శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు | No political pressure in Sunanda Pushkar death probe: Rajnath Singh | Sakshi
Sakshi News home page

శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు

Published Fri, Jan 16 2015 8:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు

శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు

న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చట్టం తన పని చేసుకుపోవాలని, ఈ కేసు విషయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఆయన గురువారమిక్కడ అన్నారు. విచారణ నిష్పక్షపాతంగానే సాగుతోందన్నారు.

కేసు తనవైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సునంద భర్త, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కాగా సునంత పుష్కర్ హత్య జరిగిన సమయంలో అంటే 2014 జనవరి 17న కాంగ్రెస్ నేత శశి థరూర్ కదలికలు, ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అన్న అంశాలను ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. థరూర్ చేసిన ఫోన్- కాల్స్ రికార్డును పోలీసులు సేకరించారు. ఆ అంశాలు, డాక్టర్ ను ఎవరు పిలిపించారు. ఎవరి ప్రోద్బలంతో పిలిపించారు. అనే అన్నివిషయాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement