శశి థరూర్కు త్వరలో లై డిటెక్టర్ పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశముంది. త్వరలోనే ఢిల్లీ పోలీసులు థరూర్ను విచారించడంతో పాటు ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడ్డాయ. సునంద విష ప్రభావంతోనే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో కీలక వ్యక్తులను ఢిల్లీ పోలీసులు మరోసారి విచారించారు. శశి థరూర్ డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, సునందను పరీక్షించిన వైద్యుడిని పోలీసులు ప్రశ్నించారు. సునంద చనిపోయిన రోజు ఆమె గదిలో అల్ప్రాక్స్ టాబ్లెట్లు లభించడంతో లోధీ కాలనీలో కెమిస్ట్లను కూడా పోలీసులు విచారించారు. అల్ప్రాక్స్ వల్ల విషప్రభావంతో ఆమె చనిపోయినట్టు వైద్య నివేదికలో తేలింది. సునందకు మందులు ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ కొన్నారు వంటి విషయాలను పోలీసులు ప్రశ్నించారు. గతంలో వారిచ్చిన వాంగ్మూలాలతో పోల్చిచూసినట్టు సమాచారం.