సునందా పుష్కర్ కేసులో లై-డిటెక్టర్ పరీక్ష | Lie - detector test in the case , is sunanda | Sakshi
Sakshi News home page

సునందా పుష్కర్ కేసులో లై-డిటెక్టర్ పరీక్ష

Published Thu, May 21 2015 3:28 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

Lie - detector test in the case , is sunanda

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు అనుమానితులకు సత్యశోధన(లై-డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సిటీ కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. పోలీసులు శశిథరూర్ ఇంటి సహాయకులైన నారాయణ్‌సింగ్, డ్రైవర్ బజ్‌రంగిలతోపాటు స్నేహితుడు సంజయ్‌లకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు విన్నవించారు.

దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురినీ విచారించామని, కానీ కొన్ని కీలక వాస్తవాలను వారు చెప్పలేదని అన్నారు. ముఖ్యంగా సునంద శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించినఅంశాలను వారు వెల్లడించట్లేదని విన్నవించారు. అందువల్ల వారికి లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement