
సునందది హత్యేనని మాకు తెలుసు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ది హత్యేనని తాము మొదట్నుంచి చెబుతున్నామని ఆమె సమీప బంధువులు అన్నారు. సునందా పుష్కర్ హత్యకు గురైనట్టు ఢిల్లీ పోలీసులు నిర్ధారించిన తర్వాత ఆమె సమీప బంధువు అశోక్ కుమార్ స్పందించారు. సునందను హత్య చేశారని తమ కుటుంబం మొదట్నుంచి భావిస్తున్నట్టు అశోక్ కుమార్ చెప్పారు. అయితే పోలీసులే ఆలస్యంగా నిర్ధారించారని అన్నారు.
శశి థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో.. ఢిల్లీలోని ఓ హోటల్లో 2014 జనవరి 17న సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.