పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు | Delhi Police to question Pakistan journalist Mehr Tarar in Sunanda Pushkar murder case | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు

Published Thu, Mar 12 2015 3:47 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

Delhi Police to question Pakistan journalist Mehr Tarar in Sunanda Pushkar murder case

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో  పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను  గురువారం విచారించనున్నామని  ఢిల్లీ పోలీస్  కమీషనర్ బీఎస్ బస్సీ  తెలిపారు.  సునంద గత ఏడాది జనవరి 17న  ఢిల్లీలోని ఒక హెటెల్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు.    చనిపోవడానికి ముందు ఆమె విలేకరుల సమావేశం పెట్టాలనుకున్నారన్న సమాచారంతో ఇప్పటికే   కొంతమంది జర్నలిస్టులను విచారించారు ఢిల్లీ  పోలీసులు . ఈ కేసులో  పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ కీలక వ్యక్తిగా భావిస్తున్నఢిల్లీ పోలీసులు అవసరమైతే  ఆమెనూ  ప్రశ్నిస్తామని గతంలోనే ప్రకటించారు.

దీనిపై తరార్ స్పందిస్తూ విచారణకు తాను సిద్ధమని, కానీ, తాను భారత్ రానని, పోలీసులే లాహోర్ రావాలన్నారు.  సునందతో ట్విట్టర్ లో  ఘర్షణ పడి పెద్ద తప్పు చేశానన్నారు.  కాగా తన భర్త శశిథరూర్‌కు , మెహర్ తరార్‌తో సంబంధం ఉందంటూ తరార్ తో ట్విట్టర్ లో సునంద ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తరార్ ను విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు.


 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement