
భార్య సునందతో శశిథరూర్ (పాత ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ నేత, ఆమె భర్త శశిథరూర్‌కు షాక్. ఢిల్లీ పోలీసులు ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. థరూరే సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని అందులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పటియాలా కోర్టులో ఛార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. అనంతరం కేసును మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
జనవరి 17, 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ ఆమె అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించటంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment