'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి' | CPI-M demands comprehensive probe into Sunanda's death | Sakshi
Sakshi News home page

'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి'

Published Fri, Oct 10 2014 2:11 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి'

'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి'

కొల్లం(కేరళ): కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం కేరళ శాఖ డిమాండ్ చేసింది. విషం సేవించడం కారణంగానే ఆమె మృతి చెందారని ఫోర్సెనిక్ పరీక్షలో తేలిన నేపథ్యంలో సీపీఎం ఈ డిమాండ్ చేసింది. 

సునంద పుష్కర్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని కేరళ సీపీఎం కార్యదర్శి పినరయి విజయన్ అన్నారు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందన్నారు.  సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీయాల్సిన అవసరముందన్నారు. జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement