
సునంద మరణంపై విచారణను వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మరణంపై విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కోరారు. సునంద మృతికి గల కారణాలను కనుగొని కచ్చితమైన నివేదికను తయారు చేయాలని శశిథరూర్ పేర్కొన్నారు.
సునంద మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో శశిథరూర్ పైవిధంగా స్పందించారు. సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. సునందా పుష్కర్ గత జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.