శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు | Sunanda Pushkar funeral today, overdose of medicines led to her death? | Sakshi
Sakshi News home page

శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు

Published Sat, Jan 18 2014 2:21 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు - Sakshi

శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు

న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతికి సంబంధించి కేంద్రమంత్రి శశిథరూర్ను పోలీసులు విచారించనున్నారు. సునందా పుష్కర్ అంత్యక్రియల అనంతరం ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సునందా పుష్కర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా సునంద మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం లోథీ రోడ్డులోని శశిథరూర్ నివాసానికి మృతదేహాన్ని తరలించారు.

మరోవైపు సునందకు ప్రాణాంతక వ్యాధి ఏమీలేదని ఆమెకు గతంలో చికిత్స చేసిన వైద్యుడు విజయ్ రాఘవన్ తెలిపారు. సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement