1/21
ఖాకీ దుస్తుల్లో కరుకుదనమే కాదు.. కనికరం కూడా ఉంటుంది. సీఎంను కలిసేందుకు సచివాలయానికి వచ్చిన అంధులకు దారి చూపిస్తున్న పోలీసు ఫొటో: వెంకట్ ప్రత్తిపాటి
2/21
చలి.. పులి జాన్తా నై.. ఆట పాటలతో సై. తిరుమలలో చలిని లెక్కచేయకుండా ఆడుకుంటున్న చిన్నారులు ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
3/21
ఒక చెయ్యి లేకున్నా.. వయసు మీద పడుతున్నా.. కొండంత భారాన్ని లాగుతున్న బషీర్.. సొంత రిక్షా కావాలని వేడుకుంటున్నాడు. ఫొటో: వీరేష్, అనంతపురం
4/21
నిప్పుకి చెదపడుతుందా? సూర్యుడికి చుట్టూ సాలెగూడు అల్లుకోవడం సాధ్యమేనా? ఈ ఫొటో చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది కదూ..ఫొటో: జిలానీ బాషా, ఆదిలాబాద్
5/21
బిగించిన ఆ పిడికిళ్ల వెనుక కట్టలు తెంచుకున్న ఆవేశం ఉంది. సమస్యను రిష్కరించుకోవాలన్న ఆవేదన ఉంది. సాధించగలమన్న నమ్మకం ఉంది.ఫొటో- జి.స్వామి, కరీంనగర్
6/21
కష్టపడి సంపాదించిన సొమ్ముకు విలువ ఎక్కువ. అందుకే.. వ్యాపారంలో తాను సంపాదించిన డబ్బును అంత జాగ్రత్తగా లెక్కిస్తున్నాడీ కుర్రవాడు. ఫొటో: భజరంగప్రసాద్, నల్లగొండ
7/21
మంచుదుప్పటి కమ్ముకున్న వేళ.. పది అడుగుల ముందు ఏముందో కూడా కానరాని పరిస్థితి. మంచుకురిసే వేళలో ఇది అందరికీ అనుభవమే ఫొటో: భజరంగప్రసాద్, నల్లగొండ
8/21
నీళ్లు చూస్తే చాలు.. రెక్కల్లో ఎక్కడలేని బలం వచ్చేస్తుంది.. కంటిచూపు చురుగ్గా కదులుతుంది.. వేట ఎక్కడుందోనని కడెం ప్రాజెక్టు వద్ద వెతుకుతున్న పక్షి ఇది ఫొటో: జిలానీ బాషా, ఆదిలాబాద్
9/21
ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కపెట్టగలరా.. పోనీ నీళ్లలో ఈదుకుంటూ వెళ్తున్న ఈ బాతులు ఎన్ని ఉన్నాయో చెప్పగలరా.. ఈ దృశ్యం భలే ఉంది కదూ ఫొటో: ఆర్.రాజు, ఖమ్మం
10/21
ఇసకేస్తే రాలనంత జనం అంటారు.. ఎప్పుడైనా విన్నారా? తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తకోటి ఇది ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
11/21
మేమిద్దరం.. మాకొక్కరు.. మాది గమ్యం తెలిసిన పయనం అన్నట్లు ముచ్చటగా ఉందీ కుటుంబం.ఫొటో: పి.ఎన్. మూర్తి, విశాఖపట్నం
12/21
పనే ప్రత్యక్ష దైవం అంటారు.. దానిపట్ల నిబద్ధత ఎంత ఉంటే.. ఆ పని అంత అద్భుతమైన ఫలితాలిస్తుంది. బిద్రీ పని చేస్తున్న ఈ పెద్దాయన కళ్లు ఆ నిబద్ధతనే గుర్తుచేస్తున్నాయిఫొటో: ఆర్.రాజు, ఖమ్మం
13/21
చెట్టుకు కాయ భారమా.. తల్లికి పిల్ల భారమా అంటారు కదూ.. అందుకే, పిల్లలను బండిమీద పెట్టుకుని ఇలా లాక్కెళ్తోందీ తల్లి ఫొటో: హుస్సేన్, కర్నూలు
14/21
ఏకాగ్రత ఉంటే చాలు.. పతకాలు అవే వచ్చి పడతాయి. జిమ్నాస్టిక్స్లో ఈ ఏకాగ్రతకే పాయింట్లు పడతాయి. ఫొటో: జి.స్వామి, కరీంనగర్
15/21
అమ్మా చూడు.. అదెంత బాగుందో అని తల్లికి ఆసక్తి చూపిస్తున్నాడీ బుడతడు. అంత ఆసక్తి కలిగించే విషయమేంటో మరి! ఫొటో: పి.ఎన్.మూర్తి, విశాఖపట్నం
16/21
ఆకాశంలో ఒక్కడే చంద్రుడు. కానీ నీళ్లమీద విహరిస్తున్న ఈ నౌకకు చుట్టూ లెక్కలేనన్ని చుక్కలు. విశాఖలో నౌకాదళ విన్యాసాల్లో ఇదో చక్కటి దృశ్యం ఫొటో: పి.ఎన్. మూర్తి, విశాఖపట్నం
17/21
మన నౌకాదళ పటిమ అనితర సాధ్యం. మన బలం ఎంతుందో చెప్పడానికి ఇలాంటి విన్యాసాలు లెక్కలేనన్ని. చూసేందుకు బాగుంది కదూ ఫొటో: పి.ఎన్. మూర్తి, విశాఖపట్నం
18/21
ప్రేమ పావురాలు.. ఈ పేరు వినగానే అలనాటి సినిమా గుర్తుకొచ్చిందా.. పురివిప్పిన నెమళ్లలా కనిపిస్తున్న ఈ ప్రేమపక్షులు భలే ముద్దొస్తున్నాయి కదూ ఫొటో: జి.రాజేష్, హైదరాబాద్
19/21
రెండు చేతుల్లేవు.. రెండు కాళ్లు లేవు.. కానీ గుండెల నిండా కావల్సినంత ఆత్మవిశ్వాసం ఉంది. అది ఈ చిన్నారి చిరునవ్వులో ప్రతిబింబిస్తోంది. వికలాంగుల క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న బాలికలు ఫొటో: రూబెన్ బెసాలియాల్, గుంటూరు
20/21
లోపల సూదిమందు వేయాల్సిన డాక్టర్లు ఇక్కడ ఉన్నారేంటి నానమ్మా? అంటూ గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న వైద్యులను ఆశ్చర్యంగా చూస్తున్న చిన్నారి. ఫోటోలు: వి.రూబెన్ బెసాలియల్, సాక్షి, గుంటూరు
21/21
గజగజలాడే చలిలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట డివైడర్ నిద్రిస్తున్న అభాగ్యులు. ఫోటో: వి.రూబెన్ బెసాలియల్, సాక్షి గుంటూరు.