Mehr Tarar
-
కంగనా ట్వీట్: పాక్ జర్నలిస్టుపై నెటిజన్ల ఫైర్
ముంబై: బాద్రాలోని తన ఖరీదైన పాలి హిల్ కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీ చర్యను పాకిస్తాన్‌తో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తారార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మెహర్‌ను భారత నెటిజన్లు విపరీతం ట్రోల్ చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. అయితే బీఎంసీ తన కార్యాలాయాన్ని కూల్చివేయడంతో కంగనా పాకిస్తాన్ మాదిరిగా ముంబైలో కూడా ప్రజాస్వామ్యం కరువైందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైని పాకిస్తాన్‌తో పోలుస్తూ విమర్శించడంతో మెహర్ తారార్ కంగనాపై మండిపడుతూ... ‘డియర్ కంగనా, దయ చేసి మా దేశం పేరును వాడకుండా మీ రాజకీయ, ఇతర యుద్ధాలతో పోరాడండి. పాకిస్తాన్లో జాతీయ పౌరుల ఇళ్లు, కార్యాలయాలు ఎప్పుడు కూల్చివేసిన దాఖలు లేవు’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్) దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ గురించిన ప్రశ్నలు వేయడమే కాకుండా మెహర్ తారుర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘అవును.. పాకిస్తాన్లో ఇళ్లు, కార్యాలయాలు కూల్చివేయరు, కానీ ఇతర మతాలకు సంబంధించిన స్థలాలను, భవనాలను, ఆస్తులను కూల్చడానికి మాత్రం పాకిస్తాన్ ప్రజలు గుమికుడుతారు’, ‘నేషనల్ హీరోస్: దావుద్, హఫీజ్, సల్లవుద్దీన్, ఓసామా, ఇమ్రాన్ ఖాన్’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరో ట్విటర్ యూజర్ ‘పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు.. వారు చంపబడం లేదా అదృశ్యమవ్వడం’ అంటూ తారాపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా శివసేనకు, కంగనా మధ్య మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా కార్యాలయాన్ని నిన్న(బుధవారం) కూల్చివేసిన బీఎంసీ.. ఇది అనధికారిక నిర్మాణంగా పేర్కొంది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) Dear Kangana, please fight your political/other battles without involving our country's name. In Pakistan, houses or offices of national heroes are not demolished. https://t.co/LmsmE8hymE — Mehr Tarar (@MehrTarar) September 9, 2020 -
'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సునందా పుష్కర్ మృతి కేసులో పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ ను ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఆమెను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రశ్నించినట్టు తెలిపాయి. సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై మెహర్ ను అధికారులు అడిగినట్టు సమాచారం. శశి థరూర్‌తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్టు తెలిసింది. ఆయనతో తనకు సంబంధం ఉందన్న ఆరోణలను ఆమె తోసిపుచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద్ స్నేహితురాలు నళిని సింగ్ చేసిన ఆరోపణలను కూడా మెహర్ కొట్టిపారేశారు. ఫిబ్రవరిలోనే శశిథరూర్ ను ఐదుగంటల పాటు పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2014 జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ తానున్న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. -
దుబాయ్‌లో థరూర్, తరార్.. ఏమిటీ తకరార్?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని ప్రముఖ జర్నలిస్టు నళినీ సింగ్ చెప్పారు. సునంద మరణించేముందు... శశి థరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహ్ర్ తరార్‌ల మధ్య సంబంధాల గురించి ఆందోళన చెందారని నళిని తెలిపారు. 2013 జూన్‌లో థరూర్, తరార్ కలసి దుబాయ్‌లో మూడు రాత్రులు ఉన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సునంద చెప్పారని నళిని వెల్లడించారు. శశి థరూర్ విడాకులు ఇస్తారని సునంద భయపడ్డారని నళిని చెప్పారు. గతేడాది జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. సునంద స్నేహితురాలైన నళిని మూడు రోజుల తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. సునంద చనిపోవడానికి ముందు రోజు తనకు ఫోన్ చేసిందని.. థరూర్, తరార్ పరస్పరం రొమాంటిక్ మెసేజ్‌లు పెట్టడం సునంద గుర్తించారని నళిని చెప్పారు. ఐపీఎల్లో థరూర్ అక్రమాల గురించి కూడా సునంద తనకు చెప్పినట్టు తెలిపారు. సునంద బ్లాక్‌బెర్రి మొబైల్ ఫోన్ నుంచి బీబీఎం మెసేజ్‌లను థరూర్ తొలగించారని, వాటిని మళ్లీ పొందేందుకు సాయం చేయాల్సిందిగా తనను కోరిందని వెల్లడించారు. శశి థరూర్‌కు అంతకుముందు మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్టు సునంద తెలిపారని నళిని చెప్పారు. శశి థరూర్ వివాహేతర సంబంధాలు, ఐపీఎల్ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం.. ఈ నేపథ్యంలో సునంద హత్యకు గురికావడం అనేక సందేహాలకు తావిస్తోంది. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో వెల్లడికావాల్సివుంది. ఆదివారం శశి థరూర్ కేరళ నుంచి ఢిల్లీ వచ్చారు. సునంద హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను ఎప్పుడు విచారిస్తారన్న విషయం తెలియరాలేదు. కాగా నళిని ఆరోపణలను తరార్ ఖండించారు. సునంద హత్య కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. -
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
-
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
సునంద పుష్కర్ మరణం హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ ఆదేశించారు. అయితే విష పూరిత పదార్ధాలు తీసుకోవడమే ఆమె మరణానికి దారి తీసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సునంద మృతిపై ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని నివేదికలో శర్మ తెలిపారు. అతిగా డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె మరణం సంభవించిందని.. ఇలాంటి కేసులో విష ప్రయోగం జరిగిందని చెప్పవచ్చు అని ఎయిమ్స్ వైద్యులు శవపరీక్షలో అనంతరం వెల్లడించారు. అంతేకాకుండా సునంద చేతులపై డజన్ పైగా గాయాలు, బుగ్గపై ఓ గాయం కూడా ఉందని వైద్యులు నివేదికలో తెలిపారు. తన మరణానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, ఆమె కడుపులో ఎలాంటి ఆహార పదార్ధాల నమూనాలు లభించలేదని తెలిపారు. ఆమె మరణించిన హోటల్ గదిలో మానసిక రుగ్మత నుంచి ఉపశమనం పొంతే కొన్నిమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. కేంద్రమంత్రి శశి థరూర్ తో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో ట్విటర్ లో గొడవ పడిన మరుసటి రోజే ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. -
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
-
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
ఇస్లామాబాద్: సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్.. తనకు, శశి థరూర్ దంపతుల మధ్య విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లు ఏప్రిల్ నుంచే పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ కుట్రలో తనను పావును చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఓ టీవీ విలేకరితో ఆమె మాట్లాడుతూ.. ‘నేను థరూర్‌ను కలిసింది రెండేసార్లు.. ఒకటి ఏప్రిల్ నెలలో భారత్‌లో, మరోసారి గతేడాది జూన్‌లో దుబాయ్‌లో ఉండగా. ఆ సమయంలో అక్కడ ఈయనే కాదు చాలా మంది ఉన్నారు. అయితే తర్వాత థరూర్ గురించి నేను ఓ ఆర్టికల్ రాశాను. ఇందులో ఆయన్ను ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చలేదనుకుంటా. దీంతో నాతో మాట్లాడొద్దని సునం ద.. శశిని హెచ్చరించారు. ఆయనతో నా సంభాషణ కూడా సాధారణ అంశాలపైనే సాగేది.. అవి నేను అందరితో మాట్లాడేవే’’ అని తెలిపారు. -
తరార్‌తో సంబంధమేంటి?
పాక్ జర్నలిస్టు గురించి శశి థరూర్‌ను ప్రశ్నించిన మేజిస్ట్రేట్ భార్య మృతికి ముందు పరిస్థితులపై ఆరా దర్యాప్తును వేగవంతం చేయాలంటూ షిండేకు శశి లేఖ నన్ను కుట్రలో పావును చేశారు: తరార్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. మృతికి కారణాలు తెలుసుకునేందుకు ఒకవైపు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఢిల్లీలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదివారం 8 మందిని ప్రశ్నిం చారు. వీరిలో సునంద భర్త శశి థరూర్, సోదరుడు రాజేశ్, జర్నలిస్టు నళిని సింగ్ కూడా ఉన్నారు. మీ భార్య మృతికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చు? మరణానికి ముందు రోజుల్లో ఆమెకు, మీకు ఏమైనా గొడవలు జరిగాయా? లాంటి ప్రశ్నలతోపాటు.. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో మీకేంటి సంబంధం? అని మేజిస్ట్రేట్.. శశి థరూర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. థరూర్‌కు, మెహర్ తరార్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేసిన రెండు రోజుల తర్వాత సునంద మరణించిన సంగతి తెలిసిందే. మరణానికి ముందు కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ థరూర్ తన లిఖితపూర్వక వాంగ్మూలంలో మేజిస్ట్రేట్‌కు వివరించినట్లు తెలిసింది. వాంగ్మూలం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించారు. మరణానికి ముందు ఎవరితో మాట్లాడారు? సునంద మరణించిన హోటల్ గది వద్ద సీసీటీవీ వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందు థరూర్‌తో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడారు? ఎవరికి ఎస్ఎంఎస్లు పంపారు లాంటివి ఆరా తీస్తున్నారు. సునంద మృతదేహానికి శవపరీక్ష చేసిన వైద్యులు సోమవారం మేజిస్ట్రేట్‌కు నివేదికిచ్చే అవకాశముంది. దర్యాప్తును వేగవంతం చేయాలని షిండే లేఖ తన భార్య మరణంపై మీడియాలో వస్తున్న కథనాలపై శశిథరూర్.. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఆదివారం లేఖ రాశారు. ‘నా భార్య మరణించిన విషాదంలో నేనుంటే.. ఆ మరణంపై రకరకాల ఊహాగానాలతో మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరణానికి అసలు కారణమేంటో ముందు తెలియాలి. దీనిపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన లేఖలో కోరారు. ఔషధం.. అధికమొత్తంలో తీసుకున్నారా! అనుమానాస్పదంగా మరణించిన సునంద పుష్కర్ మృతదేహంలో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లూ లభించలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే మానసిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగపడే ఆల్ప్రాజోలం ఆనవాళ్లు లేకపోలేదని వివరించాయి. -
'సునంద పుష్కర్ కుట్రకు బలైంది'
కేంద్ర మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ కుట్రకు బలైంది అని పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ అన్నారు. శశి థరూర్, సునందల వివాహం వివాదస్పదంగా మారటానికి, తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె తెలిపారు. సునంద పుష్కర్ ఆత్మహత్య అనుమానస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సునందను భారత్ లో ఒకసారి, దుబాయ్ లో మరోసారి మాత్రమే కలుసుకున్నానని తరార్ వెల్లడించింది. మరో మహిళను తన ఎదుట శశి థరూర్ పొగడ్తలతో ముంచెత్తడం సునందకు ఇష్టం ఉండదని తెలిపింది. దాంతో తనను పొగడవద్దని శశికి సూచించానని తరార్ వెల్లడించారు. ట్విటర్ లో తనను శశి ఫాలోఅవుడం ప్రారంభించాకా.. సునంద తన అకౌంట్ ను ఫాలోఅవడం మానివేసిందని తరార్ అన్నారు. తనతో ఈ-మెయిల్ లో, ఫోన్ లో శశి మాట్లాడటం సునందకు అసలు ఇష్టం ఉండేది కాదన్నారు. తాను వాళ్లను కలువడానికి ముందే వారి మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని.. వారి జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సునంద, శశి విడిపోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపింది. ఆ వెలుగుతున్న కొవ్వొత్తుల ఫోటోను ప్రోఫైల్ గా మార్చి సునందకు తరార్ నివాళలర్పించారు. -
శశిథరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతికి సంబంధించి కేంద్రమంత్రి శశిథరూర్‌ను పోలీసులు విచారించనున్నారు. సునందా పుష్కర్ అంత్యక్రియల అనంతరం ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సునందా పుష్కర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా సునంద మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం లోథీ రోడ్డులోని శశిథరూర్ నివాసానికి మృతదేహాన్ని తరలించారు. మరోవైపు సునందకు ప్రాణాంతక వ్యాధి ఏమీలేదని ఆమెకు గతంలో చికిత్స చేసిన వైద్యుడు విజయ్ రాఘవన్ తెలిపారు. సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. -
సునంద మృతదేహానికి పోస్ట్‌మార్టం
న్యూఢిల్లీ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. పోస్ట్‌మార్టం నివేదిక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వెలువడనుంది. అయితే సునంద మృతిపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్ నివేదిక కీలకం కానుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు పోస్ట్‌మార్టమ్ నివేదికలో తెలియనుంది. కాగా ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి శశిథరూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు స్వల్పంగా గుండెనొప్పి రావటంతో గతరాత్రి ఆస్పత్రిలో చేరారు. -
గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన శశిథరూర్
న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి శశిథరూర్ కు స్వల్పంగా గుండెనొప్పి రావటంతో గతరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శశిథరూర్‌ను వైద్యులు ప్రత్యేక వార్డుకు మార్చారు. కాగా శశిథరూర్ భార్య సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఓ హోటల్గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చేంత వరకూ ఆమె మృతికి కారణాలనే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా పోలీసులు అరెస్టు చేస్తారనే అనుమానం రాగానే మన దేశంలో రాజకీయ నాయకులకు గుండెనొప్పి అప్పటికప్పుడే వచ్చేస్తుంటుంది. ఇప్పుడు శశి థరూర్ గారికి వచ్చింది కూడా అలాంటి గుండెనొప్పేనా.. లేక నిజంగానే మూడో భార్య మరణించినందుకు ఆవేదనతో ఆయనకు గుండెనొప్పి వచ్చిందా అన్న విషయాన్ని మాత్రం వైద్యులే తేల్చాల్సి ఉంది. -
తరార్‌వన్నీ అబద్ధాలు
