'సునంద పుష్కర్ కుట్రకు బలైంది'
కేంద్ర మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ కుట్రకు బలైంది అని పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ అన్నారు. శశి థరూర్, సునందల వివాహం వివాదస్పదంగా మారటానికి, తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె తెలిపారు. సునంద పుష్కర్ ఆత్మహత్య అనుమానస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
సునందను భారత్ లో ఒకసారి, దుబాయ్ లో మరోసారి మాత్రమే కలుసుకున్నానని తరార్ వెల్లడించింది. మరో మహిళను తన ఎదుట శశి థరూర్ పొగడ్తలతో ముంచెత్తడం సునందకు ఇష్టం ఉండదని తెలిపింది. దాంతో తనను పొగడవద్దని శశికి సూచించానని తరార్ వెల్లడించారు.
ట్విటర్ లో తనను శశి ఫాలోఅవుడం ప్రారంభించాకా.. సునంద తన అకౌంట్ ను ఫాలోఅవడం మానివేసిందని తరార్ అన్నారు. తనతో ఈ-మెయిల్ లో, ఫోన్ లో శశి మాట్లాడటం సునందకు అసలు ఇష్టం ఉండేది కాదన్నారు. తాను వాళ్లను కలువడానికి ముందే వారి మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని.. వారి జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
సునంద, శశి విడిపోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపింది. ఆ వెలుగుతున్న కొవ్వొత్తుల ఫోటోను ప్రోఫైల్ గా మార్చి సునందకు తరార్ నివాళలర్పించారు.