
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. కాగా, ఇప్పటికే ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ ల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. అదేవిధంగా, 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. కాగా, దీనిపై విచారించిన అనంతరం మరికొంత మందికి నోటిసులను జారీచేసే అవకాశం ఉంది.
విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్‌పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది.
చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment