చాంప్స్ లక్ష్మణన్, ప్రీజా శ్రీధరన్ | Champions Lakshmanan, prija Sridharan organization | Sakshi
Sakshi News home page

చాంప్స్ లక్ష్మణన్, ప్రీజా శ్రీధరన్

Published Mon, Dec 16 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

చాంప్స్ లక్ష్మణన్, ప్రీజా శ్రీధరన్

చాంప్స్ లక్ష్మణన్, ప్రీజా శ్రీధరన్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ హాఫ్ మారథాన్ లో భారత పురుషుల విభాగం నుంచి లక్ష్మణన్... మహిళల విభాగం నుంచి లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ప్రీజా శ్రీధరన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన ఈ రన్‌లో ప్రీజా గంటా 20 నిమిషాల 04 సెకన్లలో గమ్యానికి చేరుకుంది. కవితా రౌత్ (1గం:20ని.06 సెకన్లు), లలితా బబ్బర్ (1గం:20ని.09 సెకన్లు) వరుసగా రెండు, మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు తలా రూ.2.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. భారత పురుషుల విభాగంలో జి.లక్ష్మణన్ 1గం:04ని:44 సెకన్ల టైమింగ్‌తో ప్రథమ స్థానంలో వచ్చాడు. అలాగే ఎలైట్ పురుషుల విభాగంలో ఇథియోపియాకు చెందిన అట్సెడు సెగే టైటిల్ సాధించాడు. 59.12 నిమిషాల రికార్డ్ టైమింగ్‌తో తను తొలిస్థానంలో నిలిచాడు. జెఫ్రీ కిప్సాంగ్ (కెన్యా, 59.30), విల్సన్ కిప్‌రాప్ (కెన్యా, 59.49) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
 
 మహిళల నుంచి ఫ్లోరెన్స్ కిప్లాగత్ (కెన్యా, 1:08:00) విజేతగా నిలువగా కెన్యాకే చెందిన గ్లాడిస్ చెరొనో (1:08:03), లూసీ కబు (1:08:00) రెండు, మూడో స్థానంలో నిలిచారు. పురుషుల, మహిళల విజేతలకు రూ.15 లక్షల 50 వేలు అందించారు. మొత్తం 31 వేల మందికి పైగా పాల్గొన్న ఈ హాఫ్ మారథాన్ ప్రైజ్‌మనీ 2 లక్షల 10 వేల (కోటీ 30 లక్షలు) డాలర్లు. ఎప్పట్లాగే ఈ రేసులో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో అనిల్ అంబానీ, చంద్రశేఖరన్ (టీసీఎస్ సీఈవో అండ్ ఎండీ), నటుడు రాహుల్ బోస్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement