజకవర్గల్లో బైకు ర్యాలీలు. -
స్వర్ణాలు నెగ్గిన చిత్ర, లక్ష్మణన్
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): తమ పతకాల వేటను కొనసాగిస్తూ భారత అథ్లెట్స్ ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో మంగళవారం రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్... మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాలను సొంతం చేసుకోగా... బెల్ట్ రెజ్లింగ్‌లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మణన్ 8 నిమిషాల 2.30 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. చిత్ర 4 నిమిషాల 27.77 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. బెల్ట్ రెజ్లింగ్ 70 కేజీల విభాగం సెమీఫైనల్లో అనామిరదోవ్ (తుర్క్మెనిస్తాన్) చేతిలో ధర్మేందర్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 60 మీటర్ల ఫైనల్ రేసులో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 7.44 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. ఇప్పటివరకు భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. -
వినోదభరితంగా బోగన్
బోగన్ చిత్రంలో జయంరవిని విభిన్న పోలీస్‌గా చూస్తారంటున్నారు దర్శకుడు లక్ష్మణన్. రోమియోజూలియట్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం బోగన్. దేవి వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది.జయంరవికి జంటగా హన్సిక నటిస్తున్న ఈ చిత్రంలో అరవిందస్వామి మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీటీవీ.గణేశ్, నరేన్, అశ్విన్, నాగేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోగన్ చిత్ర షూటింగ్ శనివారంతో పూర్తి అయిందని తెలిపారు. ఇందులో జయంరవి కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ నటిస్తున్నారన్నారు. నటుడు అరవిందస్వామి పాత్ర కూడా అలాంటిదేనని చెప్పారు. అది ఏమిటీ? ఎలా అన్నదే బోగన్ చిత్ర కథ అని పేర్కొన్నారు. ఇది పోలీస్ కథా చిత్రం అయినా వేరే లెవల్ ఉంటుందన్నారు.అయితే పోలీస్ శాఖకు గౌరవాన్ని ఆపాదించే చిత్రంగా ఉంటుందని చెప్పారు. వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా బోగన్ ఉంటుదని తెలిపారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, దాన్ని 23 గంటల్లోనే 10 లక్షలకు పైగా అభిమానులు చూశారని చెప్పారు. ఇది చిత్ర అంచనాలను మరింత పెంచిందని దర్శకుడు లక్ష్మణన్ అన్నారు. -
చాంప్స్ లక్ష్మణన్, ప్రీజా శ్రీధరన్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ హాఫ్ మారథాన్ లో భారత పురుషుల విభాగం నుంచి లక్ష్మణన్... మహిళల విభాగం నుంచి లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ప్రీజా శ్రీధరన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన ఈ రన్లో ప్రీజా గంటా 20 నిమిషాల 04 సెకన్లలో గమ్యానికి చేరుకుంది. కవితా రౌత్ (1గం:20ని.06 సెకన్లు), లలితా బబ్బర్ (1గం:20ని.09 సెకన్లు) వరుసగా రెండు, మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు తలా రూ.2.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. భారత పురుషుల విభాగంలో జి.లక్ష్మణన్ 1గం:04ని:44 సెకన్ల టైమింగ్‌తో ప్రథమ స్థానంలో వచ్చాడు. అలాగే ఎలైట్ పురుషుల విభాగంలో ఇథియోపియాకు చెందిన అట్సెడు సెగే టైటిల్ సాధించాడు. 59.12 నిమిషాల రికార్డ్ టైమింగ్‌తో తను తొలిస్థానంలో నిలిచాడు. జెఫ్రీ కిప్సాంగ్ (కెన్యా, 59.30), విల్సన్ కిప్రాప్ (కెన్యా, 59.49) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల నుంచి ఫ్లోరెన్స్ కిప్లాగత్ (కెన్యా, 1:08:00) విజేతగా నిలువగా కెన్యాకే చెందిన గ్లాడిస్ చెరొనో (1:08:03), లూసీ కబు (1:08:00) రెండు, మూడో స్థానంలో నిలిచారు. పురుషుల, మహిళల విజేతలకు రూ.15 లక్షల 50 వేలు అందించారు. మొత్తం 31 వేల మందికి పైగా పాల్గొన్న ఈ హాఫ్ మారథాన్ ప్రైజ్‌మనీ 2 లక్షల 10 వేల (కోటీ 30 లక్షలు) డాలర్లు. ఎప్పట్లాగే ఈ రేసులో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో అనిల్ అంబానీ, చంద్రశేఖరన్ (టీసీఎస్ సీఈవో అండ్ ఎండీ), నటుడు రాహుల్ బోస్ ఉన్నారు.