సునందను చంపిన విషం.. పొలోనియం! | polonium was used to kill sunanda pushkar, says atopsy report | Sakshi
Sakshi News home page

సునందను చంపిన విషం.. పొలోనియం!

Published Tue, Jan 6 2015 4:12 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునందను చంపిన విషం.. పొలోనియం! - Sakshi

సునందను చంపిన విషం.. పొలోనియం!

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం'. ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. పొలోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. దీన్ని క్యూరీ దంపతులు 1898లో కనిపెట్టారు. గతంలో ఎవరికైనా విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించేవారు.

ఇంతకుముందు పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్ను, కేజీబీ ఏజెంటు ఒకరిని చంపడానికి కూడా ఇదే పదార్థాన్ని ఉపయోగించారు. ఒకసారి దీన్ని ఇంజెక్ట్ చేస్తే కనుక్కోవడం చాలా కష్టం. పౌడర్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించేందుకు అవకాశం ఉంది. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు శాంపిళ్లను పరీక్ష కోసం విదేశాలకు కూడా పంపారు. అక్కడే ఈ పొలోనియం వాడిన విషయం తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement