కోల్‌కతా: వక్ఫ్ బిల్లుపై నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచితంగా ప్రవర్తించారు. బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో జరిగిన వాగ్వాదంలో ఎంపీ బెనర్జీ ఓ గాజు సీసాను పగులగొట్టి దానిని ప్యానల్ చైర్మన్ జగదాంబికా పాల్‌పైకి విసిరారు. ఈ క్రమంలో ఎంపీ బొటనవేలు, చూపుడు వేలికి గాయం కావడంతో ప్రథమ చికిత్స చేశారు. అయితే వారం రోజుల అనంతరం ఆరోజు జరిగిన ఘటనపై తాజాగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించి.. తన చర్యలను సమర్థించుకున్నారు. బీజేపీ ఎంపీ గంగోపాధ్యాయ తనను దుర్భాషలాడారని బెనర్జీ ఆరోపించారు.
‘‘నాకు రూల్స్ , రెగ్యులేషన్స్ అంటే చాలా గౌరవం. దురదృష్టవశాత్తు అభిజిత్ గంగోపాధ్యాయ నాపై నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆరోపణలు చేశారు. ఆ రోజు మొదటగా కాంగ్రెస్ ఎంపీ నసీర్, అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ఆయన నన్ను, నా తల్లి, మా నాన్న , నా భార్యను దుర్భాషలాడడం ప్రారంభించారు. ఆ సమయంలో జేపీసీ చైర్మన్ అక్కడ లేరు. ఛైర్మెన్ అక్కడ లేనప్పుడు.. అభిజిత్ గంగోపాధ్యాయ నా పట్ల కఠినంగా ప్రవర్తించారు.
...కానీ, దీంతో జెపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్.. ఎంపీ గంగోపాధ్యాయ పట్ల పక్షపాతంతో వ్యహరించారు. అది నాకు చాలా విసుగు తెప్పించింది. అప్పుడు నేను టేబుల్‌పై ఉన్న గాజు సీసాని పగులగొట్టాను. నేను దానిని చైర్మన్‌పైకి విసిరేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం ఛైర్మన్‌కు లేదు. స్పీకర్‌కు మాత్రమే అధికారం ఉంది’’ అని అన్నారు.
ఈ ఘటన జరినగి తర్వాత బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ బెనర్జీ చర్యను నిరసిస్తూ చేసిన తీర్మానాన్ని ప్యానెల్ 9-8తో ఆమోదించడంతో అతడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. బీజేపీకి ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షతన కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం అభిప్రాయాలను వింటున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లులో తమ వాటా ఏమిటని విపక్ష సభ్యులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
చదవండి: మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment