![Divya Agarwal Trolled For Posting Glamorous photo after father death - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/5/div-ag.jpg.webp?itok=62b8yR6_)
ముంబై : తండ్రి మరణించిన వారం రోజుల్లోనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టీవీ నటి దివ్య అగర్వాల్ ట్రోల్స్‌కు గురయ్యారు. ఇటీవల దివ్య తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే నటి దివ్య ఓ మ్యాగజైన్ కవర్‌ఫోటో షూట్ చేసింది. హాట్ హాట్ అందాలతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక అప్పటినుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో మూవ్ ఆన్ అయ్యి మళ్లీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారమో అంటూ ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చింది. (డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా: లాయర్ )
Comments
Please login to add a commentAdd a comment