* భారతీయులకిది తెలిస్తే తట్టుకోలేరు * ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది * ఆయనకోసం ఎవరొచ్చినా నేను అడ్డుపడను * చివరి గంటల్లో సునంద పుష్కర్ వరస ట్వీట్లు * తనకు మాటలు రావటం లేదన్న తరార్ న్యూఢిల్లీ: అదేం చిత్రమో! కేంద్ర మంత్రి శశిథరూర్‌కు సంబంధించి ట్విటర్లో మెసేజ్‌ల యుద్ధం చేసిన పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్, థరూర్ భార్య సునంద పుష్కర్... ఇద్దరూ కర్మ సిద్ధాంతాన్నే నమ్మారు. ‘‘కర్మ సిద్ధాంతంపై నాకు నమ్మకం ఉంది. ఏదైతే అది కానీండి’’అని మెహర్ తరార్ ట్వీట్ చేయగా... మరణించడానికి కొన్ని గంటల ముందు సునంద కూడా ఇదే చెప్పారు. ‘‘ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికేం తెలుసు మనం నవ్వుతూ వెళ్లిపోవడమే’’ అన్నారు. సునంద శుక్రవారం తెల్లవారు జామున 5.50 నుంచి 6 మధ్యలో పలు ట్వీట్లు చేశారు. గురువారం రాత్రి 12 సమయంలో ట్వీట్లు చేశాక... వాటిపై వ్యక్తమైన స్పందనలకు శుక్రవారం తెల్లవారుజామున చురుగ్గా జవాబులిచ్చారు. మెహర్వన్నీ అబద్ధాలు... భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 12 గంటల సమయంలో సునంద ఒక ట్వీట్ చేశారు. ఆజ్‌తక్ చానెల్ యాంకర్ రాహుల్ కన్వల్ను ఉద్దేశిస్తూ... ‘మీ షో చూశా. మీకొకటి చెప్పాలనుకున్నా. మెహర్ తరార్ అన్నీ అబద్ధాలు చెప్పింది. కావాలంటే ఆమె ఈమెయిల్స్, బ్లాక్‌బెర్రీ మెసేజ్‌లు నా దగ్గరున్నాయి. నేను అబద్ధం చెప్పను’’ అని దాన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దానికి సుధీర్ శివ్‌హరి అనే వ్యక్తి స్పందిస్తూ... ‘మేమ్! మీరూ, థరూర్ కలిసి తరార్‌తో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనండి. బాగుంటుంది’’ అన్నాడు. సునంద గట్టిగా నవ్వేస్తూ... ‘‘అదెన్నటికీ జరగదు’’ అన్నారు. ఇదే సునంద చివరి ట్వీట్. ఉదయం దాదాపు 6 గంటల సమయంలో ఈ మెసేజ్ ఇచ్చాక ఆమె ఫోన్ నుంచి ట్విటర్‌కు మరో మెసేజ్ రాలేదు. ఈ ట్వీట్కన్నా ముందు ఆమె మరిన్ని ట్వీట్లు చేశారు. మెహర్ తరార్ గురించి పలువురు వేసిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ‘గతంలో ఐపీఎల్ వివాదం. ఇపుడు తరార్ వివాదం. మీరు శశి థరూర్‌ను రాజకీయంగా దిగజారుస్తున్నారే? అయినా ఐఎస్ఐ ఏజెంట్... ఇతరత్రా పదాలు శశి డిక్షనరీలోనే లేవు. ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటున్నారుగా’’ అంటూ ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నలకు... అది శశినే అడగండి అని గట్టిగా నవ్వుతూ జవాబివ్వటం గమనార్హం. ఆసుపత్రిలో ఉన్నారా సునంద ఆసుపత్రిలో ఉన్నారని శశిథరూర్ చెప్పినట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఓ ఫాలోవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బెడ్ నుంచి ట్వీట్లు చేస్తున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో అభిమాని మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సునంద జవాబులిస్తూ... ‘‘కిమ్స్‌కు (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వెళ్లా. చాలా పరీక్షలు చేశారు. ఎవరికి తెలుసు? మనమైతే నవ్వుతూనే ఉండాలి’’ అని జవాబిచ్చారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని, శశితో కలిసి గురువారమే కేరళ నుంచి వచ్చానని మరో ట్వీట్లో వివరించారు. వారం కిందట మెహర్ తరార్ ఢిల్లీకి వచ్చిన సంగతి తనకు తెలుసునని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ‘‘ఏదో ఒకరోజు భారతీయులకు నిజం తెలుస్తుంది. వారు దాన్ని తట్టుకోలేరని నాకు తెలుసు... ఇన్షా అల్లా’’ అని సునంద చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. నేనే చివరి దాన్నవుతా ట్విటర్లో ఓ ఫాలోవర్ సునందకు సలహా ఇచ్చారు. ‘‘మేమ్! కొన్నాళ్లు ఈ ట్విటర్‌కు దూరంగా ఉండండి. మున్ముందు కూడా శశితో చాలా మంది మహిళలు ప్రేమలో పడతారు’’ అని పేర్కొన్నారు. దానికి సునంద బదులిస్తూ... ‘‘అలాంటివి నేను లెక్క చెయ్యను. నా భర్త కోసం వేరే మహిళ వచ్చి నిలదీసే పరిస్థితే వస్తే వాళ్లను ఆపటంలో నేను ఆఖర్న ఉంటా’’ అని స్పష్టంచేశారు. ఓ మైగాడ్...: తరార్ సునంద పుష్కర్ మరణ వార్త వెలువడ్డాక... శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ తన సెల్‌ఫోన్ నుంచి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ద హెల్! సునందా... ఓ మైగాడ్’’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేనిప్పుడే లేచా. సునంద విషయం చూశా. ఇది చెప్పలేనంత భయానకమైనది. ఏం చెప్పాలో తెలియటం లేదు. సునంద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా’’ అన్నారు. తరార్ ఈ ట్వీట్ చేసిన వెంటనే ఆమె ఫాలోవర్లు ‘‘మేమ్! కొన్నాళ్లు సోషల్ నెట్‌వర్కింగ్‌కు దూరంగా ఉండండి. ట్విటర్‌కు దూరంగా ఉండండి. మీరు ట్వీట్లు చేస్తూ ఉంటే పరిస్థితి ఘోరంగా తయారవుతుంది’’ అంటూ సలహాలివ్వటం గమనార్హం. -
నిన్న వివాదం.. నేడు విషాదం
* కేంద్రమంత్రి శశి థరూర్ భార్య ఢిల్లీ హోటల్ గదిలో అనుమానాస్పద మృతి * తన భర్త శశిథరూర్‌కు పాక్ జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన రెండు రోజులకే అనూహ్య మృతి * మరణానికి కారణం ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు.. ఆత్మహత్యగా అనుమానం న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన భర్త శశిథరూర్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహర్‌తరార్ అనే మహిళా జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందంటూ ఇటీవల సామాజిక వెబ్సైట్ ట్విటర్లో సునందపుష్కర్ ఆరోపణలు చేయటం.. దీనికి సదరు పాక్ జర్నలిస్టు ఘాటుగా సమాధానం ఇవ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో సునంద అకస్మాత్తుగా చనిపోయి కనిపించటం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. పాక్ జర్నలిస్టు విషయమై వివాదానికి సంబంధించి.. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని సునంద, శశిథరూర్‌లు గురువారం నాడు మీడియాకు ప్రకటన జారీచేశారు. కానీ శుక్రవారం రాత్రికి సునంద(52) విగతజీవిగా మారారు. తన భార్య మృతికి సంబంధించి కేంద్రమంత్రి శశిథరూర్ నుంచే పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే.. సునంద ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాము భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి రంజన్భగత్ వెల్లడించిన వివరాలివీ... * శశిథరూర్ వ్యక్తిగత కార్యదర్శి అభినవ్‌కుమార్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేశారు. ఆ వెంటనే సరోజినీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు సిబ్బంది హుటాహుటిన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారు. * కేంద్రమంత్రి శశిథరూర్, సునందపుష్కర్ల నివాసంలో పెయింటింగ్ పని జరుగుతున్నందున.. వారిద్దరూ గురువారం నుంచి హోటల్లోని ఒక సూట్లో బసచేశారు. * శశిథరూర్ శుక్రవారం రోజంతా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నందువల్ల.. హోటల్ సూట్లో లేరు. * ఆయన రాత్రి 8:30 గంటలకు హోటల్‌కు తిరిగి రాగా.. తాము బసచేసి ఉన్న సూట్లో సునంద గది లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గుర్తించారు. * సునంద మామూలుగా నిద్రపోతున్నట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు గుర్తించారు. * ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరిగిన ఆనవాళ్లు లేవు. కానీ.. ఇది సహజ మరణమా? కాదా? మరణానికి కారణమేమిటి? ఎప్పుడు చనిపోయారు? అనేది ఇప్పుడే చెప్పలేం. * హోటల్ సూట్ నంబర్ 345కు పోలీసులు వెళ్లి, స్వాధీనంలోకి తీసుకున్నపుడు కేంద్రమంత్రి శశిథరూర్ అక్కడే ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించటానికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. * సునంద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కి తరలించారు. * వివాహమైన ఏడేళ్లలోపు ఎలాంటి మరణం సంభవించినా చట్ట ప్రకారం ఆ ప్రాంత సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని.. ఆమేరకు దర్యాప్తు ప్రారంభమైంది. ప్రధాని సంతాపం శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ శశిథరూర్‌తో మాట్లాడి.. సునంద మృతిపట్ల తీవ్ర విచారం, ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఏమిటీ వివాదం..? శశిథరూర్ - సునందపుష్కర్ - మెహర్‌తరార్ - ఈ ముగ్గురి మధ్య అంతర్గతంగా నడుస్తున్న వివాదం బుధవారం ఒక్కసారిగా భగ్గుమంది. శశిథరూర్‌కు చెందిన ట్విటర్ ఖాతాలో.. మెహర్‌తరార్ పంపించినట్లు చెప్తున్న అసంబద్ధమైన వ్యక్తిగత సందేశాలు ప్రచురించటం మొదలవటంతో వివాదం రచ్చకెక్కింది. ఆ తర్వాత సునంద తన ట్విటర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన భర్త శశిథరూర్‌కు మెహర్‌తరార్ పంపిన ప్రయివేటు సందేశాలను తాను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నానని.. మెహర్ ఎలా తన భర్త వెంట పడుతోందీ తెలియజేయటానికే ఈ పని చేశానని పేర్కొన్నారు. సునంద ఆ తర్వాత ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ.. మెహర్‌తరార్ ఒక ఐఎస్ఐ ఏజెంట్ అని, ఆమె తన భర్త వెంటపడుతున్నారని ఆరోపించారు. తమ వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయటానికి మెహర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. థరూర్ మాత్రం తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ.. థరూర్ ట్విటర్ ఖాతాలో తానే ఆ వ్యాఖ్యలు పోస్ట్ చేశానని సునంద పేర్కొన్నారు. గురువారం నాడు.. శశిథరూర్, సునందలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ వ్యక్తిగత అంశాలకు వక్రభాష్యాలు చెప్పటం ద్వారా అనవసర వివాదాన్ని రేకెత్తిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని పేర్కొన్నారు. పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ మెహర్‌తరార్ ‘డైలీ టైమ్స్ ఆఫ్ పాకిస్థాన్’ పత్రికలో ప్రముఖ జర్నలిస్టు. ఆ పత్రికలో గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఆ పత్రికలో రాసే కాలమ్స్ ద్వారా ఆ పేరుగాంచారు. పాక్ వ్యాప్తంగా ఖ్యాతిగడించారు. అయితే ప్రపంచానికి ఆమె గురించి తెలీదు. శశిథరూర్ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. సునందపుష్కర్ ఆరోపించినట్లు శశిథరూర్‌కు, తనకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదంటూ మెహర్ తిరస్కరించారు. ఇదంతా సునంద కల్పనేనని కొట్టివేశారు. ఆమె గురువారం ఒక పత్రికకు ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో శశిథరూర్‌ను ఇంటర్వ్యూ చేయటం కోసం తొలిసారి కలిశాను. మొదట ఆయన ఆఫీసులో కలిశాం. ఆ తర్వాత ఒక కళా ప్రదర్శనకు ఆయన వెళుతుంటే.. ఆ ప్రదర్శనలో చాలా మంది పాకిస్థానీ కళాకారులు ఉన్నందున, నేను కూడా పాకిస్థానీ మహిళనే అయినందున ఆయనతో కలిసి వెళ్లాను. ఆ ప్రదర్శన అనంతరం మేం ఒక పబ్లిషర్ ఇంట్లో పార్టీకి వెళ్లాం. అక్కడ చాలా మందిని నేను కలిశాను. మళ్లీ జూన్‌లో దుబాయ్‌లో మరోసారి శశిథరూర్‌ను కలిశా. అది ఒక కార్యక్రమంలో. ఆ తర్వాత ఆయనను నేను కలవలేదు. భారతదేశంలో ఎన్నికల మీద నేను ఒక పుస్తకం రాయాలనుకున్నాను. నాకు తెలిసిన భారతీయ రాజకీయ నాయకుడు శశిథరూర్ ఒక్కరే. ఆయన కేరళకు చెందిన వారు కావటంతో కేరళ గురించి పుస్తకం రాద్దామని నేను అనుకున్నా. గత డిసెంబర్లో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసేందుకు మళ్లీ ఢిల్లీ వచ్చాను. అప్పుడు శశిథరూర్‌కు ఫోన్ చేస్తే ఆయన నగరంలో ఉండటం లేదని చెప్పారు. నేను ఢిల్లీ వచ్చినా ఆయనను కలవలేదు. ఈ సాక్ష్యం సరిపోదా?’’ అని చెప్పారు. తనను ఐఎస్ఐ ఏజెంట్‌గా ఆరోపించినందుకు సునందపై కేసు పెట్టగలనని వ్యాఖ్యానించారు. తాను లాహోర్‌లో నివసిస్తున్నందు వల్ల ఆ కేసు కొనసాగించటం సాధ్యం కాదు కాబట్టి ఆ పనిచేయటం లేదన్నారు. తన సోదరుడు దౌత్యవేత్త అని.. తనపై చేసిన విమర్శలు తన సోదరుడికి ఇబ్బందికర పరిస్థితిని తెస్తున్నాయని చెప్పారు. -
శశిథరూర్, సునందా పుష్కర్.. ఓ పాక్ జర్నలిస్టు
తరచు వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి శశిథరూర్, సునంద పుష్కర్ దంపతులు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్పై శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ చేసిన ట్వీట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. మెహర్‌ను....ఐఎస్ఐ తీవ్రవాదిగా ట్వీట్ చేసిన సునంద... తన భర్తను మెహర్ వేధిస్తోందని ఆరోపించారు. కాగా సునంద ట్వీట్స్‌పై మెహర్ తరార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సునంద వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఐఎస్ఐ ఏజెంట్ అవటం అంత ఈజీనా అని మెహర్ ప్రశ్నించారు. వేరే దేశంలో ఉన్న తనకు థరూర్ అకౌంట్‌ను హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అంతేకాకుండా థరూర్ సంబంధం ఉన్నట్లు.... సునంద పుష్కర్ చేస్తున్న ఆరోపణలను సైతం ఆమె ఖండించారు. పెళ్లై...పిల్లలు ఉన్న తనపై ఇటువంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదన్నారు. ఇవన్నీ పూర్తిగా అసత్యాలని మెహర్ తరార్ స్పష్టం చేశారు. ఓ ఆర్టికల్ కోసం తాను థరూర్‌ను ఇంటర్వ్యూ చేసినట్లు మెహర్ తరార్ తెలిపారు. ఆ సమయంలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినట్లు చెప్పారు. రాజకీయాల గురించి థరూర్ తన అభిప్రాయాలను తెలిపారని, ఇదే విషయాన్ని తాను ట్విట్టర్లో అనేకసార్లు తెలిపానన్నారు. కాగా శశిథరూర్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని బుధవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, సమస్య పరిష్కారం అయ్యేవరకూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే థరూర్ అకౌంట్ నుంచి పాకిస్తాన్ జర్నలిస్టుకు వెళ్లిన కొన్ని సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా లేట్ వయసులో ప్రేమించి పెళ్లాడిన శశి థరూర్, సునంద పుష్కర్ల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిన్న ఆమె మాట్లాడుతూ తాను థరూర్ నుంచి విడాకులు కోరునున్నట్లు తెలిపారు. థరూర్‌కి పాక్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు శశిథరూర్ చెప్పిన కొద్దిసేపట్లోనే సునంద తన భర్తకు పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని చెప్పడం విశేషం. ఇక ఈ ట్వీట్స్ యుద్ధం చివరికి ఏ ట్విస్ట్‌కు తెరతీస్తుందో చూడాలి.