
'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బాసీ తెలిపారు. అవసరమైతే మరోసారి ఆయన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురి విచారించామని, ఇంకా కొందరిని ప్రశ్నిస్తున్నామని అన్నారు.
సోమవారం రాత్రి థరూర్ ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించామని, అవసరమైతే రెండవసారి పశ్నించేందుకు ఆయనను పిలుస్తామని వెల్లడించారు. థరూర్ ఏం సమాధానం చెప్పారనేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.