Kalyan Banerjee
-
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
నా కుటుంబాన్ని దుర్భాషలాడారు: ఎంపీ కల్యాణ్ బెనర్జీ
కోల్‌కతా: వక్ఫ్ బిల్లుపై నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచితంగా ప్రవర్తించారు. బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో జరిగిన వాగ్వాదంలో ఎంపీ బెనర్జీ ఓ గాజు సీసాను పగులగొట్టి దానిని ప్యానల్ చైర్మన్ జగదాంబికా పాల్పైకి విసిరారు. ఈ క్రమంలో ఎంపీ బొటనవేలు, చూపుడు వేలికి గాయం కావడంతో ప్రథమ చికిత్స చేశారు. అయితే వారం రోజుల అనంతరం ఆరోజు జరిగిన ఘటనపై తాజాగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించి.. తన చర్యలను సమర్థించుకున్నారు. బీజేపీ ఎంపీ గంగోపాధ్యాయ తనను దుర్భాషలాడారని బెనర్జీ ఆరోపించారు.‘‘నాకు రూల్స్ , రెగ్యులేషన్స్ అంటే చాలా గౌరవం. దురదృష్టవశాత్తు అభిజిత్ గంగోపాధ్యాయ నాపై నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆరోపణలు చేశారు. ఆ రోజు మొదటగా కాంగ్రెస్ ఎంపీ నసీర్, అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ఆయన నన్ను, నా తల్లి, మా నాన్న , నా భార్యను దుర్భాషలాడడం ప్రారంభించారు. ఆ సమయంలో జేపీసీ చైర్మన్ అక్కడ లేరు. ఛైర్మెన్ అక్కడ లేనప్పుడు.. అభిజిత్ గంగోపాధ్యాయ నా పట్ల కఠినంగా ప్రవర్తించారు. ...కానీ, దీంతో జెపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్.. ఎంపీ గంగోపాధ్యాయ పట్ల పక్షపాతంతో వ్యహరించారు. అది నాకు చాలా విసుగు తెప్పించింది. అప్పుడు నేను టేబుల్‌పై ఉన్న గాజు సీసాని పగులగొట్టాను. నేను దానిని చైర్మన్‌పైకి విసిరేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం ఛైర్మన్‌కు లేదు. స్పీకర్‌కు మాత్రమే అధికారం ఉంది’’ అని అన్నారు.ఈ ఘటన జరినగి తర్వాత బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ బెనర్జీ చర్యను నిరసిస్తూ చేసిన తీర్మానాన్ని ప్యానెల్ 9-8తో ఆమోదించడంతో అతడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. బీజేపీకి ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షతన కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం అభిప్రాయాలను వింటున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లులో తమ వాటా ఏమిటని విపక్ష సభ్యులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం -
జేపీసీ భేటీలో రసాభాస
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాగ్వాదాలకు వేదికగా నిలిచింది. రసాభాసగా మారిన ఈ సమావేశంలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పట్టరాని ఆవేశంతో గాజు నీళ్లసీసా పగలగొట్టారు. సమావేశాన్ని గలాటాకు వేదికగా మార్చారంటూ బెనర్జీని కమిటీ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత జగదాంబికాపాల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చ సందర్భంగా బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిల్లును బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బెనర్జీ గాజు నీళ్ల సీసాను పగలగొట్టి చైర్మన్ కుర్చీ వైపుగా విసిరారు. ఈ క్రమంలో అది బెనర్జీ కుడి బొటనవేలుకు కోసుకుపోయింది. ప్రథమ చికిత్స చేసి కుట్లువేశాక ఆయన మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బెనర్జీ ఆవేశపూరిత చర్యలను మెజారిటీసభ్యులు ఖండించారు. సభ్యుల ఆవేశాలు చూస్తుంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలాగే రివాల్వర్‌తో కమిటీకి వస్తారేమో అని చైర్మన్ పాల్ అసహనం వ్యక్తంచేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీర్మానాన్ని 10–8 మెజారిటీతో ప్యానెల్ ఆమోదించింది. దీంతో బెనర్జీ కోపంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.న్యాయవాదులు, మాజీ జడ్జీలతో కూడిన రెండు ఒడిశా ప్రతినిధి బృందాలతో ప్యానెల్ మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. వక్ఫ్ బిల్లుతో వీళ్లకు ఏం సంబంధమని బెనర్జీ నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత బెనర్జీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ఆ తర్వాత పదేపదే బెనర్జీ కలగజేసుకోవడాన్ని తప్పుబట్టడం, దీనికి అభిజిత్ గంగోపాధ్యాయ్ మద్దతు పలకడంతో గంగోపాధ్యాయ్‌తో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా బాటిల్‌ను విసిరేయలేదని తర్వాత బెనర్జీ వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అభ్యంతరాల నేపథ్యంలో పరిశీలన నిమిత్తం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెల్సిందే. -
వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్‌పై గాజుగ్లాసును కళ్యాణ్బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి -
KSR Comments: వాట్ ఏ మేనేజ్ మెంట్?.. చంద్రబాబుపై ఆరోపణలు మోదీ సైలెంట్..
