బీఎస్ బస్సీ
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అంతర అవయవాల నమూనాలను పరీక్షల నిమిత్తం ఏ దేశం పంపాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రెండు రోజుల్లో నిర్ణయిస్తుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునందది అసహజ మరణమని ఎయిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరి 1న ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటుచేశారు.
ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేసేందుకు సునంద అంతర అవయవాల నమూనాలను ల్యాబ్లో పరీక్షల నిమిత్తం అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పంపుతామని జనవరి 6న బస్సీ చెప్పారు. అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. శశి థరూర్‌ను ఎప్పుడు విచారించాలో సిట్ నిర్ణయిస్తుందని బస్సీ స్పష్టంచేశారు. ఈ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటో త్వర లోనే తెలుస్తాయని ఆయన అన్నారు.