శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం! | Congressman Shashi Tharoor to be questioned Within 48 hours, Says Delhi Police | Sakshi
Sakshi News home page

శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం!

Published Mon, Jan 19 2015 12:45 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం! - Sakshi

శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం!

ఢిల్లీ:  భార్య సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఢిల్లీ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు అందజేశారు.   సునందా హత్య కేసుకు సంబంధించి ఈనెల మొదట్లో శశి థరూర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శశి థరూర్ ను మరో 48 గంటల్లో విచారిస్తామని నగర కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. శశి థరూర్ మూడో భార్య అయిన సునంద పుషర్క్ది సహజ మరణం కాదని,  విషప్రయోగం వల్ల ఆమె  చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

 

ఇందులో భాగంగానే ముందుగా భర్త శశి థరూర్ ను మరో రెండు రోజుల్లో విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో సునందా మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement