ఎస్‌యూవీ, లగ్జరీ కార్లపై సెస్ బాదుడు
ఎస్‌యూవీ, లగ్జరీ కార్లపై సెస్ బాదుడు
Published Mon, Aug 7 2017 9:28 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM
న్యూఢిల్లీ : స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు(ఎస్‌యూవీలు), టాప్-ఎండ్ లగ్జరీ కార్లను కొనుక్కోవాలని యోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి. మరికొంతకాలం ఆగితే ఈ కార్లపై సెస్ మోతెక్కనుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ వాహనాలపై సెస్‌ను మరింత పెంచాలని నిర్ణయిస్తోంది. ప్రస్తుతమున్న 15 శాతం సెస్‌ను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఎస్‌యూవీలు, హై-ఎండ్ కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. అన్ని సెస్‌లను కలుపుకుని మొత్తంగా 43 శాతం పన్నులను కార్ల తయారీసంస్థలు భరిస్తున్నాయి. కానీ చట్టాని సవరణ చేసి దీన్ని 53 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కస్టర్డ్ ఫౌడర్ , ఇడ్లి, దోష నుంచి విగ్రహాలు, ప్రార్థన పూసల వరకు స్థానికుడు ఎక్కువగా వాడే ఉత్పత్తుల రేట్లను తగ్గించడానికి, ఎస్‌యూవీ, లగ్జరీ కార్లపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చాలా ఉత్పత్తులకు తక్కువ లెవీలను విధిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ముందజలో ఉంది.
వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ హైదరాబాద్‌లో సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో వీటిపై నిర్ణయాలు తీసుకోనుంది. సిగరెట్ల మాదిరిగానే హై-ఎండ్ కార్లపైనా కూడా సెస్‌ను పెంచాలని ప్రభుత్వం చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ మార్పులు వెంటనే చోటుచేసుకోవని, సెస్‌ను పెంచాలంటే శాసన సవరణలు అవసరం పడతాయని పేర్కొంటున్నాయి. కార్లపై విధించే ఎక్కువ లెవీతో, జీఎస్టీ అమలుతో భారీగా రెవెన్యూలు కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారాల ఫండ్ చెల్లించడానికి ఉపయోగించాలని ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయి. ప్రస్తుతం చిన్న కార్లపై 28 శాతం పన్ను, 1 శాతం సెస్ ఉంది. వాటిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవు. 350-500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న బైకులపై 3 శాతం సెస్‌ను విధిస్తున్నారు. కాగ, తదుపరి రివ్యూ మీటింగ్‌లో లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది.
Advertisement
Advertisement