అమ్మారుుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ‘వారుుస్ 4 గర్ల్స్’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ద్వారా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు విద్యార్థినులకు వరంగా మారాయి.
పట్టుదల..ఆత్మవిశ్వాసం..స్నేహభావం..ఇంగ్లీష్ మాట్లాడటం,తదితర విషయూలపై బాలికల్లో భరోసా కల్పించేందుకు ‘వారుుస్ 4 గర్ల్స్’అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ వేసవి శిబిరం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల నుంచి ఎంపిక చేసిన అమ్మారుులు పలు విషయూలపై అవగాహన పొందుతున్నారు. ప్రధానంగా సోషల్ అవేర్‌నెస్ పొంది జీవితంలో ఎలా మెలగాలి అనే అంశాలను కౌన్సెలర్లు పాఠాలుగా బోధిస్తున్నారు.
జడ్చర్లటౌన్, న్యూస్‌లైన్ : అమ్మారుుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ‘వారుుస్ 4 గర్ల్స్’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ద్వారా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు విద్యార్థినులకు వరంగా మారాయి. ఈనెల 19న జడ్చర్ల మండలం చిట్టెబోయినిపల్లి రెసిడెని ్షయల్ స్కూల్‌లో ప్రారంభమైన ఈ శిబిరంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలకు చెందిన 73 కస్తూర్బా పాఠశాలల నుంచి 7, 8, 9 తరగతులకు చెందిన 457మంది విద్యార్థినులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
శిబిరంలో ఆరోగ్యం, రక్షణ, సెల్ఫ్ అవేర్‌నెస్, హక్కులు, భవిష్యత్ ప్రణాళికలు అనే 5 అంశాలపై 17 సూచికల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 16మంది కౌన్సిలర్లు (వీరంతా సామాజిక సేవాథృ క్పథం కలిగిన పీజీ విద్యార్థినులు) 16మంది కో కౌన్సిలర్లు (ఏపీ రెసిడెన్షి యల్ స్కూల్‌లకు చెందిన విద్యార్థినులు గత శిబిరంలో శిక్షణ పొందినవారు) విద్యార్థినులకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు శిక్షణ ఇస్తున్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు,సమానత్వం, తోటి ఆడపిల్లకు కష్టం వస్తే ఎలా స్పందించాలి, తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించి శిక్షణ ఇస్తున్నారు.