'శశి థరూర్ను కూడా విచారించవచ్చు'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యకేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ను విచారించే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కాగా సునంద హత్యకేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ బుధవారం నుంచే రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని బస్సీ బుధవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. థరూర్‌ను కూడా ప్రశ్నిస్తారా? అని మీడియా ప్రశ్నించగా..అవసరమైతే తప్పదు... ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామని తెలిపారు. కాగా ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సునంద పుషర్క్ది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు.