
గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన శశిథరూర్
న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ సహాయ మంత్రి శశిథరూర్ కు స్వల్పంగా గుండెనొప్పి రావటంతో గతరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శశిథరూర్ను వైద్యులు ప్రత్యేక వార్డుకు మార్చారు. కాగా శశిథరూర్ భార్య సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఓ హోటల్‌గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చేంత వరకూ ఆమె మృతికి కారణాలనే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.
సాధారణంగా పోలీసులు అరెస్టు చేస్తారనే అనుమానం రాగానే మన దేశంలో రాజకీయ నాయకులకు గుండెనొప్పి అప్పటికప్పుడే వచ్చేస్తుంటుంది. ఇప్పుడు శశి థరూర్ గారికి వచ్చింది కూడా అలాంటి గుండెనొప్పేనా.. లేక నిజంగానే మూడో భార్య మరణించినందుకు ఆవేదనతో ఆయనకు గుండెనొప్పి వచ్చిందా అన్న విషయాన్ని మాత్రం వైద్యులే తేల్చాల్సి ఉంది.