-
ఇలా చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదుగా!
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన సింహగర్జనకు లోక్‌సభ దద్దరిల్లింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన, బీజేపీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీలో చేరితే వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర ఎన్సీపీ చీలికవర్గం నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ లపై ఉన్న ఆరోపణలను ప్రస్తావించి వారంతా బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోయారా అని నిలదీశారా? చంద్రబాబు ను సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదని బెనర్జీ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ షేర్ విలువ హటాత్తుగా పెరిగి ఒకరోజులోనే 521 కోట్ల సంపద వచ్చిందని, ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయరా అని అడిగారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కనుక వీరంతా పునీతులు అయిపోయినట్లేనా? అవినీతిపరులు నితిమంతులు అయినట్లేనా? అని ఆయన అన్నారు. నిజానికి ఇంత కీలకమైన ప్రశ్నకు మోదీ స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. కాని ఈ విషయంలో ఆయన కూడా నైతికంగా దెబ్బతిన్నారని చెప్పక తప్పదు. బీజేపీతో కలవకముందు అజిత్ పవార్ కాని, ప్రఫుల్ల పటేల్ కాని పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీతో సంబంధం పెట్టుకోగానే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది.. అలాగే ఈడి గోల కూడా పోయింది. చంద్రబాబు విషయం చూస్తే మరీ ఆసక్తికరం అని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, మోదీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మోదీని టెర్రరిస్టు అని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలుతాడని పలుమార్లు ధ్వజమెత్తారు.మోదీ సైతం 2019 ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ఆరోపణలు చేస్తూ పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమితో చంద్రబాబు లైన్ మార్చి మళ్లీ మోదీని ఆకట్టుకోవడానికి పలు ఎత్తుగడలు వేశారు. తొలుత మోదీ ఇష్టపడలేదు. ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల విలువైన అక్రమాలు జరిగాయని తేల్చినట్లు సిబిటిడి ప్రకటించింది. అంతేకాక ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు కొన్ని అక్రమాలకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన ఏదో సాకు చూపుతూ తప్పించుకునే యత్నం చేశారు. ఈలోగా మోదీతో మధ్యవర్తుల ద్వారా మంతనాలు సాగించి తన జోలికి రాకుండా చేసుకోగలిగారు. అది ఆయన మొదటి సక్సెస్ అని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే లోక్ సభలో వైఎస్సార్సీపీకి అప్పట్లో 19 మంది సభ్యులు ఉండేవారు. అయినా వారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్థాయిలో చంద్రబాబుపై వచ్చిన అభియోగాల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినట్లు అనిపించదు. చంద్రబాబుపై గత ఏపీ ప్రభుత్వంలో సిఐడి పలు అవినీతి కేసులు నమోదు చేసి ఈడి, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. ఒకవైపు దేశంలో అవినీతిని అంతం చేస్తానంటూ కబుర్లు చెప్పే మోదీ ఇలా చేస్తున్నారేమిటా అని అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అప్పటికే చంద్రబాబు తెలివిగా తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీను బీజేపీలో విలీనం చేయించారు. వారిలో ఇద్దరు భారీ ఎత్తున బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులలో ఉన్నారు. బీజేపీలో చేరగానే వారంతా మోదీ ఎదుట కూర్చుని కబుర్లు చెప్పగలిగారు. తదుపరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ముందుగా బీజేపీ అధిష్టానం వద్దకు పంపించి పొత్తు కుదిరేలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారాను, బీజేపీలో ఉన్న తన కోవర్టుల ద్వారాను బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, జెపి నడ్డాలను ఎలాగైతేనేం ఒప్పించి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయగలిగారు. ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ విషయంలో తన వంతు సాయం చేసి అధిష్టానం పై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ రకంగా చంద్రబాబు తెలివిగా మోదీని , ఇతర బీజేపీ అగ్రనేతలను తనదారిలోకి తెచ్చుకున్నారు. దాంతో ఆయనపై అన్నివేల కోట్ల ఆరోపణలు వచ్చినా, ఏపీకి చెందిన ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈడి అప్పటికే ఆ కేసులో కొందరిని అరెస్టు చేసినా, చంద్రబాబు జోలికి రాలేదు. ఇంకో సంగతి కూడా చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపి వంద కోట్లు ఉంటుందో, నిజంగా ఎవరికైనా ముడుపులు ముట్టాయో లేదో కాని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,మాజీ ఎమ్.పి కవిత వంటివారు నెలల తరబడి జైలులో ఉంటున్నారు. న్యాయ వ్యవస్థ సైతం వారికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో అర్ధం కాదు.ఇదే డిల్లీ లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తిగాఈడి పరిగణించి విచారణ చేసిన లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసిపి టిక్కెట్ ఇవ్వకపోతే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలిచి మోదీతో కలిసి ఫోటో దిగారు.ఇలాంటివాటిని చూస్తే ఏమనిపిస్తుంది. ఈ దేశంలో అధికార పార్టీలో ఉంటే ఏ కేసునుంచి అయినా తప్పించుకోవచ్చు. అదే ప్రత్యర్ధి పార్టీలో ఉంటే నిజంగా అవినీతి జరిగినా,జరగకపోయినా ఈడి,సీబీఐ వంటివి వెంటబడే అవకాశం కూడా ఉంటుందన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. ఇవే కాదు.పశ్చిమబెంగాల్ లో శారదా చిట్ ఫండ్ స్కామ్ లోను, నారదా స్టింగ్ ఆపరేషన్ లోను కొందరు టీఎంసీ నేతలను సీబీఐ ఆరెస్టు చేసింది. వారు ఆ తర్వాత బీజేపీలో చేరగానే దాదాపు వారంతా సేఫ్ అయ్యారు. ఇలా ఆయా రాష్ట్రాలలో మోదీ ఇదే గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు మోదీ ఎన్నడూ సమాధానం చెప్పలేదు.అలాగే మోదీ తనపై చేసిన అవినీతి అభియోగాలకు చంద్రబాబు జవాబు ఇవ్వలేదు. ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయినా వారు జట్టు కట్టగలిగారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీవారిపై సీబీఐ, ఈడి వంటివాటిని ప్రయోగించి నష్టపోతే, మోదీ మాత్రం ఎదుటిపార్టీవారిపై ఈ సంస్థలను ఉపయోగించి అధికారం నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారన్న భావన ఏర్పడింది.పార్లమెంటులో కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలపై మోదీ నేరుగా స్పందించలేకపోయారు. తన ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ తో ఉందని మోదీ చెప్పినప్పటికీ,అందుకు ఆధారాలు చూపలేకపోయారు.ఇది ఒక ఎత్తు అయితే చంద్రబాబు గొప్పదనాన్ని ఒప్పుకోక తప్పదు. అదేమిటంటే చంద్రబాబు పై అంత పెద్ద ఆరోపణ లు లోక్ సభలో వస్తే సంబంధిత వార్తలను తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలోనే కాకుండా, ఆంగ్ల పత్రికలలో సైతం రాకుండా చేయగలిగారు.ఆయన మేనేజ్ మెంట్ స్కిల్ ఆ స్థాయిలో ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. జర్నలిజం విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఎన్.రామ్ నాయకత్వంలోని హిందూపత్రిక సైతం ఇందుకు అతీతంగాలేదు. ఒకప్పుడు ఎమర్జెన్సీపై పోరాడిన గోయాంకకు చెందిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ వార్తలు ఇవ్వలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలదీ ఇదే దారి . హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన వెలుగు, బీఆర్ఎస్ కు చెందిన నమస్తేతెలంగాణ వంటి పత్రికలు సైతం ఈ వార్తను విస్మరించాయంటే ఏమని అనుకోవాలి. వామపక్షాల పత్రికలలో కూడా ఈ వార్త ప్రముఖంగా కనిపించలేదు.చంద్రబాబు పై టీఎంసీ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ శబరి స్పందించారు. ఆమె గతంలో ఆదాయపన్ను శాఖ చేసిన సోదాలు, సిబిటిడి ప్రకటన, చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు గురించి ప్రస్తావించకుండా గత ఎన్నికలలో టీడీపీ గెలిచిందని ,నంద్యాల వంటి చోట్ల కూడా గెలుపొందామని, టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకొచ్చారు. అవినీతి ఆరోపణలకు ,ఈ గెలుపునకు సంబంధం ఏమిటో తెలియదు. 2015లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వ్యూహం పన్ని ,అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపణ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసులో అరెస్టు అయ్యారు. అదే కేసులో చంద్రబాబుపై కూడా తీవ్ర అభియోగాలు రావడం, ఆయన వాయిస్ ఆడియో ఒకటి లీక్ కావడం సంచలనం అయింది. ఆ వెంటనే ఆయన డిల్లీ స్థాయిలో చక్రం తిప్పి తన జోలికి కెసిఆర్ ప్రభుత్వం రాకుండా చేసుకోగలిగారు. అది చంద్రబాబు విశిష్టత. ఎక్కడ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా దేశంలో మరే నేతకు తెలియదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దానికి తోడు పరిస్థితులు కూడా ఆయనకు కలిసి వస్తుంటాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, టీడీపీ, జెడియు పార్టీ వంటి పార్టీల మద్దతు అవసరం కావడంతో ,అప్పటికే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నందున వారికి ప్రాధాన్యత కూడా పెరిగింది.అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మోదీ సరసన చంద్రబాబు కూడా కూర్చోగలిగారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నిస్తే మాత్రం ఏమవుతుంది! ఏమి కాదని తేలిందని అనుకోవచ్చా! సోషల్ మీడియాతో పాటు, సాక్షి వంటి ఒకటి ,రెండు మీడియాలు తప్ప ఇంకేవి వార్తనే ఇవ్వలేదు. అది చంద్రబాబు నైపుణ్యం అని ఒప్పుకోక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Live Show: ఎందుకు అరెస్టు చేయలేదు ?.. చంద్రబాబు స్కాంలు, వెన్నుపోట్ల పై లోక్ సభలో ప్రకంపనలు..
-
Big Question: పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు కేసులపై మోదీకి ప్రశ్న
-
చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు?: ఎంపీ కల్యాణ్ బెనర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వసనీయత లేని, అవినీతిపరులైన నేతల అండతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. అవినీతిపరులైన నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధపురుషులు అయ్యారా అంటూ నిలదీశారు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని అన్నారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కల్యాణ్ బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, జేడీయూల ప్రస్తావన తెచ్చారు. గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోదీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ అనే ఊతకర్రల సాయంతో సభలోకి వస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఆ రెండు కర్రలు పట్టుకునే దేశవిదేశాల్లో మోదీ తిరుగుతున్నారని చెప్పారు. గతంలోలాగా ప్రధాని మోదీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదు అని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష రాజకీయ నేతలపై సీబీఐ, ఈడీ దాడులను ప్రస్తావించిన బెనర్జీ, ఎన్డీఏ పక్షాల నేతలపై కేసుల అంశాన్ని తూర్పారపట్టారు. అవినీతిపరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోదీ పదేపదే ఆరోపణలు చేశారని, మరి చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్లపటేల్ల విషయంలో జరిగిందేమిటీ అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. సీబీఐ, ఈడీలు చంద్రబాబును అరెస్ట్ చేస్తాయా అని నిలదీశారు. టీడీపీ అధినేతను ఎందుకు సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు. బీజేపీ పంచన చేరగానే వాషింగ్ మెషీన్లో వేసిన మాదిరి వారంతా సుద్ధపురుషులు అయ్యారంటూ ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం మోదీ ప్రభుత్వానికి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఆ కంపెనీకి లాభాలు ఎలా వచ్చాయి.. ఎన్నికల సర్వేల అంశాలపై కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా ప్రచారం చేసి, స్టాక్మార్కెట్లో షేర్లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాల రోజున ఒకపైపు స్టాక్‌మార్కెట్ పడిపోయి రూ. 31 లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైపోతే, టీడీపీ అగ్రనేత భార్యకు చెందిన కంపెనీ మాత్రం రూ. 521 కోట్లు ఆ ఒక్కరోజులోనే ఆర్జించింది వెల్లడించారు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఎన్నికల అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత ఏ ప్రధాని కూడా ఈడీ, సీబీఐని ఇంతలా దురి్వనియోగం చేయలేదన్నారు. రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రతిపక్ష పారీ్టలపై వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బెనర్జీ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, బీజేపీకి చెందిన భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓంబిర్లాను కోరారు. -
వాషింగ్ మిషన్ మోదీ బాబు అవినీతి మర్చిపోయారా సారూ..
-
లోక్‌సభ: చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఈడీ, సీబిఐ ఎందుకు అరెస్టు చేయలేదు.. ఆయన అవినీతిపరుడు కాదా ? అంటూ ప్రశ్నించారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? అంటూ నిలదీశారు.ప్రభుత్వం ఏర్పాటు కోసం అవినీతిపరులతో చేతులు కలిపారు. చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటివారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?. బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీపరులుగా మారిపోయారా ?’’ అంటూ దుయ్యబట్టారు.‘‘బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు. టీడీపీ అగ్రనేత ఒకేరోజులో రూ.521 కోట్ల రూపాయలు సంపాదించారు.ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలి’’ అని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. -
Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
శ్రీరాంపూర్‌లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్‌ను సీపీఎం రంగంలోకి దింపింది... హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్డౌన్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్‌ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి.బెనర్జీది దిగజారుడుతనం: బోస్.. కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.తక్షణావసరం ‘భారత్ బచావో’ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్‌యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రెడ్ వాలంటీర్‌గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు. ‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్‌కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’
కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బేనర్జీ అన్నారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైలులో వేసినా తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ కల్యాణ్ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్ గౌతమ్ అనే ఓ న్యాయవాది ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. कल्याण बनर्जी ने फिर की जगदीप धनखड़ की मिमिक्री ◆ संसदीय क्षेत्र श्रीरामपुर में एक सभा के आयोजन के दौरान की मिमिक्री ◆ कहा-"उपराष्ट्रपति धनखड़ अपने पद की संवैधानिक गरिमा को नष्ट कर रहे" TMC MP Kalyan Banerjee | #JagdeepDhankar #KalyanBanerjee pic.twitter.com/fkl79gxiUu — News24 (@news24tvchannel) December 24, 2023 -
‘మిమిక్రీ’పై ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ధన్‌ఖడ్‌కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందానని పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తనను నుంచి తప్పించలేవన్నారు. ధన్‌ఖడ్‌కు మోదీ ఫోన్ ధన్‌ఖడ్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వరిస్తూనే ఉంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని మోదీతో ధన్‌ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీయే ఎంపీలు కూయాయనకు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా బుధవారం లోకసభలో 10 నిమిషాలపాటు లేచి నిల్చున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్‌ఖఢ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్‌ఖడ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంట్‌ను, ఉప రాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఉప రాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు. బీజేపీ ఎంపీపై చర్యలేవి: కాంగ్రెస్ జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంట్లో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. -
