
సునంద పై వర్మ సినిమా ?
ముంబై : సంచలనాలకు మారుపేరు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజగా ఆయన కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ పై సినిమా తీయాలనుకుంటున్నారట. అయితే సునంద మృతిపై కేసు పూర్తి అయిన తరువాతనే సినిమా కథ తయారు చేస్తానని స్వయంగా వర్మ చెప్పినట్టు సమాచారం.
సునంద జీవితానికి సంబంధించి అన్ని విషయాలు అధ్యయనం చేశాకే సినిమాను తెరకెక్కిస్తారట. కాగా రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ముంబయిలో 26/11 దాడులపై సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత కేరళలో ఫేమస్ మర్డర్ కేసుపై మరో సినిమా తీయనున్నట్లు సినీ వర్గాల టాక్.