
సునంద కేసులో ఆరుగురికి సత్యశోధన పరీక్షలు
న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసుకు సంబంధించి.. ముగ్గురు ప్రధాన సాక్షులతో సహా ఆరుగురు వ్యక్తులకు సత్య శోధన పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి తెలిపారు. సునంద భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇంటి పనిమనిషి నారాయణ్‌సింగ్, డ్రైవర్ బజరంగి, కుటుంబ స్నేహితుడు సంజయ్‌దేవన్‌లతో పాటు.. ఎస్.కె.శర్మ, వికాస్ అహ్లావత్, సునీల్ టక్రులకు ఈ పరీక్షలు నిర్వహించారు.