క్లాస్‌రూంలో విద్యార్థుల ముందు.. | Teacher set ablaze in front of students over failed business | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూంలో విద్యార్థుల ముందు..

Published Thu, Aug 17 2017 10:53 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

క్లాస్‌రూంలో విద్యార్థుల ముందు.. - Sakshi

క్లాస్‌రూంలో విద్యార్థుల ముందు..

బెంగుళూరు: వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాలు ఓ టీచర్‌ ప్రాణాలు తీశాయి. ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్‌ సునంద(50)పై ఓ వ్యక్తి కిరోసిన్‌ పోశాడు. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమెపై వెంట తెచ్చుకున్న డబ్బాలోని కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు.

ఈ ఘటన బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. టీచర్‌ మంటల్లో కాలిపోతే కేకలు వేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు నిర్ఘాంతపోయారు. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఘటనాస్ధలికి చేరుకున్న ఇతర టీచర్లు సునందను ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవరాం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సునంద ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రూంలోకి వచ్చిన ఓ వ్యక్తి.. సునందను గద్దించి మాట్లాడినట్లు చెప్పారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు.

సునంద అతన్ని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలిపారు. అతను వెంట తెచ్చుకున్న డబ్బాను తెరిచి సునందపై కిరోసిన్‌ పోసి నిప్పంటిచినట్లు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement