Nalini Singh
-
సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!
న్యూఢిల్లీ: శశి థరూర్, సునంద పుష్కర్ ల సంబంధాల గురించి ప్రముఖ జర్నలిస్ట్ నళిని సింగ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో మాట్లాడిన వారిలో నళిని సింగ్ ఒకరు. తన భర్త శశి థరూర్ పాకిస్థాని జర్నలిస్ట్ మెహర్ తరార్ ను పెళ్లాడాలనుకుంటున్నారని సునంద తెలిపిందని నళిని సింగ్ చెప్పింది. తరార్, థరూర్ ల మధ్య రొమాంటిక్ మెసేజ్ లు ఒకరికొకరు పంచుకుంటున్నారని, అందులో ఒక మెసేజ్ లో తనకు శశి థరూర్ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉందని, థరూర్ లేకుండా బతకలేనని తరార్ మరో మెసేజ్ లో తెలిపిందని సునంద తనతో చెప్పిందని నళిని సింగ్ కీలక సమాచారాన్ని తాజాగా బయటపెట్టింది. అంతేకాకుండా తరార్ తో పెళ్లికి థరూర్ కుటుంబం కూడా ప్రోత్సహిస్తోందని సునంద ఆవేదన వ్యక్తం చేసినట్టు నళిని వెల్లడించింది. సునంద మరణానికి ముందు లీలా హోటల్ లో ఉదయం 4 గంటల నుంచి ఇద్దరూ విపరీతంగా గొడవ పడ్డారని.. వారిద్దరూ గొడవ పడిన విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారని నళిని సింగ్ తెలిపింది. -
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
-
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
ఇస్లామాబాద్: సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్.. తనకు, శశి థరూర్ దంపతుల మధ్య విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లు ఏప్రిల్ నుంచే పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ కుట్రలో తనను పావును చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఓ టీవీ విలేకరితో ఆమె మాట్లాడుతూ.. ‘నేను థరూర్‌ను కలిసింది రెండేసార్లు.. ఒకటి ఏప్రిల్ నెలలో భారత్‌లో, మరోసారి గతేడాది జూన్‌లో దుబాయ్‌లో ఉండగా. ఆ సమయంలో అక్కడ ఈయనే కాదు చాలా మంది ఉన్నారు. అయితే తర్వాత థరూర్ గురించి నేను ఓ ఆర్టికల్ రాశాను. ఇందులో ఆయన్ను ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చలేదనుకుంటా. దీంతో నాతో మాట్లాడొద్దని సునం ద.. శశిని హెచ్చరించారు. ఆయనతో నా సంభాషణ కూడా సాధారణ అంశాలపైనే సాగేది.. అవి నేను అందరితో మాట్లాడేవే’’ అని తెలిపారు. -
తరార్‌తో సంబంధమేంటి?
పాక్ జర్నలిస్టు గురించి శశి థరూర్‌ను ప్రశ్నించిన మేజిస్ట్రేట్ భార్య మృతికి ముందు పరిస్థితులపై ఆరా దర్యాప్తును వేగవంతం చేయాలంటూ షిండేకు శశి లేఖ నన్ను కుట్రలో పావును చేశారు: తరార్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. మృతికి కారణాలు తెలుసుకునేందుకు ఒకవైపు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఢిల్లీలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదివారం 8 మందిని ప్రశ్నిం చారు. వీరిలో సునంద భర్త శశి థరూర్, సోదరుడు రాజేశ్, జర్నలిస్టు నళిని సింగ్ కూడా ఉన్నారు. మీ భార్య మృతికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చు? మరణానికి ముందు రోజుల్లో ఆమెకు, మీకు ఏమైనా గొడవలు జరిగాయా? లాంటి ప్రశ్నలతోపాటు.. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో మీకేంటి సంబంధం? అని మేజిస్ట్రేట్.. శశి థరూర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. థరూర్‌కు, మెహర్ తరార్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేసిన రెండు రోజుల తర్వాత సునంద మరణించిన సంగతి తెలిసిందే. మరణానికి ముందు కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ థరూర్ తన లిఖితపూర్వక వాంగ్మూలంలో మేజిస్ట్రేట్‌కు వివరించినట్లు తెలిసింది. వాంగ్మూలం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించారు. మరణానికి ముందు ఎవరితో మాట్లాడారు? సునంద మరణించిన హోటల్ గది వద్ద సీసీటీవీ వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందు థరూర్‌తో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడారు? ఎవరికి ఎస్ఎంఎస్లు పంపారు లాంటివి ఆరా తీస్తున్నారు. సునంద మృతదేహానికి శవపరీక్ష చేసిన వైద్యులు సోమవారం మేజిస్ట్రేట్‌కు నివేదికిచ్చే అవకాశముంది. దర్యాప్తును వేగవంతం చేయాలని షిండే లేఖ తన భార్య మరణంపై మీడియాలో వస్తున్న కథనాలపై శశిథరూర్.. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఆదివారం లేఖ రాశారు. ‘నా భార్య మరణించిన విషాదంలో నేనుంటే.. ఆ మరణంపై రకరకాల ఊహాగానాలతో మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరణానికి అసలు కారణమేంటో ముందు తెలియాలి. దీనిపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన లేఖలో కోరారు. ఔషధం.. అధికమొత్తంలో తీసుకున్నారా! అనుమానాస్పదంగా మరణించిన సునంద పుష్కర్ మృతదేహంలో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లూ లభించలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే మానసిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగపడే ఆల్ప్రాజోలం ఆనవాళ్లు లేకపోలేదని వివరించాయి. -
మెజిస్ట్రేట్ ఎదుట శశిథరూర్, నళినీ సింగ్ వాంగ్మూలం
ఢిల్లీ(ఐఏఎన్ఎస్): తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్ ఈరోజు సాయంత్రం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సిఆర్పిసి 164 సెక్షన్ ప్రకారం వసంత విహార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ శశిథరూర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాపషెరా ప్రాంతంలోని అలోక్ శర్మ కార్యాలయానికి ఈ సాయంత్రం శశిథరూర్ వెళ్లి దాదాపు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. టివి జర్నలిస్ట్ నళినీ సింగ్ వాగ్మూలాన్ని కూడా మేజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. సునంద పుష్కర్ సెల్ ఫోన్ రికార్డుల ప్రకారం ఆమె చివరిసారిగా నళినీ సింగ్‌కు కాల్ చేశారు. అనంతరం నళినీ సింగ్ ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ సునంద చనిపోవడానికి ముందు తనతో ఏం మట్లాడారో మేజిస్ట్రేట్‌కు చెప్పానని తెలిపారు. ఆయన నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పినట్లు తెలిపారు. సునంద పుష్కర్ ఈ నెల 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు కూడా తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని శశిథరూర్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు.