న్యూఢిల్లీ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం పోస్ట్మార్టం నిర్వహించింది. పోస్ట్మార్టం నివేదిక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వెలువడనుంది.
అయితే సునంద మృతిపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్ నివేదిక కీలకం కానుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు పోస్ట్‌మార్టమ్ నివేదికలో తెలియనుంది. కాగా ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి శశిథరూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు స్వల్పంగా గుండెనొప్పి రావటంతో గతరాత్రి ఆస్పత్రిలో చేరారు.