నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునందా పుష్కర్ మృతి కేసులో సీనియర్ జర్నలిస్ట్ నళిని సింగ్ ను పోలీసులు ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ నాథ్ లోని పోలీసుల బృందం సరోజినినగర్ పోలీసు స్టేషన్ లో ఆమెను ప్రశ్నించింది. దాదాపు 80 నిమిషాల పాటు తనను పోలీసులు ప్రశ్నించారని నళిని సింగ్ తెలిపారు. పోలీసులను కలవడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో తాను మాట్లాడిన విషయాల గురించి పోలీసులు ఆరా తీశారని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సంబంధించిన అంశాలపై అడిగారని వెల్లడించారు. శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని వెల్లడించి నళిని సింగ్ అప్పట్లో సంచలనం సృష్టించారు.