కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌కి జరిపిన పాలీగ్రాఫ్ టెస్టులో కొన్ని కీలక అంశాలు వెల్లడించాడు. నేరం జరిగిన రోజున వారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు.
కాగా, ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతిలో సంజయ్‌కు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్బంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు.
నేరం జరిగిన రోజు రాత్రి జరిగింది ఇది..
ఆగస్టు 8వ తేదీన రాత్రి నిందితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు.
11:15 PM: రాయ్ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు.
బయట మద్యం సేవించి.. అనంతరం, నార్త్ కోల్‌కతాలోని సోనాగాచీ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లారు.
కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్‌కతాలో ఉన్న చెట్లా రెడ్‌లైట్ చేరుకున్నారు.
అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు. నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు.
ఈ సందర్భంగా రాయ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. తన నగ్న ఫొటోలను పంపాలని కోరాడు. దీంతో, ఆమె ఫొటోలను పంపించింది.
అదే వీధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురిచేశాడు.
కాసేపటి తర్వాత వారిద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 4:03 AM ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు(సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం) ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్‌లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా.. సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్‌లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్‌ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన నిందితుడు హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది.
Sanjoy Roy, the prime accused in the rape and murder of a trainee doctor at Kolkata's R.G. Kar
Medical College and Hospital, has reportedly claimed in a lie detector test that the victim was dead when he reached the hospital's seminar hall.
Sanjay Roy was subjected to a… pic.twitter.com/N6zmkYPBd4— Shyam Awadh Yadav parody© (@shyamawadhyada2) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment