
సునంద కేసును సిట్‌కు అప్పగించండి..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసును సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) అప్పగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్యణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు.
సునంద కేసు విచారణలో మితిమీరిన జాప్యం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇది న్యాయవ్యవస్థకే మచ్చలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రా, ఢిల్లీ పోలీసుల నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు.