ముంబై: బాద్రాలోని తన ఖరీదైన పాలి హిల్ కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీ చర్యను పాకిస్తాన్‌తో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తారార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మెహర్‌ను భారత నెటిజన్లు విపరీతం ట్రోల్ చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. అయితే బీఎంసీ తన కార్యాలాయాన్ని కూల్చివేయడంతో కంగనా పాకిస్తాన్ మాదిరిగా ముంబైలో కూడా ప్రజాస్వామ్యం కరువైందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైని పాకిస్తాన్‌తో పోలుస్తూ విమర్శించడంతో మెహర్ తారార్ కంగనాపై మండిపడుతూ... ‘డియర్ కంగనా, దయ చేసి మా దేశం పేరును వాడకుండా మీ రాజకీయ, ఇతర యుద్ధాలతో పోరాడండి. పాకిస్తాన్‌లో జాతీయ పౌరుల ఇళ్లు, కార్యాలయాలు ఎప్పుడు కూల్చివేసిన దాఖలు లేవు’ అంటూ ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చింది. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్)
దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్‌లు ఆమెపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ గురించిన ప్రశ్నలు వేయడమే కాకుండా మెహర్ తారుర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘అవును.. పాకిస్తాన్‌లో ఇళ్లు, కార్యాలయాలు కూల్చివేయరు, కానీ ఇతర మతాలకు సంబంధించిన స్థలాలను, భవనాలను, ఆస్తులను కూల్చడానికి మాత్రం పాకిస్తాన్ ప్రజలు గుమికుడుతారు’, ‘నేషనల్ హీరోస్: దావుద్, హఫీజ్, సల్లవుద్దీన్, ఓసామా, ఇమ్రాన్ ఖాన్’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరో ట్విటర్ యూజర్ ‘పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో మాకు తెలుసు.. వారు చంపబడం లేదా అదృశ్యమవ్వడం’ అంటూ తారాపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా శివసేనకు, కంగనా మధ్య మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా కార్యాలయాన్ని నిన్న(బుధవారం) కూల్చివేసిన బీఎంసీ.. ఇది అనధికారిక నిర్మాణంగా పేర్కొంది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!)
Dear Kangana, please fight your political/other battles without involving our country's name. In Pakistan, houses or offices of national heroes are not demolished. https://t.co/LmsmE8hymE
— Mehr Tarar (@MehrTarar) September 9, 2020
Comments
Please login to add a commentAdd a comment