
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్‌బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.
మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్‌పై గాజుగ్లాసును కళ్యాణ్‌బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది.
ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి
Comments
Please login to add a commentAdd a comment