speedy inquiry
-
డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన ఈడీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చదవండి : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు Tollywood Drugs Case 2021: డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి -
Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. కాగా, ఇప్పటికే ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ ల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. అదేవిధంగా, 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. కాగా, దీనిపై విచారించిన అనంతరం మరికొంత మందికి నోటిసులను జారీచేసే అవకాశం ఉంది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్‌పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు చదవండి: విషాదం: లోయలో పడ్డ కారు.. నవ వధువు, తండ్రి మృతి -
విషాదంలోని మరో కోణం దాచబడిందా?
-
సునంద మరణంపై విచారణను వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మరణంపై విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కోరారు. సునంద మృతికి గల కారణాలను కనుగొని కచ్చితమైన నివేదికను తయారు చేయాలని శశిథరూర్ పేర్కొన్నారు. సునంద మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో శశిథరూర్ పైవిధంగా స్పందించారు. సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. సునందా పుష్కర్ గత జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.