20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్కర్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ధన్కర్ స్వయంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్కర్ వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కాగా మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కకర్ మిమిక్రీ చేశారు. పార్లమెంట్ మెట్ల వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ధన్కర్.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్’ వివాదం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి. Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty… — Vice President of India (@VPIndia) December 20, 2023 -
రాజ్యసభ చైర్మన్‌ను వ్యంగ్యంగా అనుకరించిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ
-
మంటలు రేపిన..మాక్ పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల నుంచి తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీసింది. విపక్ష ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం మెట్లపై మాక్ పార్లమెంటు నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాందీతో పాటు పలు విపక్షాల సభ్యులు అందులో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అచ్చంగా సభల్లో మాదిరిగానే సభ్యులంతా నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ సభల నుంచి విపక్ష సభ్యులను భారీగా సస్పెండ్ చేస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. పాలక పక్షానివి నియంతృత్వ పోకడలంటూ దుమ్మెత్తిపోశారు. పార్లమెంటులో అధికార పక్షానికి చెందిన సభ్యుల వ్యవహార శైలిని వ్యంగ్యంగా అనుకరించారు. ఆ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఉన్నట్టుండి లేచి నిలబడి రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ నడక తీరును, హావభావాలను, ఆయన సభను నిర్వహించే తీరును రకరకాలుగా అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. అచ్చం ధన్‌ఖడ్ మాదిరిగానే కాస్త వెనక్కు వంగి నిలబడి, ‘వెన్నెముక’ అంటూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులంతా నవ్వుతూ ఆయన్ను ప్రోత్సహించగా దీన్నంతటినీ రాహుల్ తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ కని్పంచారు. మరికొందరు విపక్షసభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నడిపే తీరును కూడా వ్యంగ్యంగా అనుకరిస్తూ ఆటపట్టించారు. ఇదంతా టీవీ చానళ్లలో లైవ్‌గా ప్రసారమైంది. ముఖ్యంగా ధన్‌ఖడ్‌ను బెనర్జీ అనుకరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిగ్గుచేటు: బీజేపీ విపక్షాల తీరుపై బీజేపీ మండిపడింది. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారరాహిత్యం అట్టడుగుకు దిగజారిందన్నారు. ప్రజాస్వామిక విలువల పరిరక్షకుడినని చెప్పుకునే రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు, దేశానికి సిగ్గుచేటంటూ ఆక్షేపించారు. వెనకబడ్డ సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత రాజ్యాంగ పదవులను అధిష్టించిన వారిని అవమానించడం ఇండియా కూటమి సంస్కృతి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ‘‘ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ను అవమానించి తీరు ఇందుకు తాజా నిదర్శనం. ఓబీసీ అయిన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు ఎంతగా అవమానిస్తున్నదీ దేశమంతా చూస్తూనే ఉంది. ఈ విషయంలో రాహుల్‌ను కోర్టు దోషిగా కూడా తేలి్చంది. రాష్ట్రపతి ముర్మును కూడా అదీర్ రంజన్ చౌధరి రాష్ట్రపత్ని అంటూ అవమానించారు’’ అన్నారు. తీరని అవమానం: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తన అత్యంత దారుణ, సిగ్గుచేటు అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఉదయం రెండుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్ ఎంపీ దిగి్వజయ్‌సింగ్ నినాదాలకు దిగగా కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. విపక్ష ఎంపీలు తనను అనుకరిస్తూ ఎద్దేవా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, పరస్పర విమర్శలు సహజమే. కాకపోతే రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ వంటి వ్యవస్థలపై కనీస గౌరవం చూపాలి. కానీ నేనిప్పడే చానళ్లలో చూశా. చైర్మన్‌ను, స్పీకర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక ఎంపీ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీ పార్టీ సీనియర్ నాయకుడు (రాహుల్) దాన్ని వీడియో తీస్తున్నాడు. ఆయన మీకంటే పెద్ద నాయకుడు. ఇది చాలా దారుణం. అభ్యంతరకరం. అత్యంత సిగ్గుచేటు. ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేనికైనా ఒక హద్దుంటుంది! కానీ ఈ దిగజారుడుతనానికి హద్దంటూ లేదా? మీకు సద్బుద్ధి కలగాలని ఆశించడం తప్ప ఏం చేయగలను?’’ అంటూ మండిపడ్డారు. అనంతరం మరో కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరాన్ని ఉద్దేశించి కూడా ధన్‌ఖడ్ తన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యసభ చైర్మన్ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఒకరు వ్యంగ్యంగా అనుకరిస్తుంటే, ఇంకొకరు వీడియో తీస్తుంటే చూసి నా హృదయం ఎంతగా క్షోభిల్లి ఉంటుందో మీరే ఊహించండి! దేశాన్ని చిరకాలం పాటు పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం దారుణం. మిస్టర్ చిదంబరం! ఏమిటిది? మీకో విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఈ ఉదంతంతో నా మనసు ఎంతగానో గాయపడింది. పైగా ఆ వీడియోను మీ పార్టీ ఇన్స్టా్రగాంలో, పార్టీ ట్విటర్లో కూడా పెట్టారు. తద్వారా నా రైతు నేపథ్యాన్ని, ఒక జాట్‌గా నా సామాజిక నేపథ్యాన్ని, రాజ్యసభ చైర్మన్‌గా నా హోదాను... ఇలా అన్నింటినీ తీవ్రంగా అవమానించారు’’ అంటూ ధన్‌ఖడ్ తీవ్రంగా ఆక్షేపించారు. -
‘ఆమె కాలనాగు, పనికిరాని ఆర్థికమంత్రి’
కోల్‌కతా : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె ఓ కాలనాగు అని, పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆయన వ్యతిరేకించారు. కాగా, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి ఘోరంగా పెరిగిపోయిందని, కిందిస్థాయి నేతల నుంచి పెద్దస్థాయి నేతల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఎంసీలో అంతర్గత వైరుధ్యం మొదలైందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇలాంటి వ్యాఖ్యలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వమని, నిరాశతో ఇలాంటి అర్ధంలేని మాటలు చెబుతున్నారని దిలీప్ వ్యాఖ్యానించారు. -
తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై నిప్పులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై మంగళవారం లోక్‌సభలో బీజేపీ, సీపీఎంలు నిప్పులు చెరిగాయి. ఆయన క్షమాపణ చెప్పకపోతే అభిశంసన తీర్మానం తెస్తామని బీజేపీ హెచ్చరించింది. తృణమూల్ ఎంపీ ఒకరు రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్లో మాట్లాడుతూ మోదీపై, దివంగత ప్రధాని లాల్ బహద్దూర్శాస్త్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఎస్ అహ్లూవాలియా(బీజేపీ) సభలోనే ఉన్న బెనర్జీ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. ఆయన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు సీపీఎం సభ్యులు మహమ్మద్ సలీం, శ్రీమతి టీచర్లు మద్దతు పలికారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. బెనర్జీ ఏమన్నారో చెబుతూ తొలిసారి ఆయన పేరు ప్రస్తావించారు. 2019లో ప్రజలు మోదీని చెంపదెబ్బ కొట్టి తిరిగి గాంధీనగర్‌కు పంపుతారని, ఇక ఆయన అక్కడి నుంచి తిరిగిరారని బె నర్జీ చెప్పారన్నారు. అలాగే, శాస్త్రి జీవించి ఉంటే తన మనవడి చర్యలను(బెంగాల్ బీజేపీ ఇన్చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్) చూసి పెళ్లి చేసుకున్నందుకు విచారపడేవాడని అన్నారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు బెనర్జీ తనంతట తాను బేషరతు క్షమాపణ చెప్పాలన్నారు. వెంకయ్య.. బెనర్జీ పేరును ప్రస్తావించడంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క.. మోదీ, ఇతర నాయకులపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కల్యాణ్ బెనర్జీల వ్యాఖ్యలు పౌర విలువలకు వ్యతిరేకమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం నాటి సమావేశంలో ఖండించింది. కాగా, అభిశంసన తీర్మానం తెస్తామని ప్రభుత్వం బెదిరించినా బెనర్జీ వెనక్కి తగ్గలేదు. రాజకీయ ప్రసంగంలో ఆ వాఖ్యలు చేశానని, వాటిలో తప్పేమీ లేదు కనుక క్షమాపణ చెప్పనని అన్నారు. -
మహాజన్ కు కళ్యాణ్ బెనర్జీ క్షమాపణ
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రైల్వే బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ కు అన్యాయం జరిగిందంటూ లోక్‌సభ కార్యకలాపాలను తృణమూల్ ఎంపీలు అడ్డుకున్నారు. పోడియం వద్దకు దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా స్పీకర్ కు వ్యతిరేకంగా కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'మీరు బీజేపీ స్పీకర్ కాదు. మీరు నరేంద్ర మోడీ స్పీకర్ కాదు' అంటూ వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై అధికార కూటమి మండిపడింది. రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్‌సభలో అధికార బీజేపీ ఎంపీ ఒకరు మద్యం తాగొచ్చి అల్లరి చేశారని కళ్యాణ్ బెనర్జీ మంగళవారం ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ సభ నుంచి బయటకు వెళుతుంటే ఓ బీజేపీ ఎంపీ బెదిరించారని తృణమూల్ మహిళా ఎంపీ కకోలి ఘోష్ తెలిపారు. -
'మహిళా ఎంపీ చీర లాగుతామన్నారు'
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్‌సభలో అధికార బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సదానంద గౌడకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన తృణమూల్ ఎంపీలను బీజేపీ ఎంపీలు అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీలు తనను బెదిరించారని అరుస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను వార్తా చానళ్లు ప్రసారం చేయడంతో కలకలం రేగింది. తాగొచ్చిన బీజేపీ ఎంపీ తమ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ మహిళా ఎంపీ కకోలి ఘోష్ చీర లాగుతానని అతడు బెదిరించాడని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఎంపీ తోసిపుచ్చారు. -
ధరలపై దద్దరిల్లనున్న పార్లమెంట్
గళం విప్పడానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు ఎలాంటి అంశంపైనైనా చర్చించడానికి సిద్ధం: వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రభుత్వానికి ధరల పెరుగుదల కాక గట్టిగానే తగలనుంది. సోమవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షాలు గళం విప్పనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి శనివారం ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో రెండు సభల్లోనూ ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. బడ్జెట్ చర్చ తర్వాత వెంటనే ధరల పెరుగుదల అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. రవాణా చార్జీలు పెరగడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సాధారణ, రైల్వే బడ్జెట్లపై చర్చతో పాటు ఈ సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చిస్తామని, ప్రతిపక్షాలు లేవనెత్తిన ఎలాంటి అంశంపైనైనా సమాధానమివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదే సమయంలో సభ గౌరవ మర్యాదలు కాపాడాలని ప్రతిపక్షాలను కోరారు. ఇరాక్‌లోని భారతీయుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రెండు సభల్లోనూ ప్రకటన చేస్తారని వెల్లడించారు. పోలవరం, ట్రాయ్ ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇస్తామని వెంకయ్య చెప్పారు. పెండింగ్ బిల్లులపై దృష్టి సారిస్తామని, ప్రాధాన్యతను బట్టి వాటిని సభలో ప్రవేశపెడతామని అన్నారు. జాతీయ డిజైన్ ఇన్స్టిట్యూట్పై వాణిజ్య మంత్రిత్వ శాఖ బిల్లు తీసుకువస్తుందని వెల్లడించారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ ఇక ఆగస్టు 14తో ముగిసే ఈ సెషన్లో 168 పనిగంటలతో 28 సిటింగ్‌లు ఉంటాయని సుమిత్ర తెలిపారు. ఈ భేటీ మంచి వాతావరణంలో జరిగిందని, ప్రతిపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయన్నారు. సభ సజావుగా నడవడానికి అందరూ సహకరిస్తామనానరని, అన్ని విషయాలపై చర్చించడానికి ప్రభుత్వమూ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. పలు సూచనలపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ సమావేశాల్లో వెనకాల వరుసలో కూర్చుని మాట్లాడేవాళ్లు కూడా అందరికీ కనబడేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రస్తావన భేటీలో రాలేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాగా, లంచ్‌కు హాజరైన ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీలు భేటీకి రాలేదు. ఈ సమావేశంలో విపక్షాల సంబంధించి కాంగ్రెస్, బీజేడీ, సీపీఎం, ఎస్పీ నేతలు పాల్గొన్నారు.