సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
ఇస్లామాబాద్: సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్.. తనకు, శశి థరూర్ దంపతుల మధ్య విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లు ఏప్రిల్ నుంచే పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ కుట్రలో తనను పావును చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఓ టీవీ విలేకరితో ఆమె మాట్లాడుతూ.. ‘నేను థరూర్‌ను కలిసింది రెండేసార్లు.. ఒకటి ఏప్రిల్ నెలలో భారత్‌లో, మరోసారి గతేడాది జూన్‌లో దుబాయ్‌లో ఉండగా. ఆ సమయంలో అక్కడ ఈయనే కాదు చాలా మంది ఉన్నారు. అయితే తర్వాత థరూర్ గురించి నేను ఓ ఆర్టికల్ రాశాను.
ఇందులో ఆయన్ను ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చలేదనుకుంటా. దీంతో నాతో మాట్లాడొద్దని సునం ద.. శశిని హెచ్చరించారు. ఆయనతో నా సంభాషణ కూడా సాధారణ అంశాలపైనే సాగేది.. అవి నేను అందరితో మాట్లాడేవే’’ అని తెలిపారు.