
'వందశాతం కోపరేట్ చేస్తా'
తిరువనంతపురం: తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో జరుగుతున్న దర్యాప్తు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ శశిథరూర్ అన్నారు. మూడు కీలక సాక్ష్యాల కోసం ఢిల్లీ పోలీసులు డిటెక్టర్ పరీక్ష చేసేందుకు అనుమతి తీసుకున్న విషయం పై ఆయనను ప్రశ్నించగా.. 'దర్యాప్తు విషయంలో ఇప్పుడే తాను స్పందిచబోనని చెప్పారు. వారి విధులను వారిని నిర్వర్తించనివ్వండి.. నేను వారిని డిస్ట్రబ్ చేయాలనుకోవడం లేదు. వారికి వందశాతం సహకరిస్తాను' అని ఆయన అన్నారు. తాను కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, అయితే దర్యాప్తు పూర్తయ్యాకే వాటిని చెప్తానని తెలిపారు.